...
...
Next Story

కాకినాడ వాసులకు షాక్.. బిల్డింగ్ ప్లానింగ్ ఛార్జీలు త్రీ టైమ్స్ పెంపు, లైసెన్సులకు డబుల్!

KMC : కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్‌లో ధరలు భారీగా పెరిగాయి. బిల్డింగ్ ప్లానింగ్‌కు ఛార్జీలు మూడు రేట్లు పెరిగాయి. అంతేకాదు.. పలు లావాదేవీలపై ఫీజులను ఎక్కువ అయ్యాయి.

Published on: Apr 5, 2026, 14:22:05 IST
Advertisement

కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్(కేఎంసీ) బిల్డింగ్‌ ప్లాన్స్‌తో సహా వివిధ లావాదేవీలపై వసూలు చేసే రుసుమును భారీగా పెంచింది. బిల్డింగ్ ప్లాన్స్ ధర మూడు రెట్లు పెరగగా, వాణిజ్య లైసెన్సుల ధర ఇప్పుడు రెట్టింపు అయ్యింది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన ఏప్రిల్ 1 నుంచి వివిధ లావాదేవీలపై పెంచిన రేట్లు అమల్లోకి వచ్చాయి. 2011 నుంచి వివిధ రుసుములు స్థిరంగా ఉన్నాయని.. ఈ ఛార్జీల పెంపు స్వల్పమేనని మరోవైపు అధికారులు చెబుతున్నారు.

కేఎంసీ
కేఎంసీ

ఈ పెంపు చాలా అన్యాయమని పన్ను చెల్లింపుదారులు ఆరోపణలు చేస్తున్నారు. ఒకేసారి ఛార్జీలను మూడు రెట్లు పెంచడం సరికాదని అంటున్నారు. 500 చదరపు మీటర్ల వరకు భవన ప్రణాళికల ఆమోదం కోసం ఆస్తి యజమాని ప్రతి చదరపు మీటరుకు రూ.1,500 చెల్లించాల్సి ఉంటుంది. 500 చదరపు మీటర్లు దాటితే ప్రతి 100 చదరపు మీటర్లకు రూ.300 చెల్లించాలి. ఆమోదించిన లేఅవుట్ ప్లాన్‌ల కోసం యజమాని హెక్టారుకు రూ.1,500 చెల్లించాలి. భూ బదిలీ ఛార్జీలను చదరపు మీటరుకు రూ.15 నుండి రూ.45కు పెంచారు. లేఅవుట్ అనుమతి రుసుమును హెక్టారుకు రూ.75,000కు పెంచారు.

పెట్రోల్, గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లు, వెయింగ్ బ్రిడ్జ్‌లు, సర్వీస్ స్టేషన్లు, ఎల్‌పీజీ గిడ్డంగులు, ఇతరులు చదరపు మీటరుకు రూ.120 చెల్లించాలి. ఒక వ్యక్తి నివాస ప్రయోజనం కోసం గుడిసెను నిర్మిస్తే.. అతను/ఆమె చదరపు మీటరుకు రూ.30, ప్రతి ఒక మీటరు పొడవు పారాపెట్ గోడ నిర్మాణానికి రూ.90 చెల్లించాలి. బావి, సెప్టిక్ ట్యాంక్, బాత్రూమ్, ఇతర నిర్మాణాలకు ఒక్కొక్కదానికి ఛార్జీలు రూ.750.

వ్యాపార లైసెన్సుల విషయానికి వస్తే.. గతంలో లైసెన్స్ ఫీజు రూ.1,000 ఉండగా.. ఇప్పుడు దాని ధర రూ.2,000 అవుతుంది. వ్యాపార లైసెన్సులలో 600 కేటగిరీలు ఉన్నాయి. ఈ పెంపుపై కాకినాడ ప్రజలు విమర్శలు చేస్తున్నారు. ఇంత దారుణంగా ధరలు పెంచడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe