ప్రముఖ పుణ్య క్షేత్రాలను దర్శించుకోవానుకునేవారి కోసం ఐఆర్‌సీటీసీ గొప్ప ప్యాకేజీలను అందిస్తోంది. అందులో భాగంగా దివ్య దక్షిణ యాత్ర విత్ జ్యోతిర్లింగ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఎలాంటి టెన్షన్ లేకుండా ఐఆర్‌సీటీసీ వారు మిమ్మల్ని తీసుకెళ్తారు. 2026 ఫిబ్రవరి 21న ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల నుంచి బోర్డింగ్ పాయింట్ ఇచ్చారు. మీరు ఇబ్బంది లేకుండా ఈ టూర్‌ను ఎంజాయ్ చేసి రావొచ్చు.

తిరువణ్ణామలై (అరుణాచలం) - రామేశ్వరం - మధురై - కన్యాకుమారి - త్రివేండ్రం - తిరుచ్చి - తంజావూరు మీరు చూసి రావొచ్చు. ఈ పర్యటన 7 రోజులు, 8 రాత్రులుగా ఉంటుంది. సికింద్రాబాద్, జనగామ, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గుడూరు, రేణిగుంట స్టేషన్లలో రైలు ఎక్కవచ్చు.
ఫిబ్రవరి 21న మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్ నుంచి రైలు బయలుదేరనుంది. మరుసటి రోజు ఉదయం 9:15 గంటలకు అరుణాచలం చేరుకుంటుంది. వసతి గృహానికి వెళ్తారు. చెక్ అవుట్ చేసి అరుణాచలం ఆలయాన్ని సందర్శిస్తారు. రామేశ్వరం ప్రయాణం కోసం రైలు ఎక్కేందుకు తిరువణ్ణామలై రైల్వే స్టేషన్‌లో సాయంత్రం డ్రాప్ చేస్తారు.
మూడో రోజు కుదల్‌నగర్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. రోడ్డు మార్గంలో రామేశ్వరానికి బదిలీ వెళ్తారు. హోటల్‌లో చెక్ ఇన్ అవుతారు. ఫ్రెష్ అయిన తర్వాత స్థానిక దేవాలయాలను సందర్శిస్తారు. రామేశ్వరంలో రాత్రి భోజనం, బస ఉంటుంది.
నాలుగో రోజు భోజనం తర్వాత బస్సులో రామేశ్వరం నుండి మధురైకి బయలుదేరుతారు. సాయంత్రం మీనాక్షి అమ్మన్ ఆలయాన్ని సందర్శించి షాపింగ్ చేస్తారు. కన్యాకుమారికి రైలు ఎక్కడానికి కుదల్ నగర్ రైల్వే స్టేషన్ వెళ్తారు.
ఐదో రోజు ఉదయం కన్యాకుమారి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. హోటల్ చెక్ ఇన్ అవుతారు. రాక్ మెమోరియల్, గాంధీ మండపం, సన్‌సెట్ పాయింట్ సందర్శించడం ఉంటుంది. కన్యాకుమారిలో డిన్నర్, రాత్రి బస చేస్తారు.
{{/usCountry}}ఐదో రోజు ఉదయం కన్యాకుమారి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. హోటల్ చెక్ ఇన్ అవుతారు. రాక్ మెమోరియల్, గాంధీ మండపం, సన్‌సెట్ పాయింట్ సందర్శించడం ఉంటుంది. కన్యాకుమారిలో డిన్నర్, రాత్రి బస చేస్తారు.
{{/usCountry}}ఆరో రోజు తదుపరి ప్రయాణం కోసం రైలు ఎక్కడానికి కన్యాకుమారి రైల్వే స్టేషన్‌కు వెళ్తారు. త్రివేండ్రం (తిరువనంతపురం నార్త్) బయలుదేరుతారు. తిరువనంతపురం నార్త్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. శ్రీ పద్మనాభస్వామి ఆలయం, కోవలం బీచ్‌ను సందర్శించడానికి వెళ్తారు. తిరుచిరాపల్లికి తదుపరి ప్రయాణం కోసం తిరువనంతపురంలో రైలు ఎక్కుతారు.
ఏడో రోజు తిరుచిరాపల్లి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. వసతి గృహానికి వెళ్తారు. ఫ్రెష్ అయిన తర్వాత శ్రీరంగం ఆలయాన్ని సందర్శిస్తారు. భోజనం తర్వాత రోడ్డు మార్గంలో తంజావూరుకు (సుమారు 60 కి.మీ/01.30 గంటలకు) బయలుదేరుతారు. బృహదీశ్వర ఆలయాన్ని సందర్శిస్తారు. సికింద్రాబాద్‌కు తిరుగు ప్రయాణం కోసం తంజావూరు రైల్వే స్టేషన్‌లో రైలు ఎక్కుతారు. రాత్రి ఎనిమిది గంటలకు ట్రైన్ ఉంటుంది. ఎనిమిదో రోజు ప్రయాణంలోనే ఉంటారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు రాత్రి 9 గంటలకు రైలు చేరుకుంటుంది.
దివ్య దక్షిణ్ యాత్ర విత్ జ్యోతిర్లింగ టూర్ ప్యాకేజీ చూస్తే.. ఎకానమీ రూ.14,700, అదే చిన్నవారికి రూ.13,800గా నిర్ణయించారు. స్టాండర్డ్ క్లాస్ అయితే పెద్దవారికి రూ.22,300, పిల్లలకు రూ.21,200గా ఉంది. కంఫర్ట్ క్లాస్ అయితే పెద్దలకు రూ.28,700, చిన్నారులకు రూ.27,400గా నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం ఐఆర్‌సీటీసీ టూరిజం అధికారిక వెబ్‌సైట్ సందర్శించండి.