బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్‌లో జియో ఆధిపత్యం.. ఏపీ, తెలంగాణలో కొనసాగుతున్న జోరు

Jio : బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్‌లో జియో ఆధిపత్యం కొనసాగుతోంది. ట్రాయ్‌ విడుదల చేసిన డేటా ప్రకారం.. బ్రాడ్ బ్యాండ్ సేవలు అందించడంలో ముందంజలో ఉంది.

Published on: Apr 23, 2026, 17:44:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ టెలికాం సర్కిల్‌లో ప్రధాన డిజిటల్ కనెక్టివిటీ ప్రొవైడర్‌గా రిలయన్స్ జియో తన స్థానాన్ని మరింత బలపరుచుకుంది. 2026 మార్చి నెలలో వైర్‌లెస్, బ్రాడ్‌బ్యాండ్ విభాగాల్లో గణనీయమైన సబ్‌స్క్రైబర్ పెరుగుదలను నమోదు చేసింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(TRAI) విడుదల చేసిన తాజా డేటా ప్రకారం, అత్యాధునిక బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించడంలో జియోకు సాటి లేకుండా ముందంజలో ఉంది. సంప్రదాయ మొబైల్ సేవల్లో కూడా వేగంగా ఎదుగుతోంది.

జియో
జియో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జియోలో అత్యంత ఆకర్షణీయమైన ప్రదర్శన హై-స్పీడ్ హోమ్, ఎంటర్‌ప్రైజ్ బ్రాడ్‌బ్యాండ్ విస్తరణలో కనిపిస్తోంది. ఈ సర్కిల్‌లో వైర్‌లైన్ వృద్ధిని దాదాపు పూర్తిగా జియోనే సాధిస్తోంది. 2026 మార్చిలో జియో 31,000 కొత్త వైర్‌లైన్ కనెక్షన్లు సాధించి, మొత్తం ఫిక్స్‌డ్ లైన్ వినియోగదారుల సంఖ్యను 2.02 మిలియన్లకు పెంచింది.

వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో కూడా జియో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. 5G ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్ (FWA)లో జియో అగ్రస్థానంలో ఉంది. ఒకే నెలలో 22,003 కొత్త 5G FWA సబ్‌స్క్రైబర్లను జోడించి మొత్తం సంఖ్యను 7,33,617కు తీసుకెళ్లింది. అన్‌లైసెన్స్డ్ బ్యాండ్ రేడియో (UBR) FWA సేవలను అందిస్తున్న ఏకైక ఆపరేటర్‌గా కూడా జియో నిలుస్తోంది. ఈ విభాగంలో 18,991 కొత్త వినియోగదారులను చేర్చి మొత్తం సంఖ్యను 3,53,145కు పెంచింది.

మొత్తం కలిపి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జియోకు 1.08 మిలియన్లకు పైగా ప్రత్యేక FWA కనెక్షన్లు ఉన్నాయి. ఇది ప్రాంతీయ డిజిటల్ మార్పుకు ప్రధాన శక్తిగా నిలుస్తోంది. సాంప్రదాయ వైర్‌లెస్ మొబైల్ విభాగంలో కూడా జియో బలమైన ప్రదర్శన కనబరిచింది. 2026 మార్చిలో 1,49,464 కొత్త మొబైల్ వినియోగదారులతో మొత్తం సంఖ్యను 32.22 మిలియన్లకు పెంచింది.

జియో జాతీయ స్థాయిలో కూడా అగ్రగామిగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా వైర్డ్, వైర్‌లెస్ కలిపి 523.44 మిలియన్ల బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులతో జియో అతిపెద్ద నెట్‌వర్క్‌గా నిలిచింది. ఇది భారత బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్‌లో దాదాపు 49.11 శాతం వాటాను కలిగి ఉంది. వైర్‌లెస్ మొబైల్ విభాగంలో కూడా జియో దేశవ్యాప్తంగా 3.22 మిలియన్లకు పైగా కొత్త వినియోగదారులను చేర్చి మొత్తం సంఖ్యను 496.33 మిలియన్లకు పెంచింది. ఇది 39.21 శాతం మార్కెట్ వాటాతో ముందంజలో నిలిచింది. అదేవిధంగా ఫైబర్, ఫిక్స్‌డ్ లైన్ సేవల విస్తరణలో భాగంగా మార్చి నెలలో దేశవ్యాప్తంగా అత్యధికంగా 1,88,698 వైర్‌లైన్ కనెక్షన్లను జియో జోడించింది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More