Bullet Rail In AP : విజయవాడ టూ విశాఖ బుల్లెట్ రైల్.. ఊహించనంత ఫాస్ట్‌గా వెళ్లిరావొచ్చు!
vijayawada visakhapatnam high speed bullet train : ఆంధ్రప్రదేశ్‌లో కీలకమైన రూట్లలో హైస్పీడ్ రైళ్లు రానున్నాయి. ఈ మేరకు రైల్వేశాఖ ఆలోచనలు చేస్తోంది. ప్రయాణాల సమయాన్ని వీలైనంతగా తగ్గించేందుకు ప్రణాళికలు జరుగుతున్నాయి.
2026 కేంద్ర బడ్జెట్ భారతదేశం అంతటా 7 హైస్పీడ్ రైల్ కారిడార్లను ప్రకటించింది. ఇప్పుడు విజయవాడ టూ విశాఖపట్నం మధ్య బుల్లెట్ రైలును ప్రవేశపెట్టే ప్రతిపాదనపై కసరత్తు జరుగుతోంది. కొంతకాలం క్రితం కేంద్ర ప్రభుత్వం అహ్మదాబాద్-ముంబై మధ్య 2 గంటల కంటే తక్కువ ప్రయాణ సమయంతో వెళ్లేలా బుల్లెట్ రైలును ప్రకటించింది. కారిడార్ ప్రారంభానికి అంచనా వేసిన సమయం ఆగస్టు, 2027.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ-విశాఖపట్నం మధ్య బుల్లెట్ రైలు ప్రాజెక్టును పరిశీలన చేస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం భూమి కోసం అన్వేషిస్తోంది. ఇది కాకుండా విజయవాడ-కర్నూలు మధ్య సెమీ హై-స్పీడ్ రైలును ప్లాన్ చేస్తున్నారు. ఫైనల్ లోకేషన్ సర్వే చేయడానికి రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు వెళ్లాయి. మరోవైపు అమరావతి గుండా వెళ్ళే హైదరాబాద్-చెన్నై, కర్నూలు, అనంతపురం గుండా వెళ్ళే హైదరాబాద్-బెంగళూరు కారిడార్లను, చిత్తూరు గుండా వెళ్ళే చెన్నై-బెంగళూరు కారిడార్‌ను అభివృద్ధి చేయనున్నారు.
విజయవాడ-విశాఖ బుల్లెట్ రైల్ కారిడార్ 350 కిలో మీటర్ల వరకు ఉంటుంది. ఈ రైల్ అందుబాటులోకి వస్తే.. 2 గంటల్లోపే ప్రయాణం రెండు నగరాల మధ్య ఉంటుంది. చాలా ఫాస్ట్‌గా వెళ్లి రావొచ్చు. అంతేకాదు.. హైదరాబాద్‌కు కూడా కనెక్టివిటీ పెరగనుంది. 320 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో బుల్లెట్ రైళ్లు ఈ రూట్‌లో పరుగులు పెడతాయి. ఏలూరు, రాజమహేంద్రవరం, కాకినాడ మీదుగా ఈ రూట్ ఉంటుంది.
రైలు కనెక్టివిటీ, విమానాశ్రయాల అభివృద్ధిపై సమానంగా దృష్టి సారిస్తున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. ఆంధ్రప్రదేశ్‌కు బుల్లెట్ రైలు వస్తే అది పెద్ద ముందడుగు అవుతుంది.
కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన హై-స్పీడ్ రైలు ప్రాజెక్టులు దక్షిణ భారతదేశంలో అంతర్ నగర ప్రయాణాన్ని గణనీయంగా మారుస్తాయని గతంలోనే రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. బెంగళూరు-చెన్నై-హైదరాబాద్ హై-స్పీడ్ రైలు కారిడార్‌ను డైమండ్ ప్రాజెక్ట్‌గా అభివృద్ధి చేస్తామన్నారు. హైస్పీడ్ కారిడార్‌తో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మధ్య ఆర్థిక, హెల్త్ టూరిజం అభివృద్ధి చెందుతుందని తెలిపారు.
మరోవైపు బెంగళూరు-చెన్నై కారిడార్ ప్రయాణ సమయాన్ని కేవలం ఒక గంట 13 నిమిషాలకు తగ్గిస్తుందని అన్నారు. 'బెంగళూరు-చెన్నై ఒక విధంగా రెండు విలీన నగరాలుగా మారతాయి. రోజులో ఏ సమయంలోనైనా వెళ్లి రావొచ్చు. చెన్నైలో పని పూర్తి చేసి అదే రోజు బెంగళూరుకు తిరిగి రావచ్చు. అదేవిధంగా బెంగళూరు-హైదరాబాద్ హై-స్పీడ్ రైలు మార్గం ప్రయాణ సమయం దాదాపు రెండు గంటలు మాత్రమే అవుతుంది.' అని మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు.
వైజాగ్-విజయవాడ మధ్య బుల్లెట్ రైలు కంప్లీట్ అయితే ఈ నగరాలకు కూడా వేగంగా చేరుకోవచ్చు. విశాఖ నుంచి హైదరాబాద్, విశాఖ నుంచి చెన్నై, బెంగళూరులాంటి నగరాలకు ప్రయాణ సమయం తగ్గనుంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


