తిరుమల వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. వీక్లీ స్పెషల్ ట్రైన్స్, షెడ్యూల్ చూడండి!

తిరుమల వెళ్లేవారికి రైల్వే శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. విశాఖపట్నం-తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ మేరకు షెడ్యూల్ ప్రకటించింది.

Published on: Aug 13, 2026, 15:41:40 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు, ఉత్తరాంధ్ర - కోస్తా ఆంధ్ర మధ్య ప్రయాణించే ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ అందించింది. రాబోయే పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని, పెరిగిన ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు తిరుపతి - విశాఖపట్నం (08509/08510) మధ్య ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

తిరుపతి-విశాఖపట్నం ప్రత్యేక రైళ్లు
తిరుపతి-విశాఖపట్నం ప్రత్యేక రైళ్లు

ఈ నిర్ణయంతో సాగర తీర నగరం విశాఖ నుంచి ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతికి రాకపోకలు సాగించే వారికి సీట్ల కొరత సమస్య తీరనుంది. ఆగస్టు 16 నుంచి సెప్టెంబరు 11 వరకు ప్రత్యేక సర్వీసులు నడవనున్నాయి. ఇరు వైపులా వారానికి రెండు రోజుల పాటు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికుల సౌకర్యార్థం 22 ఏసీ, స్లీపర్, జనరల్ బోగీలు అమర్చారు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, రైల్వే రిజర్వేషన్ కౌంటర్లలో టికెట్ల బుకింగ్ ప్రారంభమైంది.

తిరుపతి - విశాఖపట్నం (స్పెషల్ ట్రైన్ నం. 08509)

తిరుపతి నుంచి విశాఖ వైపు వెళ్లే ప్రయాణికులకు ఆగస్టు 16వ తేదీన తొలి సర్వీస్ ప్రారంభమవుతుంది. సెప్టెంబరు 10 వరకు ఈ రైలు సేవలు కొనసాగుతాయి. ప్రతి ఆదివారం, గురువారం నడుస్తాయి. ఉదయం 09:50 గంటలకు తిరుపతిలో బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 06:30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.

విశాఖపట్నం - తిరుపతి (స్పెషల్ ట్రైన్ నం. 08510)

విశాఖపట్నం నుంచి తిరుపతి దిశగా ప్రయాణించే శ్రీవారి భక్తుల కోసం ఆగస్టు 17 నుంచి సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. సెప్టెంబరు 11 వరకు ఈ ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుంది. ప్రతి సోమవారం, శుక్రవారం నడుస్తాయి. రాత్రి 07:40 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి.. మరుసటి రోజు సాయంత్రం 06:45 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది.

రద్దీకి తగినట్లుగా ఈ రైలుకు మొత్తం 22 కోచ్‌లు కేటాయించారు. అన్ని వర్గాల ప్రయాణికుల అవసరాలను తీర్చేలా ఏసీ క్లాస్, స్లీపర్ క్లాస్‌తో పాటు సాధారణ ప్రయాణికుల కోసం జనరల్ బోగీలను పొందుపరిచారు. ముందస్తుగా ప్రయాణం ప్లాన్ చేసుకునే వారు ఐఆర్‌సీటీసీద్వారా ఆన్‌లైన్‌లో రిజర్వేషన్ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని రైల్వే అధికారులు తెలిపారు.

మచిలీపట్నం - సాయి నగర్ షిరిడీ ఎక్స్‌ప్రెస్‌లో ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు

ప్రయాణికుల సురక్షిత ప్రయాణానికి, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతికి ప్రాధాన్యతనిస్తూ దక్షిణ కోస్తా రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. మచిలీపట్నం-సాయి నగర్ షిరిడీ మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైలుకు పాత సంప్రదాయ ఐసీఎఫ్ కోచ్‌ల స్థానంలో అత్యంత ఆధునికమైన, సురక్షితమైన ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు విజయవాడ డివిజన్ సీపీఆర్వో అధికారికంగా ప్రకటించారు.

రైలు నంబర్ 17208 (మచిలీపట్నం – సాయి నగర్ షిరిడీ): 2026 ఆగస్టు 11వ తేదీ నుంచి ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో నడుస్తుంది. రైలు నంబర్ 17207(సాయి నగర్ షిరిడీ – మచిలీపట్నం) 2026 ఆగస్టు 12వ తేదీ నుంచి నూతన ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో సేవలు అందిస్తుంది.

జర్మన్ సాంకేతికతతో రూపొందించిన ఈ కోచ్‌లు యాంటీ-టెలిస్కోపిక్ డిజైన్‌ను కలిగి ఉంటాయి. ప్రమాదాలు జరిగినా బోగీలు ఒకదానిపైకి ఒకటి ఎక్కవు లేదా బోల్తా పడవు. ఈ రైళ్లు గంటకు 120 నుండి 130 కిలోమీటర్ల వేగంతో సురక్షితంగా ప్రయాణించగలవు, దీనివల్ల ప్రయాణ సమయం తగ్గుతుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More