పెరుగుతున్న ధరల ప్రభావాన్ని అరికట్టే చర్యల్లో భాగంగా ఏపీలో రైతు బజార్లలో కిలో ఉల్లిపాయలను రూ.35 రాయితీ ధరకు విక్రయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం నుండి రేషన్ కార్డును చూపించి ఒక్కో కుటుంబం నెలకు గరిష్టంగా 2 కిలోల ఉల్లిపాయలను కొనుగోలు చేయవచ్చు.

విజయవాడలోని ఏఐసీసీ కాలనీ రైతు బజార్‌లో ఉల్లిపాయల పంపిణీని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ఒక్కో రేషన్ కార్డుదారుడికి 2 కిలోల చొప్పున ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా పేర్కొన్నారు. 'కూటమి ప్రభుత్వంలో ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిణామాలతో ధరలు పెరుగుతున్నాయి. ప్రజలపై భారం పడకుండా రాయితీపై అందిస్తున్నాం. ధరల స్థిరీకరణకు నిధిని ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నాం. బియ్యం, ఉల్లి, పప్పులు సబ్సిడీపై అందించేలా ఏర్పాట్లు చేశాం.' అని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
మార్కెట్ పరిస్థితులను ప్రభుత్వం నిరంతరం సమీక్షిస్తోందని, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను అదుపు చేయడానికి చర్యలు తీసుకుంటోందని మంత్రి పేర్కొన్నారు. విజయవాడలో లభించే స్పందన ఆధారంగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని రైతు బజార్లకు విస్తరిస్తారు.
సబ్సిడీ ఉల్లిపాయలు కొనుగోలు చేసేందుకు వినియోగదారులకు ప్రభుత్వం నిబంధనలు కూడా పెట్టింది. ఉల్లిపాయల కోసం వచ్చేవారు తమ వెంట రేషన్ కార్డు తెచ్చుకోవాలి దానిని చూపిస్తే.. ప్రతీ కుటుంబానికి నెలకు గరిష్టంగా 2 కిలోల ఉల్లిపాయలను మాత్రమే రూ.35 చొప్పున అందిస్తారు. బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టి.. నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ఈ ప్రయోజనం చేకూర్చనున్నారు.
ఇప్పటికే రూ.50కే కిలో సన్నబియ్యం అందించే బృహత్తర కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 150 రైతు బజార్లు, 500 రైస్ మిల్లింగ్ అవుట్లెట్ల ద్వారా ఈ సబ్సిడీ బియ్యం విక్రయాలను చేస్తున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) ద్వారా కిలో గోధుమ పిండిని, అలాగే రాయితీ ధరలకు పామాయిల్, కందిపప్పును కూడా సరఫరా చేయనున్నారు.
{{/usCountry}}ఇప్పటికే రూ.50కే కిలో సన్నబియ్యం అందించే బృహత్తర కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 150 రైతు బజార్లు, 500 రైస్ మిల్లింగ్ అవుట్లెట్ల ద్వారా ఈ సబ్సిడీ బియ్యం విక్రయాలను చేస్తున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) ద్వారా కిలో గోధుమ పిండిని, అలాగే రాయితీ ధరలకు పామాయిల్, కందిపప్పును కూడా సరఫరా చేయనున్నారు.
{{/usCountry}}పంట వైవిధ్యీకరణ వ్యూహంలో భాగంగా రబీ సీజన్‌లో 8.81 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పప్పుధాన్యాలు, మొక్కజొన్న, నూనెగింజలు, ఇతర ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఈ ప్రణాళికలో 1.88 లక్షల హెక్టార్లలో శనగలు, 1.51 లక్షల హెక్టార్లలో మొక్కజొన్న, 1.27 లక్షల హెక్టార్లలో మినుముల సాగును చేపట్టడం వంటివి ఉన్నాయి.
ముందుగా నమోదు చేసుకున్న రైతులు పండించిన రాగులు, కందిపప్పు, మినుములను 100 శాతం మేర కనీస మద్దతు ధర వద్ద ప్రభుత్వం సేకరించనుంది. అలాగే పెసలు, శనగలు, వేరుశనగ, పొద్దుతిరుగుడు పంటల ఉత్పత్తిలో 30 శాతం వరకు కూడా ఎంఎస్పీ వద్దే సేకరించనున్నారు.