AP Inter Supplementary Exams 2026 : ఏపీ ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఇంటర్ బోర్డు కీలక అప్డేట్ ఇచ్చింది. బక్రీద్ (ఈద్-ఉల్-అజ్హా) సెలవు దినాన్ని మే 28వ తేదీకి మారుస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో…. ఆ రోజు జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఏపీ ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి పి. రంజిత్ బాషా ప్రకటన విడుదల చేశారు. మే 28న జరగాల్సిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలను జూన్ 5వ తేదీకి రీషెడ్యూల్ చేశారు.

గతంలో ప్రకటించిన టైమ్‌టేబుల్ ప్రకారం…. మే 28వ తేదీన ఉదయం సెషన్‌లో జరగాల్సిన ఫస్ట్ ఇయర్ పరీక్షలను జూన్ 5వ తేదీ ఉదయం (09:00 గంటల నుండి 12:00 గంటల వరకు) నిర్వహించనున్నారు.
జూన్ 5న జరిగే పరీక్షలు - సబ్జెక్టులు:
- ఎకనామిక్స్ (ఆర్థికశాస్త్రం) పేపర్-1
- వృత్తి విద్యా కోర్సుల (Vocational) బ్రిడ్జి కోర్సు గణితం (Mathematics) పేపర్-1
- వృత్తి విద్యా కోర్సుల బ్రిడ్జి కోర్సు జీవశాస్త్రం (Biology) పేపర్-1
మే 28వ తేదీన మధ్యాహ్నం సెషన్‌లో జరగాల్సిన సెకండ్ ఇయర్ పరీక్షలను కూడా జూన్ 5వ తేదీ మధ్యాహ్నం (02:30 గంటల నుండి 05:30 గంటల వరకు) నిర్వహించనున్నారు.
- మ్యాథమెటిక్స్ (గణితం) పేపర్-2B
- వృత్తి విద్యా కోర్సుల బ్రిడ్జి కోర్సు గణితం (Mathematics) పేపర్-2
- వృత్తి విద్యా కోర్సుల బ్రిడ్జి కోర్సు జీవశాస్త్రం (Biology) పేపర్-2
ఈ మార్పు ప్రకారం… ఆయా సబ్జెక్టు విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు వెళ్లాలని ఇంటర్ బోర్డు సూచించింది. పరీక్షా కేంద్రాలు, హాల్ టికెట్లలో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేసింది. తీవ్రమైన ఎండల దృష్ట్యా పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు మరియు అవసరమైన వైద్య సదుపాయాలను సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించింది.
ఇక ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లను బోర్డు అధికారిక వెబ్ సైట్ https://bie.ap.gov.in/ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనమిత్ర వాట్సాప్ వేదికగా కూడా వీటిని అందుబాటులోకి ఉంచారు. 'మన మిత్ర' వాట్సాప్ నంబరు 9552300009 కు మెసేజ్ చేయడం ద్వారా విద్యార్థులు నేరుగా తమ మొబైల్లోనే హాల్‌టికెట్‌ను సులువుగా పొందే వీలుంది. డౌన్లోడ్ చేసుకోని విద్యార్థులు… పైన పేర్కొన్న విధంగా ప్రాసెస్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.
{{/usCountry}}ఇక ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లను బోర్డు అధికారిక వెబ్ సైట్ https://bie.ap.gov.in/ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనమిత్ర వాట్సాప్ వేదికగా కూడా వీటిని అందుబాటులోకి ఉంచారు. 'మన మిత్ర' వాట్సాప్ నంబరు 9552300009 కు మెసేజ్ చేయడం ద్వారా విద్యార్థులు నేరుగా తమ మొబైల్లోనే హాల్‌టికెట్‌ను సులువుగా పొందే వీలుంది. డౌన్లోడ్ చేసుకోని విద్యార్థులు… పైన పేర్కొన్న విధంగా ప్రాసెస్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.
{{/usCountry}}విద్యార్థులు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో తమ పేరు, ఫోటో, సంతకం, పరీక్షా కేంద్రం వివరాలు, రాసే సబ్జెక్టుల కోడ్‌లు సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని అధికారులు సూచించారు. ఏవైనా తప్పులు ఉంటే వెంటనే కళాశాల యాజమాన్యాన్ని లేదా బోర్డు హెల్ప్‌లైన్‌ను సంప్రదించాల్సి ఉంటుంది.