ఈ తేదీల్లో విశాఖలో నేషనల్ టూరిజం మార్ట్.. పర్యాటకాన్ని పోత్సహించేలా!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా విశాఖపట్నం వేదికగా నేషనల్ టూరిజం మార్ట్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఏపీ ప్రభుత్వం, అసోసియేషన్ ఆఫ్ డొమెస్టిక్ టూర్ ఆపరేటర్స్ ఆఫ్ ఇండియా (ADTOI) సహకారంతో ఫిబ్రవరి 13, 14, 2026 తేదీలలో విశాఖపట్నంలో రెండు రోజుల నేషనల్ టూరిజం మార్ట్-2025ను నిర్వహించనున్నాయి. ఈ మేరకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.

దేశీయ పర్యాటకం వేగంగా అభివృద్ధి చెందడానికి, పర్యాటక శాఖ సీనియర్ అధికారులు, ADTOI ప్రతినిధుల సమక్షంలో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు. రాష్ట్రంలో కోస్టల్ టూరిజం, ఆధ్యాత్మిక సర్క్యూట్‌లు, వారసత్వ కట్టడాలు, పర్యావరణ-సాహస పర్యాటకం, ఏజెన్సీ (గిరిజన) ప్రాంత పర్యాటకాన్ని జాతీయ స్థాయిలో ప్రదర్శించడానికి ఈ కార్యక్రమం ఒక వేదికగా ఉపయోగపడుతుందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సంస్కృతి, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ టూర్ ఆపరేటర్లు, హోటల్ యజమానులు, డెస్టినేషన్ ప్రమోటర్లు, పర్యాటక వాటాదారులు, ప్రయాణ నిపుణులు ఈ టూరిజం మార్ట్‌లో పాల్గొంటారు. నెట్‌వర్కింగ్ సెషన్‌లు, డెస్టినేషన్ ప్రజెంటేషన్‌లు, వ్యాపార సమావేశాలు, ప్యానెల్ చర్చలు ఈ కార్యక్రమంలో ఉంటాయి. స్థానిక పర్యాటక వాటాదారులు.. జాతీయ స్థాయిలో ప్రత్యక్ష వ్యాపార సంబంధాలను ఏర్పరచుకోవడానికి వీలు కల్పిస్తాయని మంత్రి దుర్గేష్ అన్నారు.
ఈ నేషనల్ టూరిజం మార్ట్‌తో పర్యాటకుల సంఖ్యను పెంచడానికి, స్థానిక ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి, దీర్ఘకాలిక వ్యాపార సంబంధాలను పెంపొందించడానికి, రాష్ట్రానికి జాతీయ స్థాయి గుర్తింపును పొందడంలో సహాయపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
దేశీయ పర్యాటకాన్ని బలోపేతం చేయడం, రాష్ట్రంలో అంతగా తెలియని పర్యాటక ప్రదేశాలను ప్రోత్సహించడం, వెలుగులోకి తీసుకురావడం, స్థానిక సమాజాలకు స్థిరమైన పర్యాటక వృద్ధి, ఉపాధిని నిర్ధారించడం తమ లక్ష్యం అని ADTOI ప్రతినిధులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో భాగస్వామ్యంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన, సమగ్రమైన పర్యాటక వృద్ధిని సాధించడానికి జాతీయ స్థాయిలో కలిసి పనిచేయడానికి కట్టుబడి ఉన్నామన్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


