భక్తులకు గుడ్‌న్యూస్.. తిరుపతి - సాయినగర్ షిర్డీ వీక్లీ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేక రైలు!
తిరుపతి - సాయినగర్ షిర్డీ - తిరుపతి వీక్లీ ఎక్స్‌ప్రెస్ అధికారికంగా ప్రారంభమైంది. ఈ ట్రైన్ ప్రయాణికులకు చాలా ఉపయోగకరంగా ఉండనుంది.
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, మహారాష్ట్రలోని సాయినగర్ షిర్డీ రెండు ప్రధాన పుణ్యక్షేత్రాలను కలిపే కొత్త వీక్లీ ప్రత్యేక రైలు సర్వీసు మంగళవారం ప్రారంభమైంది. ఈ రైలు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర గుండా నడుస్తుంది. ఈ మార్గంలో 31 ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతుంది. ఈ సేవను రైల్వే, జలశక్తి శాఖ సహాయ మంత్రి వి.సోమన్న వర్చువల్ ద్వారా ప్రారంభించారు. ఏపీ రోడ్లు, భవనాల మంత్రి బి.సి.జనార్ధన్ రెడ్డి.. తిరుపతి నుండి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సోమన్న మాట్లాడుతూ.. తిరుపతి-సాయినగర్ షిర్డీ ఎక్స్‌ప్రెస్ నాలుగు రాష్ట్రాలలోని భక్తులకు ఒక ముఖ్యమైన రోజు అని అన్నారు. ఈ రైలు ఇప్పుడు నెల్లూరు, గుంటూరు, సికింద్రాబాద్, బీదర్, మన్మాడ్ వంటి ప్రధాన స్టేషన్లను నేరుగా కలుపుతుందని, యాత్రికులకు ప్రయాణ సౌకర్యాన్ని మెరుగుపరుస్తుందని అన్నారు.
ఈ సేవ టెంపుల్ టూరిజానికి తోడ్పడుతుందని, ప్రాంతీయ కనెక్టివిటీని బలోపేతం చేస్తుందని, ఈ మార్గంలో ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తుందని కేంద్రమంత్రి చెప్పారు. ఈ రైలు మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక, సికింద్రాబాద్ నుండి వచ్చే ప్రయాణికులకు కనెక్టివిటీని పెంచుతుంది.
ఈ కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు ఈ ప్రాంతంలో టెంపుల్ టూరిజాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుందని, రెండు ప్రధాన ఆధ్యాత్మిక ప్రదేశాల మధ్య ప్రయాణించే యాత్రికులకు ప్రయోజనం చేకూరుస్తుందని రాష్ట్ర మంత్రి జనార్దన్ రెడ్డి అన్నారు.
వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు నంబర్ 17425/17426 గూడూరు, గుంటూరు, సికింద్రాబాద్, వికారాబాద్, ఛత్రపతి శంభాజీనగర్ మీదుగా నడుస్తుంది. తిరుపతి నుంచి షిర్డీ ఆధ్యాత్మిక పట్టణాల మధ్య ప్రయాణించే ప్రయాణికులకు మెరుగైన కనెక్టివిటీని అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర అంతటా ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణ ఆప్షన్స్ అందించడం ద్వారా ప్రయోజనం చేకూరుస్తుంది.
రైలు నెం.07425/07426 డిసెంబర్ 9, 10, 2025 తేదీల్లో నడుస్తోంది. డిసెంబర్ 10వ తేదీన రాత్రి రైలు నెం. 07426.. 10:20 గంటలకు షిర్డీ నుంచి బయలుదేరుతుంది. సాధారణ వీక్లీ ట్రైన్ రైలు నెం. 17425/17426 డిసెంబర్ 14 నుంచి మెుదలవుతుంది. రైలు నెంబర్ 17425 ప్రతి ఆదివారం ఉదయం 4:00 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి వెళ్తుంది. రైలు నెంబర్ 17426 ప్రతి సోమవారం రాత్రి 7:35 గంటలకు సాయి నగర్ షిర్డీ నుంచి ఇటు వస్తుంది.
తిరుపతిలో రూ.312 కోట్లతో నిర్మిస్తున్న తిరుపతి అమృత్ స్టేషన్ ప్రాజెక్ట్, తిరుపతి-పాకాల-కాట్పాడి లైన్ డబ్లింగ్, గూడూరు-రేణిగుంట మూడో లైన్, నడికుడి-శ్రీకాళహస్తి కొత్త లైన్, విజయవాడ-గూడూరు మూడో లైన్, ఏర్పేడు–పూడి బైపాస్ లైన్ వంటి రైల్వే పనులపైన కేంద్రమంత్రి సోమన్న మాట్లాడారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


