ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, బెజవాడ వాసులకు ఏపీ ప్రభుత్వం సరికొత్త, పర్యావరణహిత రవాణా సౌకర్యాన్ని అందుబాటులోకి తేనుంది. కొచ్చి వాటర్ మెట్రో విజయవంతమైన నేపథ్యంలో, అదే తరహాలో కృష్ణా నది ఆధారంగా విజయవాడ నుండి అమరావతిని అనుసంధానిస్తూ వాటర్ మెట్రో ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ మేరకు ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(IWAI) నుంచి అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని ఏపీ ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ చైర్మన్ శివప్రసాద్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

APIWA చైర్మన్ శివప్రసాద్.. ఐడబ్ల్యూఏఐ చైర్మన్ సుశీల్ కుమార్ లోహానీకి ఇటీవల రాసిన లేఖకు స్పందించిన కేంద్ర ప్రభుత్వం, త్వరలోనే ఒక అధ్యయన బృందాన్ని పంపించి ప్రాథమిక సర్వే జరిపేందుకు సుముఖత వ్యక్తం చేసింది. మూడు జాతీయ జలమార్గాలు (NW-4, NW-79, NW-104) ఆంధ్రప్రదేశ్ గుండా వెళ్తున్నాయని, కృష్ణా, గోదావరి నదులు సరుకు రవాణా, ఫెర్రీలు, పర్యాటక బోట్లతో కలిపి సుమారు 250 నౌకలు మద్దతు ఇస్తున్నాయని తెలిపారు.
విజయవాడ - అమరావతి రాజధాని ప్రాంతం వేగంగా పట్టణీకరణ చెందుతుండటంతో రహదారులపై వాహనాల రద్దీ, కాలుష్యం పెరిగిపోతున్నాయి. దీనికి పరిష్కారంగా కృష్ణా నదిని సహజ రవాణా కారిడార్‌గా మార్చడం సురక్షితమైన ప్రత్యామ్నాయంగా మారుతుంది. రెండు విడతల్లో ప్రాజెక్టుఈ ప్రతిపాదిత 'కృష్ణా రివర్ వాటర్ మెట్రో' జాతీయ జలమార్గం-4 (NW-4) పరిధిలోకి వస్తుంది. విజయవాడ నుంచి అమరావతి వరకు నీటి మార్గంలో దాదాపు 30 కిలోమీటర్ల దూరాన్ని ఇది అనుసంధానిస్తుంది.
ఈ ప్రాజెక్టును రెండు దశల్లో చేపట్టేందుకు ప్రణాళికలు చేయాలని ఏపీ కోరుతోంది. తొలి విడత (విజయవాడ నుండి రాయపూడి): వాప్‌కోస్ (WAPCOS) సంస్థ 2021లో నిర్వహించిన సాంకేతిక సాధ్యాసాధ్యాల అధ్యయనం, అలాగే ఇటీవల కార్గో బోట్‌తో నిర్వహించిన ట్రయల్ రన్ విజయవంతం కావడంతో ఈ మార్గానికి ఎటువంటి ప్రధాన డ్రెడ్జింగ్ (పూడికతీత) అవసరం లేదని తేలింది.
రెండో విడత (రాయపూడి నుండి అమరావతి): ఈ భాగానికి సంబంధించి నదిలో పూడికతీత చేపట్టి, నావిగేషన్ ఛానల్‌ను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ తీసుకొచ్చిన వాటర్ మెట్రో పాలసీ కింద ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలపాలని ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (APCRDA) నిబంధనలకు అనుగుణంగా వాటర్ టెర్మినళ్ల నిర్మాణానికి భూమి కేటాయించేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది.
{{/usCountry}}రెండో విడత (రాయపూడి నుండి అమరావతి): ఈ భాగానికి సంబంధించి నదిలో పూడికతీత చేపట్టి, నావిగేషన్ ఛానల్‌ను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ తీసుకొచ్చిన వాటర్ మెట్రో పాలసీ కింద ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలపాలని ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (APCRDA) నిబంధనలకు అనుగుణంగా వాటర్ టెర్మినళ్ల నిర్మాణానికి భూమి కేటాయించేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది.
{{/usCountry}}