ఐఆర్‌సీటీసీ దివ్య దక్షిణ్ యాత్ర విత్ జ్యోతిర్లింగ టూర్.. ఏపీ, తెలంగాణ నుంచి ప్యాకేజీ!
దక్షిణ భారతదేశంలోని ప్రముఖ ఆలయాలను దర్శించుకోవాలనుకుంటున్నారా? ఐఆర్‌సీటీసీ మీకోసం దివ్య దక్షిణ్ యాత్ర విత్ జ్యోతిర్లింగ టూర్ ప్యాకేజీని అందిస్తోంది. దీని గురించి వివరాలు తెలుసుకుందాం..
ప్రముఖ పుణ్య క్షేత్రాలను దర్శించుకోవానుకునేవారి కోసం ఐఆర్‌సీటీసీ గొప్ప ప్యాకేజీలను అందిస్తోంది. అందులో భాగంగా దివ్య దక్షిణ యాత్ర విత్ జ్యోతిర్లింగ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఎలాంటి టెన్షన్ లేకుండా ఐఆర్‌సీటీసీ వారు మిమ్మల్ని తీసుకెళ్తారు. 2026 ఫిబ్రవరి 21న ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల నుంచి బోర్డింగ్ పాయింట్ ఇచ్చారు. మీరు ఇబ్బంది లేకుండా ఈ టూర్‌ను ఎంజాయ్ చేసి రావొచ్చు.

తిరువణ్ణామలై (అరుణాచలం) - రామేశ్వరం - మధురై - కన్యాకుమారి - త్రివేండ్రం - తిరుచ్చి - తంజావూరు మీరు చూసి రావొచ్చు. ఈ పర్యటన 7 రోజులు, 8 రాత్రులుగా ఉంటుంది. సికింద్రాబాద్, జనగామ, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గుడూరు, రేణిగుంట స్టేషన్లలో రైలు ఎక్కవచ్చు.
ఫిబ్రవరి 21న మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్ నుంచి రైలు బయలుదేరనుంది. మరుసటి రోజు ఉదయం 9:15 గంటలకు అరుణాచలం చేరుకుంటుంది. వసతి గృహానికి వెళ్తారు. చెక్ అవుట్ చేసి అరుణాచలం ఆలయాన్ని సందర్శిస్తారు. రామేశ్వరం ప్రయాణం కోసం రైలు ఎక్కేందుకు తిరువణ్ణామలై రైల్వే స్టేషన్‌లో సాయంత్రం డ్రాప్ చేస్తారు.
మూడో రోజు కుదల్‌నగర్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. రోడ్డు మార్గంలో రామేశ్వరానికి బదిలీ వెళ్తారు. హోటల్‌లో చెక్ ఇన్ అవుతారు. ఫ్రెష్ అయిన తర్వాత స్థానిక దేవాలయాలను సందర్శిస్తారు. రామేశ్వరంలో రాత్రి భోజనం, బస ఉంటుంది.
నాలుగో రోజు భోజనం తర్వాత బస్సులో రామేశ్వరం నుండి మధురైకి బయలుదేరుతారు. సాయంత్రం మీనాక్షి అమ్మన్ ఆలయాన్ని సందర్శించి షాపింగ్ చేస్తారు. కన్యాకుమారికి రైలు ఎక్కడానికి కుదల్ నగర్ రైల్వే స్టేషన్ వెళ్తారు.
ఐదో రోజు ఉదయం కన్యాకుమారి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. హోటల్ చెక్ ఇన్ అవుతారు. రాక్ మెమోరియల్, గాంధీ మండపం, సన్‌సెట్ పాయింట్ సందర్శించడం ఉంటుంది. కన్యాకుమారిలో డిన్నర్, రాత్రి బస చేస్తారు.
ఆరో రోజు తదుపరి ప్రయాణం కోసం రైలు ఎక్కడానికి కన్యాకుమారి రైల్వే స్టేషన్‌కు వెళ్తారు. త్రివేండ్రం (తిరువనంతపురం నార్త్) బయలుదేరుతారు. తిరువనంతపురం నార్త్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. శ్రీ పద్మనాభస్వామి ఆలయం, కోవలం బీచ్‌ను సందర్శించడానికి వెళ్తారు. తిరుచిరాపల్లికి తదుపరి ప్రయాణం కోసం తిరువనంతపురంలో రైలు ఎక్కుతారు.
ఏడో రోజు తిరుచిరాపల్లి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. వసతి గృహానికి వెళ్తారు. ఫ్రెష్ అయిన తర్వాత శ్రీరంగం ఆలయాన్ని సందర్శిస్తారు. భోజనం తర్వాత రోడ్డు మార్గంలో తంజావూరుకు (సుమారు 60 కి.మీ/01.30 గంటలకు) బయలుదేరుతారు. బృహదీశ్వర ఆలయాన్ని సందర్శిస్తారు. సికింద్రాబాద్‌కు తిరుగు ప్రయాణం కోసం తంజావూరు రైల్వే స్టేషన్‌లో రైలు ఎక్కుతారు. రాత్రి ఎనిమిది గంటలకు ట్రైన్ ఉంటుంది. ఎనిమిదో రోజు ప్రయాణంలోనే ఉంటారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు రాత్రి 9 గంటలకు రైలు చేరుకుంటుంది.
దివ్య దక్షిణ్ యాత్ర విత్ జ్యోతిర్లింగ టూర్ ప్యాకేజీ చూస్తే.. ఎకానమీ రూ.14,700, అదే చిన్నవారికి రూ.13,800గా నిర్ణయించారు. స్టాండర్డ్ క్లాస్ అయితే పెద్దవారికి రూ.22,300, పిల్లలకు రూ.21,200గా ఉంది. కంఫర్ట్ క్లాస్ అయితే పెద్దలకు రూ.28,700, చిన్నారులకు రూ.27,400గా నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం ఐఆర్‌సీటీసీ టూరిజం అధికారిక వెబ్‌సైట్ సందర్శించండి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


