వైకుంఠ ద్వార ద‌ర్శనాల‌ను భ‌క్తుల‌కు దివ్య అనుభూతిగా మార్చాలి : టీటీడీ

వైకుంఠ ద్వార ద‌ర్శనాల‌ను భ‌క్తుల‌కు దివ్య అనుభూతిగా మార్చాలని టీటీడీ అద‌న‌పు ఈవో సి.హెచ్‌.వెంక‌య్య చౌద‌రి అన్నారు. భ‌క్తుల భ‌ద్రత, ర‌ద్దీ నిర్వహ‌ణ‌కు అత్యాధునిక ఏఐ సాంకేతిక‌త‌ వినియోగిస్తున్నట్టుగా తెలిపారు.

Published on: Dec 28, 2025, 22:00:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో డిసెంబ‌ర్ 30 నుండి జ‌న‌వ‌రి 8వ తేది వ‌ర‌కు నిర్వహించ‌నున్న ప్రతిష్టాత్మక‌ వైకుంఠ ద్వార ద‌ర్శనాల‌కు వచ్చే భ‌క్తుల‌కు స్వామివారి ద‌ర్శనాన్ని దివ్య అనుభూతిగా మార్చేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాల‌ని టీటీడీ అద‌న‌పు ఈవో సి.హెచ్‌.వెంక‌య్య చౌద‌రి అన్నారు. తిరుమ‌ల‌లోని ఆస్థాన మండ‌పంలో ఆదివారం సాయంత్రం వైకుంఠ ద్వార ద‌ర్శనాల‌కు డిప్యూటేష‌న్ విధుల‌కు వచ్చిన టీటీడీ ఉద్యోగులు, పోలీసుల‌కు దిశానిర్దేశం చేశారు.

తిరుమల శ్రీవారి ఆలయం
తిరుమల శ్రీవారి ఆలయం

ఈ సంద‌ర్భంగా వెంకయ్య చౌదరి మాట్లాడుతూ.. ఈసారి వైకుంఠ ద్వార ద‌ర్శనాల‌కు టోకెన్ల కేటాయింపులో విధానాత్మక మార్పులు తీసుకొచ్చిన‌ట్లు చెప్పారు. వైకుంఠ ద్వార ద‌ర్శన విధుల‌కు వ‌చ్చిన సిబ్బంది వ్యవ‌స్థను పూర్తిగా అర్థం చేసుకోవాలన్నారు. స‌మ‌న్వయంతో భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు త‌లెత్తకుండా 24 గంట‌లు అప్రమ‌త్తంగా ఉంటూ విధులు నిర్వహించాల‌న్నారు.

భ‌క్తుల భ‌ద్రత, ర‌ద్దీ నిర్వహ‌ణ‌కు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అత్యాధునిక ఏఐ సాంకేతిక‌త‌ వినియోగిస్తున్నట్లు చెప్పారు వెంకయ్య చౌదరి. ఈ సాంకేతిక‌త ద్వార భ‌క్తులు, వాహ‌నాల ర‌ద్దీపై ప్రత్యక్ష ప‌ర్యవేక్షణ కొన‌సాగుతుంద‌ని పేర్కొన్నారు. టీటీడీ, పోలీస్, విజిలెన్స్ విభాగాల నుండి ఐటీ నిపుణులు స‌మ‌న్వయంతో ప‌ని చేస్తూ ఎప్పటిక‌ప్పుడు భ‌క్తుల స‌మాచారాన్ని అప్డేట్ చేస్తూ వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 లోని ఇంటిగ్రేటెడ్ ఏఐ కమాండ్ కంట్రోల సెంట‌ర్ లో ప్రద‌ర్శించాల‌ని చెప్పారు. భ‌విష్యత్తులో తిరుమ‌ల‌కు వ‌చ్చే భ‌క్తుల కోసం స‌మ‌స్య ర‌హిత వ్యవ‌స్థను నిర్మించేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాల‌ని తెలియ‌జేశారు.

ఈ స‌మావేశంలో టీటీడీ జేఈవో వీర‌బ్రహ్మం, సీవీఎస్వో ముర‌ళీకృష్ణ, తిరుప‌తి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, డీఎఫ్ఓ ఫణికుమార్ నాయుడు, ఇత‌ర టీటీడీ ఉన్నతాధికారులు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More