విశాఖపట్నంలోని పర్యాటక ప్రదేశాలతోపాటుగా విజయనగరం శ్రీ రామనారాయణం ఆలయం పర్యటన చేయాలనుకునే టూరిస్టులకు ఐఆర్‌సీటీసీ గుడ్‌న్యూస్ అందిస్తోంది. 1 రాత్రి, రెండు రోజుల టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. ఈ టూర్ ప్రతీ రోజూ ఉంటుంది. విశాఖలోని ప్రముఖ ఆలయాలు, పర్యటక ప్రదేశాలను తక్కువ ధరలో చూసిరావొచ్చు. గ్లోరియస్ ఆంధ్రా విత్ శ్రీ రామనారాయణం పేరుతో ఆపరేట్ చేస్తోంది. ఇందులో సింహాచలం ఆలయం, తొట్ల కొండ బౌద్ధ సముదాయాలు, విజయనగరం శ్రీరామనారాయణం ఆలయాలతో పాటు బీచ్‌ను సందర్శించవచ్చు.

మెుదటి రోజు టూర్
ఉదయం 07:00 - విశాఖ రైల్వే స్టేషన్/బస్ డిపో/విమానాశ్రయం నుంచి పికప్ చేసుకుని హోటల్‌కి తీసుకెళ్తారు. హోటల్ లో చెక్ ఇన్ అయ్యి అల్పాహారం చేస్తారు.
09:00 నుంచి 09:30 వరకు - బ్రేక్ ఫాస్ట్ తర్వాత హోటల్ నుంచి రుషికొండ బీచ్‌కి వెళ్తారు. (14 కిమీ, 30 నిమిషాల ప్రయాణం ఉంటుంది).
09:30 నుంచి 11:30 వరకు - రుషికొండ బీచ్ సందర్శన
11:30 నుంచి 11:45 వరకు - రుషికొండ బీచ్ నుంచి తొట్లకొండ బౌద్ధ సముదాయానికి ప్రయాణం చేస్తారు.
11:45 AM నుంచి 12:15 PM వరకు - తొట్లకొండ బౌద్ధ సముదాయం సందర్శన ఉంటుంది.
12:15 నుంచి 12:30 వరకు - తొట్లకొండ బౌద్ధ ఆలయం నుంచి పురాతన బావికొండకు ప్రయాణం అవుతారు.
12:30 PM నుంచి 1 :00 PM వరకు - బావికొండ పురాతన బౌద్ధ విహారం సందర్శన ఉంటుంది.
1:00 నుండి 2:00 వరకు - సమీపంలోని రెస్టారెంట్/హోటల్‌లో మధ్యాహ్న భోజనం చేయాలి(సొంత ఖర్చులు)
2:00 నుండి 4:00 వరకు - మధ్యాహ్న భోజనం తర్వాత కైలాషగిరి హిల్స్ పార్క్ సందర్శన చేస్తారు.
{{/usCountry}}2:00 నుండి 4:00 వరకు - మధ్యాహ్న భోజనం తర్వాత కైలాషగిరి హిల్స్ పార్క్ సందర్శన చేస్తారు.
{{/usCountry}}4:00 నుండి 5:20 వరకు - కైలాషగిరి హిల్స్ పార్క్ నుంచి శ్రీరామనారాయణ దేవాలయం(విజయనగరం) సందర్శనకు వెళ్తారు.
5:20 నుంచి 7:00 PM వరకు - శ్రీ రామనారాయణం ఆలయం సందర్శన, లేజర్ షో వీక్షిస్తారు.
సాయంత్రం 7:00 నుంచి 8:30 వరకు - రామనారాయణం ఆలయం నుంచి విశాఖపట్నంలోని హోటల్‌కు తిరుగు ప్రయాణం అవుతారు. హోటల్‌లో డిన్నర్ చేసి రాత్రి బస చేస్తారు.
రెండో రోజు టూర్
ఉదయం 08:00 గంటలకు -బ్రేక్ ఫాస్ట్ తర్వాత, హోటల్ నుంచి చెక్-అవుట్ అయ్యి సింహాచలం ఆలయానికి ప్రయాణం అవుతారు
09:00 - సింహాచలం దేవాలయానికి చేరుకుంటారు.
09:00 నుంచి 11:00 వరకు - సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుంటారు.
11:00 నుంచి 11:45 వరకు - సింహాచలం దేవస్థానం నుంచి విశాఖ మ్యూజియం సందర్శనకు ప్రయాణం అవుతారు.
11:45 నుంచి 12:15 వరకు - విశాఖ మ్యూజియంలో సందర్శన ఉంటుంది(శుక్రవారం క్లోజ్ ఉంటుంది).
12:15 నుంచి 12:20 వరకు - విశాఖ మ్యూజియం నుంచి మత్స్య దర్శిని చూసేందుకు బయలుదేరతారు.
12:20 నుంచి మధ్యాహ్నం 1:00 వరకు - మత్స్య దర్శిని సందర్శన
1:00 నుంచి 2:00 వరకు - సమీపంలోని రెస్టారెంట్/హోటల్‌లో భోజనం (సొంత ఖర్చులతో)
2:00 నుంచి 3:00 వరకు - భోజనం తర్వాత ఎయిర్‌క్రాఫ్ట్ మ్యూజియం సందర్శిస్తారు.
3:00 నుంచి 4:00 వరకు- జలాంతర్గామి మ్యూజియం సందర్శన చేస్తారు(సోమవారం క్లోజ్ ఉంటుంది). రామనాయుడు ఫిల్మ్ స్టూడియో సందర్శిస్తారు.
4:00 నుంచి 4:30 వరకు - ఆర్కే బీచ్ సందర్శిస్తారు.
4:30 నుంచి 5:00 వరకు - ఆర్కే బీచ్ నుంచి బయలుదేరి రైల్వే స్టేషన్/బస్ డిపో/విమానాశ్రయం వద్ద డ్రాప్ చేస్తారు. దీంతో టూర్ అయిపోతుంది.
ప్యాకేజీ ధరలు
ఒక వ్యక్తి ధర(1 నుంచి 3 వ్యక్తుల వరకు) : సింగిల్ ఆక్యుపెన్సీ ధర రూ. 15000, డబుల్ ఆక్యుపెన్సీ 8165, ట్రిపుల్ ఆక్యుపెన్సీ 6210, చైల్డ్ విత్ బెడ్ 5095, చైల్డ్ వితౌట్ బెడ్ ధర రూ.3045గా ఉంది.
ఒక వ్యక్తి ధర(4 నుంచి 6 వ్యక్తుల వరకు) : డబుల్ ఆక్యుపెన్సీ రూ.6945, ట్రిపుల్ ఆక్యుపెన్సీ 6595, చైల్డ్ విత్ బెడ్ 5415, చైల్డ్ వితౌట్ బెడ్ ధర రూ.5190గా ఉంది.
ఒక వ్యక్తి ధర(7 నుంచి 10 వ్యక్తుల వరకు) : డబుల్ ఆక్యుపెన్సీ రూ.6015, ట్రిపుల్ ఆక్యుపెన్సీ 5660, చైల్డ్ విత్ బెడ్ 4545, చైల్డ్ వితౌట్ బెడ్ ధర రూ.4260గా ఉంది.
పూర్తి వివరాలకు www.irctctourism.comను సంప్రదించవచ్చు.