...
...
Next Story

బంగాళాఖాతంలో అల్పపీడనం... తుఫాన్ గా మారే ఛాన్స్ - ఈ తేదీల్లో కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన..!

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నవంబర్ 16 నాటికి తుఫానుగా బలపడనుంది. దీని ప్రభావంతో నవంబర్ 18, 19 తేదీల్లో కోస్తాంధ్ర, ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది.

Published on: Nov 14, 2026, 09:14:44 IST
Advertisement

బంగాళాఖాతంలో మరోసారి వాతావరణం మారుతోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతూ నవంబర్ 16 సాయంత్రం నాటికి మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తాజాగా ప్రకటించింది. మధ్య అండమాన్ సముద్రం, దాని పరిసర అండమాన్ నికోబార్ దీవులపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈ అల్పపీడనం రూపుదిద్దుకుంది.

తుఫాను గమనం ఇలా..

బంగాళాఖాతంలో మరో తుఫాను
బంగాళాఖాతంలో మరో తుఫాను

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం…… ఈ అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతూ నవంబర్ 15 నాటికి తీవ్ర అల్పపీడనంగా మారుతుంది. ఆ తర్వాత మరింత బలపడి వాయుగుండంగా రూపాంతరం చెందుతుంది. అనంతరం ఉత్తర-వాయువ్య దిశగా ప్రయాణిస్తూ నవంబర్ 16 సాయంత్రం కల్లా మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారనుంది.

కోస్తాంధ్ర, ఒడిశాకు భారీ వర్ష సూచన

ఈ తుఫాన్ ప్రభావంతో అండమాన్ నికోబార్ దీవుల్లో నవంబర్ 16 వరకు భారీ వర్షాలు కురుస్తాయి. ఆ తర్వాత దీని ప్రభావం తూర్పు తీర రాష్ట్రాలపై పడనుంది. ముఖ్యంగా నవంబర్ 18, 19 తేదీల్లో కోస్తా ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దీనితో తీర ప్రాంత ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది.

తుఫాను నేపథ్యంలో సముద్రం అల్లకల్లోలంగా మారనుంది. అలల ఉధృతి మరింత పెరిగే ప్రమాదం ఉండటంతో వాతావరణ శాఖ మత్స్యకారులకు కఠిన హెచ్చరికలు జారీ చేసింది.

  • ఇప్పటికే వేటకు వెళ్లిన మత్స్యకారులు నవంబర్ 15 లోగా తీరానికి చేరుకోవాలి.
  • నవంబర్ 17 వరకు అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల తీర ప్రాంతాల్లో వేటకు వెళ్లకూడదు.
  • నవంబర్ 15 నుంచి 18 వరకు ఆగ్నేయ బంగాళాఖాతంలోకి, నవంబర్ 16 నుంచి 19 వరకు మధ్య బంగాళాఖాతంలోకి మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లరాదని అధికారులు సూచించారు

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks