Kailasagiri Ghat Road : కైలాసగిరి టూరిజం డెవలప్‌మెంట్.. రెండో ఘాట్ రోడ్డు ప్రాజెక్ట్‌పై వీఎంఆర్డీఏ ఫోకస్

Kailasagiri Ghat Road : విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ(వీఎంఆర్‌డీఏ) కైలాసగిరికి రెండో ఘాట్ రోడ్డును అభివృద్ధి చేసే ప్రణాళికలను వేగవంతం చేసింది. ఈ ప్రతిపాదిత రహదారి.. కైలాసగిరికి ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని అందించనుంది.

Published on: Sep 7, 2026, 20:41:55 IST
By , Vizag
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో ఎంతో ప్రాచుర్యం పొందిన విశాఖపట్నంలోని కైలాసగిరి కొండపైకి చేరుకోవడానికి రెండో ఘాట్ రోడ్డు నిర్మాణ పనులను విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ(VMRDA) వేగవంతం చేసింది. ప్రస్తుతం ఉన్న ఒక్కటే ఘాట్ రోడ్డుపై పెరుగుతున్న వాహనాల రద్దీని తగ్గించడంతో పాటు పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్తున్నారు.

కైలాసగిరి
కైలాసగిరి

విశాఖపట్నం పర్యటనకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పక సందర్శించే పర్యాటక ప్రాంతాల్లో కైలాసగిరి ప్రథమ వరసలో ఉంటుంది. ప్రస్తుతం కొండపైకి వెళ్లేందుకు ఒకే ఒక ప్రధాన రహదారి అందుబాటులో ఉంది. వారంతాంతాలు, సెలవు దినాలు, పండగల సమయాల్లో పర్యాటకుల రాక విపరీతంగా పెరగడంతో ఈ మార్గంలో తరచూ తీవ్ర ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి.

రెండో ఘాట్ రోడ్డు అందుబాటులోకి వస్తే కొండపైకి వెళ్లేందుకు, కిందికి దిగేందుకు వేర్వేరు మార్గాలను కేటాయించే అవకాశం ఉంటుంది. దీనివల్ల ప్రయాణ సమయం తగ్గడంతో పాటు ప్రమాదాల నివారణ, పర్యాటకుల భద్రత పెరుగుతుంది.

VMRDA ఇన్‌ఛార్జ్ కమిషనర్ కేతన్ గర్గ్ ఇటీవల కైలాసగిరి ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో సందర్శించి ఉన్నతాధికారులతో కలిసి తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపాదిత రెండో ఘాట్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన స్థల పరిశీలన, డిజైన్, సర్వే పనులను తక్షణమే వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కైలాసగిరి అభివృద్ధి మాస్టర్ ప్లాన్‌లో భాగంగా ప్రతిపాదించిన ఎనర్జీ పార్క్ ఏర్పాటుకు తగిన స్థలాన్ని గుర్తించాలని స్పష్టం చేశారు.

కొండపైకి వచ్చే సందర్శకులకు అవసరమైన మౌలిక వసతులు, కాటేజీలు, ల్యాండ్‌స్కేపింగ్, రాత్రి వేళల్లో బస చేసే వసతుల మెరుగుదలపై సమీక్ష నిర్వహించారు. కైలాసగిరి నుంచి సముద్ర తీరం, నగర సౌందర్యాన్ని తిలకించేందుకు రోప్‌వే, టాయ్ ట్రైన్, శివపార్వతుల విగ్రహాలు, టైటానిక్ వ్యూ పాయింట్ వంటి అనేక ఆకర్షణలు ఉన్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న పర్యాటకుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తు అవసరాలకు తగినట్లుగా మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని VMRDA భావిస్తోంది.

ఈ రెండో ఘాట్ రోడ్డు ప్రాజెక్టు పూర్తయితే విశాఖపట్నం పర్యాటక రంగానికి మరింత ఊపు రావడమే కాకుండా, నగర రవాణా వ్యవస్థలో ఇదొక కీలక మైలురాయిగా నిలవనుంది. కైలాసగిరిని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఉపయోగించుకోవాలని, మాస్టర్ ప్లాన్ తయారుచేయాలని వీఎంఆర్డీఏ భావిస్తోంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More