ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రూ.1,500 కోట్ల విలువైన భారీ మనీలాండరింగ్, అంతర్జాతీయ హవాలా రాకెట్‌ను వెలుగులోకి తెచ్చింది. నకిలీ పత్రాలను ఉపయోగించి, కస్టమ్ సాఫ్ట్వేర్ దిగుమతి నెపంతో భారతదేశం వెలుపలకు నిధులను అక్రమంగా తరలించిన కేసులో ఈడీ.. ఢిల్లీ, కోల్‌కతాలోని ఏడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఈ మొత్తం కుంభకోణానికి ఆంధ్రప్రదేశ్ నుండి సింగపూర్, హాంగ్‌కాంగ్, చైనాలతో సంబంధాలు ఉన్నాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విశాఖపట్నం సబ్ జోనల్ కార్యాలయం, మనీలాండరింగ్ నిరోధక చట్టం(PMLA), 2002 నిబంధనల ప్రకారం ఢిల్లీ, కోల్‌కతాలోని ఏడు కీలక ప్రదేశాలలో పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించింది. ప్రాథమిక విచారణల ప్రకారం ఈ కుంభకోణం మొత్తం విలువ సుమారు రూ.1,500 కోట్లుగా అంచనా వేశారు.

ఈ కేసు మూలాలు 2017లో ఉన్నాయి. ఆదాయపు పన్ను శాఖ ఫిర్యాదు ఆధారంగా విశాఖపట్నంలోని ఎంవీపీ పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ నెం. 181/2017 ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసు ప్రధానంగా వడ్డి మహేష్, ఇతరులపై నమోదు అయింది.
నిందితుడు వడ్డి మహేష్, అతని సహచరులు పక్కా ప్రణాళికతో కూడిన కుట్రలో భాగంగా నకిలీ పత్రాలను సృష్టించి, వాటిని వివిధ బ్యాంకుల ద్వారా పెద్ద మొత్తంలో విదేశీ డబ్బు పంపడానికి ఉపయోగించారు. మొత్తం రూ.569 కోట్ల అక్రమ బదిలీలు, షెల్ కంపెనీల నెట్వర్క్ వెలుగులోకి వచ్చాయి. నిందితుడు వడ్డి మహేష్, అతడి తండ్రి, ఇతర సహచరులతో కలిసి కోల్‌కతాలో రిజిస్టర్డ్ కార్యాలయాలతో అనేక నకిలీ కంపెనీలను సృష్టించి, వాటి పేర్లతో బ్యాంకు ఖాతాలను తెరిచినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
ఈ ఖాతాల ద్వారా కస్టమ్ సాఫ్ట్వేర్ కొనుగోలు అనే నెపంతో సింగపూర్, హాంగ్‌కాంగ్, చైనాలోని ఐదు కంపెనీలకు మొత్తం రూ.569.03 కోట్లు బదిలీ చేశారు. విదేశీ కంపెనీల నకిలీ ఇన్వాయిస్లు మాత్రమే బ్యాంకుల్లో జమ చేశారు, కానీ ఈ చెల్లింపులకు బదులుగా వాస్తవానికి ఎలాంటి సాఫ్ట్వేర్ దిగుమతి కాలేదు.
ఈడీ దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ, ఈ రాకెట్లో మరో ప్రధాన వ్యక్తి అయిన భీమేంద్ర కుమార్ గోయల్ వెలుగులోకి వచ్చాడు. దర్యాప్తు సంస్థ ప్రకారం, భీమేంద్ర కుమార్ గోయల్ ఒక పాత నేరస్థుడు, ఇతడిని కోఫెపోసా (COFEPOSA) కింద మూడుసార్లు అదుపులోకి తీసుకున్నారు. గోయల్ నేపాల్‌కు అందుబాటులో ఉన్న కస్టమ్స్ ట్రాన్సిట్ డిక్లరేషన్ పథకాన్ని దుర్వినియోగం చేస్తూ, కస్టమ్స్ సుంకాలను ఎగవేస్తూ భారీ పరిమాణంలో సౌందర్య సాధనాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, వస్త్ర సామగ్రిని భారతదేశంలోకి అక్రమంగా రవాణా చేస్తున్నాడు.
{{/usCountry}}ఈడీ దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ, ఈ రాకెట్లో మరో ప్రధాన వ్యక్తి అయిన భీమేంద్ర కుమార్ గోయల్ వెలుగులోకి వచ్చాడు. దర్యాప్తు సంస్థ ప్రకారం, భీమేంద్ర కుమార్ గోయల్ ఒక పాత నేరస్థుడు, ఇతడిని కోఫెపోసా (COFEPOSA) కింద మూడుసార్లు అదుపులోకి తీసుకున్నారు. గోయల్ నేపాల్‌కు అందుబాటులో ఉన్న కస్టమ్స్ ట్రాన్సిట్ డిక్లరేషన్ పథకాన్ని దుర్వినియోగం చేస్తూ, కస్టమ్స్ సుంకాలను ఎగవేస్తూ భారీ పరిమాణంలో సౌందర్య సాధనాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, వస్త్ర సామగ్రిని భారతదేశంలోకి అక్రమంగా రవాణా చేస్తున్నాడు.
{{/usCountry}}భీమేంద్ర కుమార్ గోయల్తోపాటుగా మరికొందరు షెల్ సంస్థలను నడిపారు. విదేశాలకు చెల్లింపులు చేయడానికి గోయల్, వడ్డీ మహేష్ కలిసి ప్లాన్ చేశారు. ఈ నిధులను సింగపూర్, హాంగ్ కాంగ్‌లలో నామినీ డైరెక్టర్ల నిర్వహణలో ఉన్న కంపెనీలలో ఉంచారు. ఆ తర్వాత నిధులను మెస్సర్స్ స్విఫ్ట్ ఫాక్స్ ప్రైవేట్ లిమిటెడ్, మెస్సర్స్ భావ్ టెక్నాలజీ చైనా లిమిటెడ్ వంటి కంపెనీల ఖాతాలకు బదిలీ చేయడం ద్వారా మనీలాండరింగ్ చేశారు.
ఢిల్లీ, కోల్‌కతాలో ఈడీ నిర్వహించిన సోదాల్లో దర్యాప్తు సంస్థ కీలకమైన సాక్ష్యాలను స్వాధీనం చేసుకుంది. లెక్కల్లో చూపని నగదు, విదేశీ కరెన్సీని అధికారులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా పెద్ద మొత్తంలో ఇతర పత్రాలు, ఆస్తి పత్రాలు, షెల్ సంస్థల ద్వారా మనీ లాండరింగ్, లాండరింగ్ చేయడానికి ఉపయోగించే డిజిటల్ పరికరాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.