ఇప్పుడు దేశం మెుత్తం ఎల్పీజీ గురించే చర్చ. ఇప్పటికే కమర్షియల్ ఎల్పీజీ సరఫరా ఆగిపోయింది. చాలా ప్రాంతాల్లో కృత్రిమ కొరత సృష్టించి.. డొమెస్టిక్ సిలిండర్ల మీద ఎక్కువగా డబ్బులు దండుకుంటున్నారు. ఇంట్లోని ఎల్పీజీ సిలిండర్‌లో ఇప్పుడు ఎంత గ్యాస్ ఉందో తెలుసుకోవడం చాలా ముఖ్యమైన పని. ఎందుకంటే కొన్ని రోజులుగా భారతదేశంలో LPG సిలిండర్ కొరత ఒక ప్రధాన సమస్యగా మారింది. పశ్చిమాసియా దేశాల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలతో గ్యాస్ మీద ప్రభావం పడింది.

{{^htLoading}} {{/htLoading}}
ప్రస్తుతం మీరు బుక్ చేసుకుంటే గృహ వినియోగ సిలిండర్ రావడానికి చాలా టైమ్ పడుతుంది. నిజానికి చాలా ప్రాంతాల్లో ఇప్పుడు గ్యాస్ సిలిండర్ బుక్ అవ్వడం లేదు. ఈ సమయంలో వంట చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా గ్యాస్ అయిపోతే కష్టమే. మీ గ్యాస్ సిలిండర్ ఎప్పుడు ఖాళీ అవుతుందో మీరు ముందే తెలుసుకోవాలి. ఇందుకో కొన్ని చిట్కాలు ఉన్నాయి.
- గ్యాస్ సిలిండర్ చుట్టూ తడిగా ఉన్న గుడ్డను చుట్టి , ఒక నిమిషం పాటు అలాగే ఉంచండి. తర్వాత ఆ గుడ్డను తీసివేసి, కాసేపు సిలిండర్‌ను బాగా గమనించండి. పొడి ప్రాంతం సిలిండర్ లోపల ఖాళీ స్థలాన్ని సూచిస్తుంది, తడి ప్రాంతం గ్యాస్ ఉన్న ప్రాంతాన్ని చూపిస్తుంది. గ్యాస్ లేని ప్రాంతం వెంటనే ఎండిపోతుంది. గ్యాస్ ఉన్న ప్రాంతం ఆరిపోవడానికి కాస్త టైమ్ తీసుకుంటుంది. సిలిండర్‌లో మిగిలి ఉన్న గ్యాస్ మొత్తాన్ని నిర్ణయించడానికి ఇది కచ్చితమైన పద్ధతి.
- గ్యాస్ సిలిండర్‌లో మిగిలి ఉన్న గ్యాస్ మొత్తాన్ని తనిఖీ చేయడానికి స్పర్శ విధానం కూడా ఉంది. సిలిండర్ ఒక వైపున కొంత వెచ్చని నీటిని పోయాలి. తరువాత నెమ్మదిగా మీ వేలిని నీరు పోసిన ప్రాంతంపైకి కదిలించండి. మీ వేలుకు చల్లదనం ఫీల్ అనిపిస్తే.. ఆ భాగం వరకు గ్యాస్ ఉన్నట్టు లెక్క. ఈ స్పర్శ పద్ధతితో సిలిండర్‌లో మిగిలి ఉన్న మొత్తాన్ని సులభంగా అంచనా వేయవచ్చు.
- గ్యాస్ సిలిండర్‌లో ఎంత గ్యాస్ ఉందో తెలుసుకోవడానికి చాక్ పీస్‌తో కూడా ఒక సులభమైన చిట్కా పాటించొచ్చు. సిలిండర్ పైన నుండి కిందకు చాక్ పీస్‌తో ఒక నిలువు గీత గీయాలి. కొద్ది నిమిషాల తర్వాత గ్యాస్ ఉన్న భాగం చల్లగా ఉండటం వల్ల అక్కడ తేమ ఏర్పడి, చాక్ పీస్ గీత కొంచెం తడిగా కనిపిస్తుంది. గ్యాస్ లేని ఖాళీ భాగంలో గీత పొడిగా ఉంటుంది.
- ఇక సాధారణంగా పద్ధతి ఏంటంటే.. గ్యాస్ రంగు ఆధారంగా అంచనా వేయడం. మంట రంగు నీలం రంగులో ఉంటే, తగినంత గ్యాస్ ఉందని అర్థం. దీనికి విరుద్ధంగా మంట రంగు పసుపు లేదా నారింజ రంగులో కనిపిస్తే.. గ్యాస్ అయిపోతోందని సూచిస్తుంది. బర్నర్‌లో గ్యాస్ పీడనం తగ్గి, వాయువులో కలిసిన మలినాలు మండడం ప్రారంభించడం వల్ల ఈ రంగు మార్పు జరుగుతుంది.
{{^htLoading}} {{/htLoading}}
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}