...
...
Next Story

Pawan Kalyan Press Meet : ప్రెస్‌మీట్‌కు అయినా తెలంగాణ పోలీసులు అనుమతి ఇస్తారా..? లేదా..? - పవన్ కల్యాణ్ ట్వీట్

Pawan Kalyan Press Meet in Hyderabad: ఇవాళ సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో జనసేన అధినేత పవన్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి తెలంగాణ పోలీసులు అనుమతిస్తారని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు.

Published on: Jun 2, 2026, 10:58:06 IST
Advertisement

జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ రోజు (మంగళవారం) సాయంత్రం 4:30 గంటల నుంచి 5:30 గంటల మధ్య జూబ్లీహిల్స్‌లోని తన సొంత నివాసంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. ఈ సమావేశంలో జనసేన ముఖ్య నాయకులు కూడా పాల్గొననున్నారు.

పవన్ కల్యాణ్ ట్వీట్…

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై ఈ సమావేశంలో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ప్రెస్ మీట్ నిర్వహణకు సంబంధించి తెలంగాణ పోలీసుల అనుమతిపై ఆయన సామాజిక మాధ్యమాల ద్వారా స్పందిస్తూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

"ఈ రోజు సాయంత్రం 4:30 నుండి 5:30 గంటల మధ్య జూబ్లీహిల్స్‌లోని నా నివాసంలో మీడియా సమావేశం ఉంటుంది. జనసేన నాయకులతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించుకోవడానికి తెలంగాణ పోలీస్ శాఖ కనీసం ఇప్పుడైనా అనుమతి ఇస్తుందని ఆశిస్తున్నాను. ఏం జరుగుతుందో చూద్దాం,…" అని తన పోస్టులో పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

గతంలో జనసేన కార్యక్రమాలకు, పర్యటనలకు అనుమతుల విషయంలో తలెత్తిన పరిణామాలను దృష్టిలో ఉంచుకునే పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

నిజానికి జూన్ 2 సందర్భంగా హైదరాబాద్ లో జనసేన ఆధ్వర్యంలో ‘తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ - జనసేన సాధక్‌ సమ్మేళనం’ నిర్వహించాలనుకున్నారు. ఇందుకు ఏర్పాట్లు కూడా సిద్ధమయ్యాయి. అయితే చివరి నిమిషంలో పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై జనసేన శ్రేణులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks