ఆంధ్రప్రదేశ్, తెలంగాణ టెలికాం సర్కిల్‌లో ప్రధాన డిజిటల్ కనెక్టివిటీ ప్రొవైడర్‌గా రిలయన్స్ జియో తన స్థానాన్ని మరింత బలపరుచుకుంది. 2026 మార్చి నెలలో వైర్‌లెస్, బ్రాడ్‌బ్యాండ్ విభాగాల్లో గణనీయమైన సబ్‌స్క్రైబర్ పెరుగుదలను నమోదు చేసింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(TRAI) విడుదల చేసిన తాజా డేటా ప్రకారం, అత్యాధునిక బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించడంలో జియోకు సాటి లేకుండా ముందంజలో ఉంది. సంప్రదాయ మొబైల్ సేవల్లో కూడా వేగంగా ఎదుగుతోంది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జియోలో అత్యంత ఆకర్షణీయమైన ప్రదర్శన హై-స్పీడ్ హోమ్, ఎంటర్‌ప్రైజ్ బ్రాడ్‌బ్యాండ్ విస్తరణలో కనిపిస్తోంది. ఈ సర్కిల్‌లో వైర్‌లైన్ వృద్ధిని దాదాపు పూర్తిగా జియోనే సాధిస్తోంది. 2026 మార్చిలో జియో 31,000 కొత్త వైర్‌లైన్ కనెక్షన్లు సాధించి, మొత్తం ఫిక్స్‌డ్ లైన్ వినియోగదారుల సంఖ్యను 2.02 మిలియన్లకు పెంచింది.
వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో కూడా జియో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. 5G ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్ (FWA)లో జియో అగ్రస్థానంలో ఉంది. ఒకే నెలలో 22,003 కొత్త 5G FWA సబ్‌స్క్రైబర్లను జోడించి మొత్తం సంఖ్యను 7,33,617కు తీసుకెళ్లింది. అన్‌లైసెన్స్డ్ బ్యాండ్ రేడియో (UBR) FWA సేవలను అందిస్తున్న ఏకైక ఆపరేటర్‌గా కూడా జియో నిలుస్తోంది. ఈ విభాగంలో 18,991 కొత్త వినియోగదారులను చేర్చి మొత్తం సంఖ్యను 3,53,145కు పెంచింది.
మొత్తం కలిపి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జియోకు 1.08 మిలియన్లకు పైగా ప్రత్యేక FWA కనెక్షన్లు ఉన్నాయి. ఇది ప్రాంతీయ డిజిటల్ మార్పుకు ప్రధాన శక్తిగా నిలుస్తోంది. సాంప్రదాయ వైర్‌లెస్ మొబైల్ విభాగంలో కూడా జియో బలమైన ప్రదర్శన కనబరిచింది. 2026 మార్చిలో 1,49,464 కొత్త మొబైల్ వినియోగదారులతో మొత్తం సంఖ్యను 32.22 మిలియన్లకు పెంచింది.
జియో జాతీయ స్థాయిలో కూడా అగ్రగామిగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా వైర్డ్, వైర్‌లెస్ కలిపి 523.44 మిలియన్ల బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులతో జియో అతిపెద్ద నెట్‌వర్క్‌గా నిలిచింది. ఇది భారత బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్‌లో దాదాపు 49.11 శాతం వాటాను కలిగి ఉంది. వైర్‌లెస్ మొబైల్ విభాగంలో కూడా జియో దేశవ్యాప్తంగా 3.22 మిలియన్లకు పైగా కొత్త వినియోగదారులను చేర్చి మొత్తం సంఖ్యను 496.33 మిలియన్లకు పెంచింది. ఇది 39.21 శాతం మార్కెట్ వాటాతో ముందంజలో నిలిచింది. అదేవిధంగా ఫైబర్, ఫిక్స్‌డ్ లైన్ సేవల విస్తరణలో భాగంగా మార్చి నెలలో దేశవ్యాప్తంగా అత్యధికంగా 1,88,698 వైర్‌లైన్ కనెక్షన్లను జియో జోడించింది.
{{/usCountry}}జియో జాతీయ స్థాయిలో కూడా అగ్రగామిగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా వైర్డ్, వైర్‌లెస్ కలిపి 523.44 మిలియన్ల బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులతో జియో అతిపెద్ద నెట్‌వర్క్‌గా నిలిచింది. ఇది భారత బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్‌లో దాదాపు 49.11 శాతం వాటాను కలిగి ఉంది. వైర్‌లెస్ మొబైల్ విభాగంలో కూడా జియో దేశవ్యాప్తంగా 3.22 మిలియన్లకు పైగా కొత్త వినియోగదారులను చేర్చి మొత్తం సంఖ్యను 496.33 మిలియన్లకు పెంచింది. ఇది 39.21 శాతం మార్కెట్ వాటాతో ముందంజలో నిలిచింది. అదేవిధంగా ఫైబర్, ఫిక్స్‌డ్ లైన్ సేవల విస్తరణలో భాగంగా మార్చి నెలలో దేశవ్యాప్తంగా అత్యధికంగా 1,88,698 వైర్‌లైన్ కనెక్షన్లను జియో జోడించింది.
{{/usCountry}}