తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణ పరిస్థితులున్నాయి. మన్నార్ గల్ఫ్ నుంచి తమిళనాడు తీరంలోని నైరుతి బంగాళాఖాతం వరకు తూర్పు గాలుల్లో ఏర్పడిన ద్రోణి… కొమోరియన్ ప్రాంతం నుంచి తమిళనాడు, కేరళ మీదుగా దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు విస్తరించింది. ఇది సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. ఈ ద్రోణి ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది.
ఏపీలోని ఈ జిల్లాలకు వర్షసూచన…

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ బులెటిన్ లోని వివరాల ప్రకారం… ఇవాళ (నవంబర్ 27, 2026) నెల్లూరు, కర్నూలు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి జల్లులు పడతాయి.
అమరావతి వాతావరణ కేంద్రం విడుదల చేసిన వివరాల ప్రకారం… కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో వచ్చే కొద్ది రోజులు వాతావరణంలో మార్పులు కనిపిస్తాయి. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల పడే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములతో కూడిన మెరుపులు సంభవించే వీలుంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి.పలు చోట్ల పొగమంచు కూడా కమ్ముకునే అవకాశం ఉంది.
ఉదయం వేళల్లో పొగమంచు కారణంగా రహదారులపై దృశ్యమానత తగ్గే అవకాశం ఉన్నందున వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని అధికారులు సూచిస్తున్నారు. రైతులు తమ పంట ఉత్పత్తులను తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు.
తెలంగాణలోనూ వర్షాలు :
ద్రోణి ప్రభావంతో తెలంగాణలోనూ అక్కడక్కడా వర్షాలు పడుతున్నాయి. నిన్న అర్ధరాత్రి నుంచి ఇవాళ తెల్లవారుజాము వరకు హైదరాబాద్ లో వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో అయితే దంచికొట్టిన పరిస్థితి కనిపించింది.
{{/usCountry}}ద్రోణి ప్రభావంతో తెలంగాణలోనూ అక్కడక్కడా వర్షాలు పడుతున్నాయి. నిన్న అర్ధరాత్రి నుంచి ఇవాళ తెల్లవారుజాము వరకు హైదరాబాద్ లో వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో అయితే దంచికొట్టిన పరిస్థితి కనిపించింది.
{{/usCountry}}ఇటీవల కాలంలో హైదరాబాద్ నగరంలో ఆశించిన స్థాయిలో వర్షాలు పడలేదు. ఫలితంగా భూగర్భ జలాలు అడుగంటి తాగునీటికి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. తాజాగా కురిసిన వర్షం నగరవాసులకు కొత్త ఊరటనిచ్చిచ్చే సూచనలున్నాయి. ఇక ఇవాళ కూడా హైదరాబాద్ సిటీలో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
ABOUT THE AUTHOR
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.