యూట్యూబ్ వీడియోలలో కనిపించే ప్రతిదీ నిజం కాదని, సామాజిక మాధ్యమాలలో చూసే కల్పిత దృశ్యాలను చూసి సాహసాలు చేస్తే ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించే మరో సంఘటన సత్యసాయి జిల్లా రామగిరిలో చోటుచేసుకుంది. యూట్యూబ్ వీడియో చూసి ఆకర్షితుడైన ఒక యువకుడు, బంగారాన్ని అన్వేషించే క్రమంలో పాడుబడిన గనిలోకి దిగి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలేనికి చెందిన ప్రభాకర్ రెడ్డి, పల్లిపాలేనికి చెందిన అతని మిత్రుడు కిష్టయ్యలు ఇటీవల యూట్యూబ్లో రామగిరి బంగారు గనులకు సంబంధించిన ఒక వీడియో చూశారు. గనుల్లో ఇప్పటికీ బంగారం లభిస్తుందనే భ్రమతో, ఎలాగైనా సరే ఆ నిధిని సాధించాలనే పిచ్చి ఆలోచనతో ఇద్దరూ రాత్రి సుమారు 10:30 గంటల ప్రాంతంలో రామగిరిలోని పాడుబడిన పాత బంగారు గని వద్దకు చేరుకున్నారు.
పక్కా ప్రణాళికతో వచ్చామనుకున్న ప్రభాకర్ రెడ్డి, ఒక తాడు సహాయంతో గని లోపలికి దిగాడు. ఒకవేళ లోపల నీరు ఉంటే ఈదేందుకు వీలుగా ఒక ట్యూబ్ను, వెలుతురు కోసం టార్చ్ లైట్ను కూడా తనతో తీసుకెళ్లాడు. అయితే గని లోపలికి వెళ్లేకొద్దీ చీకటి కమ్మేసింది. అంతేకాకుండా గాలి ఆడక తీవ్రమైన ఇబ్బంది మొదలైంది. ఊపిరి అందక, తిరిగి పైకి రాలేక ప్రభాకర్ రెడ్డి లోపలే చిక్కుకుపోయాడు.
బయట కాపలాగా ఉన్న మిత్రుడు కిష్టయ్య, లోపల ఉన్న ప్రభాకర్ తీవ్ర ఇబ్బంది పడుతున్నాడని గ్రహించి వెంటనే అప్రమత్తమయ్యాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే రామగిరి పోలీసులకు సమాచారం అందించాడు. ఘటన తీవ్రతను అర్థం చేసుకున్న పోలీసులు తక్షణమే స్పందించి, ధర్మవరం నుంచి ఫైర్, రెస్క్యూ టీమ్ను రప్పించారు. సహాయక బృందాలు అత్యంత సమర్థవంతంగా ప్రతికూల పరిస్థితుల్లోనూ శ్రమించి ప్రభాకర్ రెడ్డిని సురక్షితంగా బయటకు తీశాయి.
సురక్షితంగా బయటపడిన అనంతరం ప్రభాకర్ రెడ్డి తన అనుభవాన్ని పంచుకుంటూ కన్నీటిపర్యంతమయ్యాడు. 'అది నాకు నిజంగా పునర్జన్మే.. చావు అంచుల దాకా వెళ్లొచ్చాను. సోషల్ మీడియా, యూట్యూబ్ వీడియోలను చూసి ఎవరూ ఇలాంటి ప్రాణాంతకమైన సాహసాలు చేయవద్దు.' అని వేడుకున్నాడు.
{{/usCountry}}సురక్షితంగా బయటపడిన అనంతరం ప్రభాకర్ రెడ్డి తన అనుభవాన్ని పంచుకుంటూ కన్నీటిపర్యంతమయ్యాడు. 'అది నాకు నిజంగా పునర్జన్మే.. చావు అంచుల దాకా వెళ్లొచ్చాను. సోషల్ మీడియా, యూట్యూబ్ వీడియోలను చూసి ఎవరూ ఇలాంటి ప్రాణాంతకమైన సాహసాలు చేయవద్దు.' అని వేడుకున్నాడు.
{{/usCountry}}సామాజిక మాధ్యమాల్లో వ్యూస్, లైక్స్ కోసం కొందరు చేసే కల్పిత వీడియోలను నమ్మి యువత తమ విలువైన ప్రాణాలను పణంగా పెట్టవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పాడుబడిన గనులు, గుహలు, నిర్జన ప్రాంతాలలోకి వెళ్లడం చట్టరీత్యా నేరమే కాక, ప్రాణాలకే ముప్పు అని స్పష్టం చేశారు.
ఈ ఘటన అనంతరం ప్రభాకర్ తన అనుభవాన్ని చెప్పుకున్నాడు. మృత్యువు ముఖం చూసి.. బయటకు వచ్చినట్టుగా అనిపించదని భయంతో చెప్పాడు. యూట్యూబ్ వీడియోలు చూసి అలాంటి ప్రమాదకరమైన రిస్కులు తీసుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశాడు.