ప్రతి ఏడాది మాదిరిగానే ఈఏడాది కూడా శబరిమల ఉత్సవానికి విస్త్రతమైన ఏర్పాట్లు చేసినట్టు తిరువనంతపురం ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు(Travnacore Devaswom Board) ఛైర్మన్ కె.జయకుమార్.. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్‌కి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ప్రతి ఏటా అధిక సంఖ్యలో అయ్యప్ప మాలదారులైన అయ్యప్ప భక్తులు శబరిమలను సందర్శించుకుంటారని గుర్తు చేశారు.

మరికొన్ని రోజుల్లో రెండు నెలల పాటు జరిగే శబరిమల పండుగ మహోత్సవం ప్రారంభం కానున్న నేపథ్యంలో భక్తులకు సంతృప్తికరమైన యాత్రా అనుభవాన్ని అందించేందుకు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు విస్తృతమైన ఏర్పాట్లు చేసిందని తెలిపారు. గతంలో గుర్తించిన పలు లోపాలను సరిదిద్దినట్టుగా వెల్లడించారు. ముఖ్యంగా పారిశుద్ధ్య నిర్వహణలో గణనీయమైన మార్పులు తీసుకొచ్చామన్నారు. కొత్త పారిశుద్ధ్య విధానాన్ని ప్రవేశపెట్టడంతో పాటు మరుగుదొడ్ల వినియోగాన్ని ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చామని లేఖలో పేర్కొన్నారు.
వాటిని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేకంగా ఒక ప్రొపెషనల్ ఏజెన్సీకి వాటి నిర్వహణ బాధ్యతను అప్పగించి వారి సేవలను వినియోగిస్తున్నామని ఏపీ ప్రభుత్వానికి ఛైర్మన్ కె.జయకుమార్ తెలిపారు. పెరుగుతున్న భక్తుల అవసరాలకు అనుగుణంగా తగినంత పరిమాణంలో అరవణ ప్రసాదం అందుబాటులో ఉంచనున్నామని స్పష్టం చేశారు.
'పరిశుభ్రమైన శబరిమల.. పవిత్రమైన శబరిమల' అనేది ఈ ఏడాది ప్రధాన ఇతివృత్తంగా నిర్ణయించి విస్తృతమైన ఏర్పాట్లు చేసినట్టు ఛైర్మన్ జయకుమార్ వెల్లడించారు. పంపా నది వద్ద అయ్యప్ప భక్తులు వదిలివేసే పాత దుస్తులను తీయడం ఒక సవాలుగా ఉందని లేఖలో ప్రస్తావించారు. నదిలో పాత దుస్తులను వదిలివేయడం భక్తులు అలాగే కొనసాగిస్తున్నారని తెలిపారు. నిజానికి ఈ ఆచారానికి ఎలాంటి మతపరమైన లేదా ఆచార సంబంధమైన ప్రాముఖ్యత లేదన్నారు.
ఈ అలవాటును అయ్యప్ప భక్తుల నుంచి పొగొట్టే దిశగా కృషి చేస్తున్నట్టు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. అయితే ఈ ముఖ్యమైన సందేశాన్ని ఏపీ ప్రభుత్వం.. మీడియా ద్వారా అయ్యప్ప భక్తులకు తెలియజేయాలని కోరుతున్నట్టు ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖలో జయకుమార్ తెలియజేశారు. ఈ ఏడాది శబరిమల యాత్ర విజయవంతంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందించాలని ఏపీ ప్రభుత్వాన్ని ట్రావెన్‌కోర్ బోర్డు కోరింది.
{{/usCountry}}ఈ అలవాటును అయ్యప్ప భక్తుల నుంచి పొగొట్టే దిశగా కృషి చేస్తున్నట్టు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. అయితే ఈ ముఖ్యమైన సందేశాన్ని ఏపీ ప్రభుత్వం.. మీడియా ద్వారా అయ్యప్ప భక్తులకు తెలియజేయాలని కోరుతున్నట్టు ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖలో జయకుమార్ తెలియజేశారు. ఈ ఏడాది శబరిమల యాత్ర విజయవంతంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందించాలని ఏపీ ప్రభుత్వాన్ని ట్రావెన్‌కోర్ బోర్డు కోరింది.
{{/usCountry}}