Changes from April 1 : బ్యాంకింగ్ నుంచి రైల్వే టికెట్ల వరకు.. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి కొత్త రూల్స్!
భారత ఆర్థిక రంగంలో నేటి నుంచి (ఏప్రిల్ 1, 2026) భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఆర్బీఐ కొత్త నిబంధనల ప్రకారం డిజిటల్ లావాదేవీలకు రెండు అంచెల భద్రత తప్పనిసరి కాగా, యూపీఐ పరిమితులు, పాన్ కార్డు నిబంధనలు, రైల్వే టికెట్ క్యాన్సిలేషన్ రూల్స్‌లో కీలక మార్పులు జరిగాయి.
సైబర్ మోసాలను అరికట్టడానికి, జవాబుదారీతనాన్ని పెంచడానికి ఏప్రిల్ 1, 2026 నుంచి కఠినమైన నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), ఇతర ప్రభుత్వ విభాగాలు అమల్లోకి తీసుకువచ్చాయి. ఈ మార్పులు సామాన్యుల రోజువారీ ఆర్థిక లావాదేవీలపై ప్రభావం చూపనున్నాయి.

డిజిటల్ పేమెంట్లలో భారీ మార్పులు..
ఇకపై యూపీఐ, క్రెడిట్/డెబిట్ కార్డులు లేదా మొబైల్ వాలెట్ల ద్వారా చేసే ప్రతి లావాదేవీకి 'టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్' (2FA) ఉండాలి.
ఓటీపీ మాత్రమే సరిపోదు: కేవలం ఓటీపీతో లావాదేవీ పూర్తి కాదు. ఓటీపీతో పాటు పిన్, పాస్‌వర్డ్, బయోమెట్రిక్ లేదా సెక్యూర్ టోకెన్ వంటి అదనపు వెరిఫికేషన్ అవసరం.
రిస్క్ ఆధారిత భద్రత: చిన్న లావాదేవీలు వేగంగా పూర్తవుతాయి. కానీ, భారీ మొత్తంలో చేసే పేమెంట్లు లేదా కొత్త డివైజ్‌ల నుంచి చేసే లావాదేవీలకు మరిన్ని భద్రతా అంచెలు ఉంటాయి.
బ్యాంకుల జవాబుదారీతనం: సిస్టమ్ లోపాల వల్ల మోసాలు జరిగితే బ్యాంకులు వినియోగదారులకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది.
యూపీఐ కొత్త పరిమితులు..
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) కొన్ని కొత్త రూల్స్ తెచ్చింది:
బ్యాలెన్స్ చెక్: ఒక యాప్ ద్వారా రోజుకు గరిష్టంగా 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.
అకౌంట్ లింకింగ్: ఒక యూపీఐ యాప్‌లో రోజుకు గరిష్టంగా 25 బ్యాంక్ అకౌంట్లను మాత్రమే లింక్ చేయగలరు.
స్టేటస్ చెక్: ఫెయిల్ అయిన లావాదేవీ స్టేటస్‌ను కేవలం 3 సార్లు మాత్రమే చూడొచ్చు. ప్రతి అటెంప్ట్‌కు మధ్య 90 సెకన్ల విరామం ఉండాలి.
ఆటో-డెబిట్ టైమింగ్: ఈఎంఐలు, సబ్‌స్క్రిప్షన్ల ఆటో-డెబిట్ ఇకపై రద్దీ లేని సమయాల్లో (ఉదయం 10 లోపు లేదా రాత్రి 9:30 తర్వాత) జరుగుతాయి.
బ్యాంకింగ్, ఇతర మార్పులు..
ఏటీఎం ఛార్జీలు: హెచ్‌డీఎఫ్‌సీ వంటి బ్యాంకులు యూపీఐ ఆధారిత 'కార్డ్‌లెస్ విత్‌డ్రాయల్స్'ను కూడా నెలవారీ ఉచిత పరిమితిలో లెక్కిస్తాయి. పరిమితి దాటితే రూ. 23 + ట్యాక్స్ ఛార్జీ పడుతుంది.
లౌంజ్ యాక్సెస్: రూపే ప్లాటినం డెబిట్ కార్డ్ హోల్డర్లకు ఇకపై విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లలో ఉచిత లౌంజ్ యాక్సెస్ ఉండదు.
ఫాస్టాగ్ : ఫాస్టాగ్ వార్షిక పాస్ ధర రూ. 3,000 నుంచి రూ. 3,075కి పెరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
రైల్వే టికెట్ క్యాన్సిలేషన్ కొత్త రూల్స్..
భారతీయ రైల్వే రిఫండ్ నిబంధనలను కఠినతరం చేసింది:
8 గంటల లోపు: రైలు బయలుదేరడానికి 8 గంటల ముందు టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ రాదు (0%).
8 నుంచి 24 గంటలు: 50% మాత్రమే రిఫండ్ ఇస్తారు.
24 నుంచి 72 గంటలు: 75% రిఫండ్ లభిస్తుంది.
కొత్త పాన్ కార్డు నిబంధనలు..
ఇకపై కేవలం ఆధార్ కార్డుతో పాన్ కార్డు పొందడం కుదరదు. దరఖాస్తుదారులు తప్పనిసరిగా బర్త్ సర్టిఫికేట్ లేదా పాస్‌పోర్ట్ వంటి అదనపు పుట్టిన తేదీ ధృవీకరణ పత్రాలను సమర్పించాలి. అలాగే పాన్‌లోని పేరు ఆధార్‌తో కచ్చితంగా సరిపోలాలి. కొత్త కేటగిరీ ఫారాలు (ఫామ్ 93-96) కూడా తప్పనిసరి చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


