శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక అప్డేట్ ఇచ్చింది. అనూహ్య రద్దీ కారణంగా డిసెంబర్ 27, 28, 29వ తేదిలకు (శని, ఆది, సోమవారం) సంబంధించి శ్రీవాణి ఆఫ్ లైన్ (Offline) టికెట్ల జారీని టీటీడీ రద్దు చేసింది.

ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవాణి దర్శన టికెట్ల కౌంటర్ లో, తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయంలో శ్రీవాణి ఆఫ్ లైన్ (Offline) టికెట్లు జారీ చేయబడవు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని దర్శన ప్రణాళికలను రూపొందించికోవాలని ఈ సందర్భంగా భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది.
భారీగా భక్తుల రద్దీ:
వరుస సెలవులతో తిరుమలలో భారీగా భక్తుల రద్దీ పెరిగింది. ఎటుచూసినా తిరువిధులన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ వాహనాలు బారులు తీరి కనిపించాయి. భక్తుల లగేజీ తనిఖీ కేంద్రాల నుంచి అలిపిరి లింకు బస్టాండు వరకు కూడా రద్దీ పరిస్థితులు ఉన్నాయి.
మరోవైపు భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో…. క్యూలైన్లలో కూడా రద్దీ ఎక్కువగా ఉంటోంది. ప్రస్తుతం క్యూలైన్ లో భారీగా భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 25 నుంచి 30 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. తాత్కాలికంగా క్యూలైన్లలోకి భక్తుల అనుమతిని నిలిపివేసిన టీటీడీ… రేపు ఉదయం 6 గంటలకు క్యూ లైన్ లోకి అనుమతించనుంది.
గత రెండు రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. ఈ వారం రోజుల పాటు ఇదే రీతిలో భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉంది. వారాంతం కావడంతో పాటు క్రిస్మస్ హాలీ డేస్ కూడా ఉన్నాయి. దీనికి తోడు వైకుంఠ ఏకాదశి కావడంతో భక్తుల రద్దీ అంతకంతకూ పెరిగే అవకాశం ఉంది.
ఇక అలిపిరి వద్ద వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో… అలిపిరి ప్రాంగణమంతా కిటకిటలాడుతోంది. భక్తుల రద్దీ విపరీతంగా పెరగడంతో టీటీడీ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసింది.
{{/usCountry}}ఇక అలిపిరి వద్ద వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో… అలిపిరి ప్రాంగణమంతా కిటకిటలాడుతోంది. భక్తుల రద్దీ విపరీతంగా పెరగడంతో టీటీడీ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసింది.
{{/usCountry}}