Kia India investment Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతికి ఊతమిచ్చేలా దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం కియా ఇండియా కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో 2 బిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో సుమారు రూ. 16,800 కోట్లు) భారీ పెట్టుబడితో మరో కొత్త వాహన తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ నూతన ప్రాజెక్టు ద్వారా సంస్థ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 6 లక్షల యూనిట్ల మార్కును దాటనుంది.

గురువారం జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో కియా ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్వాంగ్‌గు లీ (Gwanggu Lee) ఈ వివరాలను అధికారికంగా ప్రకటించారు.
"ఆంధ్రప్రదేశ్‌లో మరో అదనపు తయారీ ప్లాంట్ ఏర్పాటు ద్వారా కియా ఉనికిని మరింత విస్తరిస్తున్నట్లు ప్రకటించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది," అని గ్వాంగ్‌గు లీ సదస్సు వేదికగా తెలిపారు.
12 వేల మందికి కొత్తగా ఉపాధి అవకాశాలు
రాష్ట్రంలో కియా చేపట్టనున్న ఈ భారీ విస్తరణ ప్రాజెక్టు వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 12,000 కొత్త ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. కొత్త ప్లాంట్ అందుబాటులోకి వస్తే కియా ఇండియా మొత్తం వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 6,30,000 వాహనాలకు చేరుకుంటుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో కియా ఇండియాకు ఒక భారీ తయారీ కేంద్రం ఉంది. 2017లో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ ప్రస్తుతం ఏటా 4.30 లక్షల వాహనాలను ఉత్పత్తి చేసే సామర్థ్యంతో పనిచేస్తోంది.
అయితే…. తాజాగా ప్రకటించిన 2 బిలియన్ డాలర్ల పెట్టుబడిని ఎప్పటిలోగా పెడతారు..? అదనపు ఉత్పత్తి సామర్థ్యం ఎప్పటి నుంచి కార్యరూపంలోకి వస్తుందనే నిర్దిష్ట కాలపరిమితిని గ్వాంగ్‌గు లీ తన ప్రసంగంలో వెల్లడించలేదు.
దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో కియా ఇండియా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది. 2026 ఆర్థిక సంవత్సరంలో సంస్థ మొత్తం 3.17 లక్షల వాహనాలను ఉత్పత్తి చేసింది. ఇందులో 2.89 లక్షల యూనిట్లను దేశీయ మార్కెట్కు సరఫరా చేయగా, మరో 27,953 వాహనాలను విదేశాలకు ఎగుమతి చేసింది. అనంతపురం ప్లాంట్ విజయవంతం కావడంతో… ఏపీలోనే తమ తదుపరి విస్తరణకు కియా మొగ్గు చూపడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సానుకూల పరిణామం అని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
{{/usCountry}}దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో కియా ఇండియా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది. 2026 ఆర్థిక సంవత్సరంలో సంస్థ మొత్తం 3.17 లక్షల వాహనాలను ఉత్పత్తి చేసింది. ఇందులో 2.89 లక్షల యూనిట్లను దేశీయ మార్కెట్కు సరఫరా చేయగా, మరో 27,953 వాహనాలను విదేశాలకు ఎగుమతి చేసింది. అనంతపురం ప్లాంట్ విజయవంతం కావడంతో… ఏపీలోనే తమ తదుపరి విస్తరణకు కియా మొగ్గు చూపడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సానుకూల పరిణామం అని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
{{/usCountry}}