తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 4వ తేదీన సాలకట్ల కార్తీక పర్వదీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం వివరాలను పేర్కొంది. కార్తీక పౌర్ణమినాడు శ్రీవారికి సాయంకాల కైంకర్యాలు, నివేదనలు పూర్తి అయిన తరువాత ఈ దీపోత్సవం నిర్వహిస్తారు.
శ్రీవారికి హారతి…

ఈ సందర్భంగా సాయంత్రం నేతి వత్తులతో దీపాలను వెలిగించి ఛత్రచామర, మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ ఆనంద నిలయంలో శ్రీవారికి హారతి ఇస్తారు. ఆ తర్వాత వరుసగా గర్భాలయంలో అఖండం, కులశేఖర పడి, రాములవారి మేడ, ద్వార పాలకులు, గరుడాళ్వారు, వరదరాజస్వామి సన్నిధి, వకుళమాత, బంగారుబావి, కల్యాణ మండపం, సభ అర, తాళ్లపాక అర, భాష్యకారుల సన్నిధి వద్ద దీపాలను ఏర్పాటు చేస్తారు.
పలు సేవలు రద్దు…
అంతేకాకుండా యోగ నరసింహస్వామి, విష్వక్సేనులు, చందనం అర, పరిమళం అర, వెండి వాకిలి, ధ్వజస్తంభం, బలి పీఠం, క్షేత్ర పాలకుల సన్నిధి, తిరుమలరాయ మండపం, పూలబావి, రంగనాయక మండపం, మహాద్వారం, బేడి ఆంజనేయస్వామి, శ్రీవరాహస్వామి ఆలయం, స్వామి పుష్కరిణి వద్ద దీపాలను ఏర్పాటు చేస్తారు. ఈ కారణంగా డిసెంబర్ 4వ తేదీ సహస్రదీపాలంకరణ సేవను, పౌర్ణమి గరుడసేవను టీటీడీ రద్దు చేసింది.
డిసెంబర్ నెలలో జరిగే విశేష పర్వదినాల జాబితా:
డిసెంబర్ నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాల వివరాలు ఇలా ఉన్నాయి….
• డిసెంబర్ 2న చక్రతీర్థ ముక్కోటి.
• డిసెంబర్ 4న శ్రీవారి ఆలయంలో కార్తీక పర్వ దీపోత్సవం, తిరుమంగైయాళ్వార్ శాత్తుమొర.
• డిసెంబర్ 5న తిరుప్పాణాళ్వార్ వర్ష తిరు నక్షత్రం.
{{/usCountry}}• డిసెంబర్ 5న తిరుప్పాణాళ్వార్ వర్ష తిరు నక్షత్రం.
{{/usCountry}}• డిసెంబర్ 16న ధనుర్మాసారంభం.
• డిసెంబర్ 19న తొందరడిప్పోడియాళ్వార్ వర్ష తిరు నక్షత్రం. శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ప్రారంభం.
• డిసెంబర్ 29న శ్రీవారి ఆలయంలో చిన్న శాత్తుమొర.
• డిసెంబర్ 30న వైకుంఠ ఏకాదశి, శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం, శ్రీవారి స్వర్ణ రథోత్సవం.
• డిసెంబర్ 31న వైకుంఠ ద్వాదశి, శ్రీవారి చక్రస్నానం.