శివనామస్మరణతో మారుమోగుతున్న శ్రీశైలం.. ఆలయానికి రోజూ లక్ష మంది భక్తులు!

మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం ఆలయానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. దాదాపు రోజూ లక్ష మంది భక్తులు శ్రీశైలం కొండకు చేరుకుంటున్నారు.

Published on: Feb 10, 2026, 20:33:28 IST
By , Srisailam
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీశైలం మల్లన్న దర్శనానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. సోమవారం ఒక్క రోజే దాదాపు లక్ష మంది భక్తులు శ్రీశైలం చేరుకున్నారు. వీరిలో దాదాపు 50,000 మంది దర్శనం చేసుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు. మంగళవారం కూడా ఇదే తరహాలో భక్తులు తరలివచ్చారు. ప్రస్తుతం ప్రతిరోజూ దాదాపు 50,000 మంది భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నారు.

శ్రీశైలం మల్లన్న ఆలయం
శ్రీశైలం మల్లన్న ఆలయం

మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీ భారీగా ఉంది. ఆలయంలో శివభక్తుల క్యూలు భారీగా ఉన్నాయి. ప్రతిరోజూ దాదాపు లక్ష మంది భక్తులు వస్తున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. వసతి సౌకర్యాలు సరిపోకపోవడంతో చాలా మంది యాత్రికులు బహిరంగ ప్రదేశాల్లో విశ్రాంతి తీసుకోవలసి వస్తోంది. ఫిబ్రవరి 16 వరకు భారీ రద్దీ కొనసాగుతుందని ఆలయ అధికారులు భావిస్తున్నారు.

జనసమూహాన్ని నియంత్రించడంలో పోలీసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోమవారం భక్తులు అదుపు చేయలేకపోవడంతో లాఠీఛార్జ్ జరిగిందని వార్తలు వచ్చాయి. అధికారులు భద్రతా చర్యలను ముమ్మరం చేశారు. భక్తులకు సజావుగా దర్శనం కల్పించడానికి అదనపు పోలీసు బలగాలను మోహరించారు.

సీఎం చంద్రబాబు రివ్యూ

శ్రీశైలం సహా వివిధ శివాలయాల్లో భక్తుల రద్దీ, వసతులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ, సౌకర్యాలపై మంత్రులు, ప్రధాన కార్యదర్శి, డీజీపీలతో పాటు ఇతర అధికారులతో ఢిల్లీ నుంచి రివ్యూ చేశారు. అధికారులు, జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలను, సౌకర్యాలను సమీక్షించారు.

శివరాత్రి నాటికి శ్రీశైలంలో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పటిష్ట చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం, హోం మంత్రి అనిత ప్రత్యేక శ్రద్ధతో ఏర్పాట్లు, వసతులపై అధికారులతో పర్యవేక్షించాలని సూచించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా, దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి త్వరితగతిన దర్శనం పూర్తయ్యేలా, వసతి లభించేలా కార్యచరణ అమలు చేయాలని చెప్పారు.

దీక్షలు, మాలధారణలతో ఎంతో కష్టపడి ఆలయానికి చేరుకునే భక్తులకు ఇబ్బంది కలిగేలా, అగౌరపరిచేలా ఎవరూ వ్యవహరించ కూడదని సీఎం ఆదేశించారు. రోజు రోజుకూ దేవాలయాల్లో పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని పేర్కొన్నారు. అన్ని విభాగాలు పూర్తి సమన్వయంతో పనిచేసేలా ఇప్పటి నుంచే పర్యవేక్షించాలని సీఎస్ విజయానంద్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More