Sign in

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - 10 రోజుల పాటు ఈ టికెట్లు రద్దు..! వివరాలివిగో

తిరుపతిలోని అలిపిరిలో రోజూ నిర్వహిస్తున్న శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లను 10 రోజుల పాటు రద్దయ్యాయి. ఈ మేరకు టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా డిసెంబర్‌ 30 నుంచి జనవరి 8 వరకు రద్దు నిర్ణయం అమల్లో ఉంటుందని తెలిపింది.

Published on: Nov 20, 2025, 15:54:46 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం అలర్ట్ ఇచ్చింది. అలిపిరిలోని శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లను 10 రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు ఈ టికెట్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని గమనించి భక్తులు సహకరించాలని విజ్ఞప్తి చేసింది.

శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు 10 రోజుల పాటు రద్దు
శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు 10 రోజుల పాటు రద్దు

10 రోజులు వైకుంఠ ద్వార దర్శనాలు:

వైకుంఠ ద్వార దర్శనం డిసెంబర్ 30 నుండి జనవరి 08 వరకు భక్తులకు కల్పించనున్నారు. 10 రోజుల పాటు 8 లక్షల మంది భక్తుల కోసం వైకుంఠ ద్వార దర్శనం చేసుకునే అవకాశం ఉంది. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్టుగా టీటీడీ అధికారులు తెలిపారు.

  • వైకుంఠ ద్వార దర్శనం కోసం అందుబాటులో ఉన్న 182 గంటల్లో 164 గంటలు సాధారణ భక్తులకు కేటాయించారు.
  • ఆఫ్‌లైన్ టోకెన్ల జారీ లేదు. మొదటి మూడు రోజులు శ్రీవాణి, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనాలు లేవు.
  • ఈ డిప్ ద్వారా సేకరించిన టోకెన్లు కలిగిన భక్తులకు మొదటి మూడు రోజులలో అనుమతి ఉంటుంది.
  • జనవరి 02 నుండి 08 వరకు భక్తులు సర్వ దర్శనం ద్వారా దర్శనం చేసుకోవచ్చు
  • జనవరి 02 నుండి 08 వరకు ఆన్‌లైన్‌లో భక్తులకు ప్రతిరోజు 15000 రూ.300 టోకెన్లు, 1000 శ్రీవాణి టిక్కెట్లు కేటాయిస్తారు.
  • ఆన్‌లైన్ FIFO ద్వారా జనవరి 06, 07, 08 తేదీల్లో స్థానిక దర్శన్ (ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ పద్ధతి)లో ఉంటుంది.
  • సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇవ్వడంలో భాగంగా డిసెంబర్ 30, 31, జనవరి 01 తేదీలలో మొదటి మూడు రోజులలో రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి దర్శనం రద్దు చేశామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఇటీవలే తెలిపారు.
  • నవంబర్ 27 నుండి డిసెంబర్ 01 వరకు దర్శన టోకెన్ల నమోదుకు భక్తులకు అవకాశం కల్పిస్తారు.
  • డిసెంబర్ 2న ఈ-డిప్ ద్వారా ఎంపికైన వారికి దర్శన టోకెన్లు కేటాయిస్తారు. అందరికీ సమాన అవకాశాన్ని పారదర్శకంగా అందించడానికి, టోకెన్ల జారీని టీటీడీ అధికారిక వెబ్‌సైట్, టీటీడీ మొబైల్ యాప్, వాట్సాప్ ద్వారా నిర్వహిస్తారు.
  • తిరుపతి, తిరుమల స్థానికులకు జనవరి 6,7,8 తేదీలలో ఆన్‌లైన్‌లో ముందస్తుగా బుక్ చేసుకున్న వారికి ముందుగా వచ్చిన వారికి ప్రాధాన్యత ప్రాతిపదికన 5,000 టోకెన్లు అందిస్తారు.
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More