కేరళంలోని శబరిమలలో జరగనున్న మండల-మకరవిళక్కు యాత్రా సమయంలో రాష్ట్రంలోని అయ్యప్ప భక్తులు పర్యావరణ అనుకూల పద్ధతులను పాటించాలని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి(ఏపీపీసీబీ) కోరింది. 2026-27 యాత్రా కాలం 2026 నవంబర్ 17న ప్రారంభమై 2027 జనవరి 20 వరకు కొనసాగుతుంది.

యాత్రికుల తాకిడి అధికంగా ఉండే అవకాశం ఉన్నందున, పుణ్యక్షేత్రమంతటా పర్యావరణ పరిశుభ్రతను కాపాడటానికి సహకరించాలని కేరళం రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(KSPCB) భక్తులకు విజ్ఞప్తి చేసింది. పర్యావరణ పరిరక్షణ, సరైన వ్యర్థాల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ యాత్రికులలో అవగాహన కల్పించాలని కోరుతూ ఏపీపీసీబీకి లేఖ రాసింది. దీనికి ప్రతిస్పందనగా ఏపీపీసీబీ ఒక ప్రకటనను విడుదల చేస్తూ, భక్తుల కోసం మార్గదర్శకాలను వివరించింది.
యాత్రికులు తమ ఇరుముడిలో ప్లాస్టిక్ వస్తువులకు దూరంగా ఉంచాలి. పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలను ఉపయోగించాలని అధికారులు సూచించారు. అలాగే అటవీ మార్గాలు, కొండలు, చుట్టుపక్కల ప్రాంతాలలో ప్లాస్టిక్ లేదా ఇతర వ్యర్థాలను వేయవద్దు. తడి, పొడి వ్యర్థాలను వేరు చేయాలని, అలాగే జీవవిచ్ఛిన్నమయ్యే, జీవవిచ్ఛిన్నం కాని పదార్థాలను వేర్వేరు చెత్తబుట్టలలో పారవేయాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.
పంబ నదిలో చెత్త వేయవద్దని, వాడిన బట్టలను నదిలోనూ, భస్మకుళంలోనూ పారవేయవద్దని బోర్డు భక్తులకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసింది. ఈ ప్రాంత జీవవైవిధ్యాన్ని, సహజ పర్యావరణ వ్యవస్థను పరిరక్షించడానికి సన్నిధానం, పంబ, నిలక్కల్, ఎరుమేలి, చుట్టుపక్కల అటవీ ప్రాంతాలలో పరిశుభ్రతను పాటించడం అత్యవసరం అని పొల్యుషన్ బోర్డు వెల్లడించింది.
శబరిమల పవిత్రతను కాపాడుకుంటూ, పర్యావరణ బాధ్యతతో కూడిన యాత్రను పాటించేలా కేరళ హైకోర్టు ఆదేశాలను పాటించాలని బోర్డులు భక్తులకు విజ్ఞప్తి చేశాయి. అటవీ మార్గాలు, కొండలు, చుట్టుపక్కల ప్రాంతాలలో ప్లాస్టిక్ లేదా ఇతర వ్యర్థాలను పారవేయవద్దు.
{{/usCountry}}శబరిమల పవిత్రతను కాపాడుకుంటూ, పర్యావరణ బాధ్యతతో కూడిన యాత్రను పాటించేలా కేరళ హైకోర్టు ఆదేశాలను పాటించాలని బోర్డులు భక్తులకు విజ్ఞప్తి చేశాయి. అటవీ మార్గాలు, కొండలు, చుట్టుపక్కల ప్రాంతాలలో ప్లాస్టిక్ లేదా ఇతర వ్యర్థాలను పారవేయవద్దు.
{{/usCountry}}యాత్ర కాలంలో శబరిమల పవిత్రతను కాపాడటానికి, పంబా నది పరిశుభ్రంగా ఉంచాలని, చుట్టుపక్కల అటవీ పర్యావరణ వ్యవస్థను రక్షించడానికి సహాయపడాలని ఆంధ్రప్రదేశ్ అయ్యప్ప భక్తులకు కేఎస్‌పీసీబీ విజ్ఞప్తి చేసింది.
మండల-మకరవిళక్కు యాత్రా నవంబర్ 17న ప్రారంభమై 2027 జనవరి 20 వరకు కొనసాగనుంది. ఇప్పటికే ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను ప్రకటించింది. ఇందులో గురుస్వాములు ఉచితంగా ప్రయాణించే అవకాన్ని కల్పిస్తోంది. మరోవైపు ప్రత్యేక రైళ్లు కూడా కొల్లాం వరకు నడుస్తున్నాయి. అక్కడ నుంచి కేరళ ఆర్టీసీ బస్సుల్లో వెళ్లవచ్చు.