...
...
Next Story

అమరావతి-ఖరగ్‌పుర్‌‌ హైస్పీడ్‌ రోడ్‌ కారిడార్‌‌పై అప్డేట్.. ఎలైన్‌మెంట్‌కు ఆమోదం

ఏపీలోని అమరావతి ఓఆర్ఆర్, పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్ వరకు నాలుగు వరుసల హైస్పీడ్‌ రోడ్‌ కారిడార్‌ నిర్మించనున్నారు. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పరిధిలోని ఎలైన్‌మెంట్‌కు ఆమోదం లభించింది.

Published on: Aug 23, 2026, 09:14:07 IST
Advertisement

ఏపీతో నార్త్ ఇండియాకు కనెక్టివిటీ పెంచేలా సరికొత్తగా నాలుగు వరుసల హైస్పీడ్‌ రోడ్‌ నిర్మించనున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పుర్‌ నుండి ప్రారంభమై మన రాష్ట్రంలోని అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్డు వరకు నిర్మించతలపెట్టిన 4 వరుసల హైస్పీడ్‌ ఎక్స్‌ప్రెస్‌ కారిడార్‌ ప్రతిపాదనలకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) ఎలైన్‌మెంట్‌ అప్రూవల్‌ కమిటీ (AAC) ఆమోదముద్ర వేసింది. ఏపీ పరిధిలోని ఎలైన్‌మెంట్‌కు ఆమోదం లభించినట్టుగా పేర్కొంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

నాలుగు రాష్ట్రాల గుండా సాగే ఈ మెగా ప్రాజెక్టు మొత్తం పొడవు 1,107 కిలోమీటర్లు. ఇందులో ఆంధ్రప్రదేశ్ పరిధిలోనే అత్యధికంగా 457 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ రూట్‌ను కేంద్రం యధాతథంగా ఆమోదించింది. పశ్చిమబెంగాల్, ఝార్ఖండ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ను కలుపుతూ ఈ రోడ్డు ఉంటుంది.

ఏపీలో కనెక్టివిటీ పొందే కీలక ప్రాంతాలు

కురుపాం, పార్వతీపురం, సాలూరు, మక్కువ

అరకు, పాడేరు, చింతపల్లి

గోకవరం, కన్నాపురం, జంగారెడ్డిగూడెం

లక్కవరం, దేవరపల్లి, కామవరపుకోట, ద్వారకా తిరుమల, నూజివీడు

ఈ రహదారి ఆగిరిపల్లి సమీపంలో అమరావతి ORRలో అనుసంధానమవుతుంది.

ఈ గ్రీన్‌ఫీల్డ్ కారిడార్ పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల గుండా వెళ్లనుంది. దీనికోసం ప్రత్యేకంగా భూసేకరణ అధికారుల నియామకం వేగవంతమైంది. ఇప్పటికే మన్యం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన అధికారుల జాబితాను గెజిట్ నోటిఫికేషన్ కోసం కేంద్రానికి పంపగా, మిగిలిన జిల్లాల వివరాలను త్వరలోనే సమర్పించనున్నారు.

ఈ ప్రాజెక్ట్ మొత్తం పొడవు 1,107 కి.మీ.(ఏపీలో 457 కి.మీ.)గా ఉంది. గంటకు 100 - 120 కి.మీ వేగంతో వెళ్లేలా డిజైన్ చేశారు. భూసేకరణ వెడల్పు 90 మీటర్లుగా తీసుకుంటున్నారు. 10,630 హెక్టార్ల భూకి అవసరం అవుతుంది. భూసేకరణ, పునరావాస వ్యయం రూ.8,982 కోట్లుగా ఉంది. సివిల్ పనుల అంచనా రూ.55,772 కోట్లు కాగా.. మొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.75,629 కోట్లు. ఆంధ్రప్రదేశ్ పరిదిలో ప్రాజెక్టు వ్యయం రూ.32,000 కోట్లు అవుతుందని అంటున్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks