నేటి నుంచి శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు - ఈసారి కూడా ఉచితంగా లడ్డూలు, ఆ 2 రోజులు టోల్ ఫ్రీ జర్నీ...!
నేటి నుంచి శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈనెల. 9వ తేదీ నుంచి ప్రతి రోజూ రాత్రి 7 గంటలకు శ్రీస్వామిఅమ్మవార్లకు వాహన సేవలు, గ్రామోత్సవం నిర్వహిసారు. ఈ నెల 18వ తేదీతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
శ్రీశైల మహాక్షేత్రం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ఇవాళ ఉదయం 9 గంటలకు యాగశాల ప్రవేశం చేస్తారు. అనంతరం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ప్రారంభ పూజలు నిర్వహిస్తారు.

12వరకు స్పర్శ దర్శనాలు…
రాత్రి 7 గంటలకు భేరీ పూజ, భేరీ తాండవం ఉంటుంది.ఆ తర్వాత ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈనెల 9వ తేదీ నుంచి ప్రతి రోజూ రాత్రి 7 గంటలకు శ్రీస్వామిఅమ్మవార్లకు వాహన సేవలు, గ్రామోత్సవం నిర్వహిస్తారు. శివదీక్షా భక్తులకు నేటి నుంచి ఈ నెల 12వ తేదీ వరకు శ్రీమల్లికార్జునుడి స్పర్శ దర్శనం కల్పిస్తారు. ప్రతి రోజూ ఉదయం 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు భక్తులకు దర్శనం కల్పించనున్నారు.
శ్రీశైల మహా పుణ్యక్షేత్రంలో నిర్వహించనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నారు. గత సంవత్సరం ఎదురైన లోపాలను సవరించడంతో పాటు…. భక్తుల రద్దీ దృష్ట్యా వచ్చే సమస్యలను ముందుగానే అంచనా వేసి పరిష్కార మార్గాలు సిద్ధంగా ఉంచుకునేలా కార్యాచరణను రూపొందించారు.
ఉచితంగా లడ్డూల పంపిణీ…
అడవి మార్గంలో 48 కిలోమీటర్లు నడక దారిలో వచ్చే శివ భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా అటవీ శాఖ అధికారులు సహకారం కోరారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రతి శాఖ సమన్వయంతో పనిచేసి సమస్యలను అధిగమించేలా ఆదేశాలిచ్చారు. గత ఏడాది తరహాలోనే ఈ సంవత్సరం కూడా భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదం పంపిణీ చేయనున్నారు.ఈ నెల 14, 15 తేదీలలో రెండు రోజుల పాటు టోల్ గేట్ల వద్ద వాహనాలకు ఉచిత అనుమతి ఇవ్వనున్నారు.
శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోనున్నారు. అన్నదాన కార్యక్రమాలు నిర్వహించే వారికి ముందుగా రిజిస్ట్రేషన్ చేయించి… తగిన స్థలాలను కేటాయించాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి.
జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఏర్పాట్లపై మాట్లాడుతూ… ఫిబ్రవరి 8 నుంచి మార్చి 18 వరకు నిర్వహించనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇందుకోసం ఖచ్చితమైన ప్రణాళికలతో విధులు నిర్వహించేలా గత సమావేశంలో అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు. దేవస్థానం సిబ్బంది, పోలీస్, జిల్లా అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సౌకర్యవంతమైన, సంతృప్తికరమైన దర్శనం కల్పించేలా అన్ని ఏర్పాట్లు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
సీఎంకు ఆహ్వానం….
శ్రీశైలంలో జరగనున్న మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబును ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఆలయ బోర్డు ఛైర్మన్ రమేష్ నాయుడు, ధర్మకర్తల మండలి సభ్యులు క్యాంప్ కార్యాలయంలో కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా స్వామివారి చిత్రపటం, ప్రసాదాలను అందచేసి ఆలయ పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం ఇచ్చారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

