హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు కాలి బూడిదైన విషయం తెలిసిందే. కర్నూలు శివారు చిన్నకూటేరులో ఈ ఘటన జరిగింది. బస్సులో ముత్తం 44 మంది ఉన్నారు. ఇద్దరు డ్రైవర్లు, మరో ఇద్దరి సిబ్బంది, 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇందులో 19 మంది సజీవ దహనం అయ్యారు. ఈ మృతదేహాలను ఫోరెన్సిక్ బృందాలు వెలికితీశాయి. మరికొందరు గాయాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒక డ్రైవర్ పోలీసులు అదుపులో ఉన్నాడు. ప్రయాణికుల్లో ఎక్కువగా తెలంగాణ వారు ఉన్నట్టుగా తెలుస్తోంది.

ఘటన జరిగిన సమయంలో ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నారు. దీంతో ఒక్కసారిగా ఏం జరుగుతుందో వారికి అర్థం కాలేదు. పెద్ద శబ్ధం వినిపించింది. చూస్తూ ఉండగానే మంటలు వ్యాపించాయి. కొందరు ఎమర్జెన్సీ విండో నుంచి బయటకు దూకేశారు. బస్సు పూర్తిగా కాలి బూడిదైంది. బస్సు బైక్‌ను బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. బస్సు కిందకు బైక్ దూసుకెళ్లి.. ఆ సమయంలో పెట్రోల్ లీక్ కావడంతో మంటలు చెలరేగాయి.
బస్సుపై చలాన్లు
ఈ బస్సుపై తెలంగాణలో 16 చలాన్లు ఉన్నాయి. ముత్తం రూ.23120 పెండింగ్ చనాన్లు ఉన్నాయి. 9 సార్లు నో ఎంట్రీ జోన్‌లోకి ప్రవేశించింది. హైస్పీడ్, డేంజరస్ డ్రైవింగ్ ఉల్లంఘనల పైనా చలాన్లు పడినాయి. మరోవైపు ఏపీ రవాణా శాఖ కూడా బస్సు ఫిట్‌నెస్ మీద మాట్లాడింది. కావేరి ట్రావెల్స్ పేరిట బస్సు రిజిస్ట్రేషన్ చేసి నడుపుతున్నారని, డామన్ డయ్యూలో 2018లో రిజిస్ట్రేషన్ చేశారని వెల్లడించింది.
ఈ ప్రైవేట్ ట్రావెల్ బస్సుకు 2030 ఏప్రిల్ 30 వరకు టూరిస్ట్ పర్మిట్ జారీ అయింది. 2027 మార్చి 31 వరకు ఫిట్‌నెస్ ఉంది. 2026 ఏప్రిల్ 20 వరకు బస్సుకు ఇన్సూరెన్స్ ఉన్నది. బైక్‌ను బలంగా ఢీకొట్టడం కారణంగానే మంటలు వచ్చాయని రవాణ శాఖ తెలిపింది. అన్ని కోణాల్లో పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్టుగా వెల్లడించింది.
విచారణకు ఆదేశం
ఈ ఘటనతో బస్సు ప్రమాద ఘటనలపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఘటన నేపథ్యంలో సమగ్ర విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు తక్షణ సాయం అందించాలన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని చెప్పారు.
{{/usCountry}}ఈ ఘటనతో బస్సు ప్రమాద ఘటనలపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఘటన నేపథ్యంలో సమగ్ర విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు తక్షణ సాయం అందించాలన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని చెప్పారు.
{{/usCountry}}ప్రైవేట్ బస్సుల ఫిట్‌నెస్, సేఫ్టీ, పర్మిట్ తనిఖీలకు చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. అన్ని జిల్లాల్లో బస్సుల సాంకేతిక తనిఖీలు చేపట్టాలని చెప్పారు. ప్రమాదానకి నిర్లక్ష్యం కారణం అని తెలిస్తే.. బాధ్యులపై చర్యలు తప్పవవి హెచ్చరించారు.