పారదర్శకతను మెరుగుపరచడం, అక్రమ కార్యకలాపాలను అరికట్టడం లక్ష్యంగా సిద్దిపేట జిల్లాలో ఇసుకను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం మన ఇసుక వాహనం పథకాన్ని ప్రవేశపెట్టింది. మధ్యవర్తులపై ఆధారపడకుండా పౌరులు నేరుగా అధికారిక పోర్టల్ ద్వారా ఇసుకను బుక్ చేసుకోవచ్చని సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్ తెలిపారు. దరఖాస్తుదారులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుని, తమ అభ్యర్థనను సమర్పించి, నిర్దేశించిన రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత దరఖాస్తును ఆమోదించే ముందు గ్రామ పంచాయతీ కార్యదర్శి, తహసీల్దార్ దానిని పరిశీలిస్తారు.

రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించిన ధరలకే ఇసుక సరఫరా అవుతుంది. బ్రోకర్లను ఆశ్రయించకుండా అధికారిక వ్యవస్థను ఉపయోగించుకోవాలని అధికారులు ప్రజలకు సూచించారు. ఇసుక అక్రమ రవాణాలో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.
ఈ విధానంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించిన ధరలకే ఇసుక సరఫరా అవుతుంది. బ్రోకర్లను ఆశ్రయించకుండా అధికారిక వ్యవస్థను ఉపయోగించుకోవాలని అధికారులు ప్రజలకు సూచించారు. ఇసుక అక్రమ రవాణాలో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.
తెలంగాణ ప్రభుత్వ ఇసుక విక్రయాల్లో పారదర్శకతను పెంచడానికి, అక్రమ రవాణాను అరికట్టడానికి మన ఇసుక వాహనం తీసుకొచ్చింది. ఈ విధానంతో జనాలే నేరుగా ఇసుకను బుక్ చేసుకోవచ్చు. 'మధ్యవర్తులు లేదా బ్రోకర్ల ప్రమేయం లేకుండా పౌరులు అధికారిక పోర్టల్ ద్వారా నేరుగా ఇసుకను బుక్ చేయవచ్చు. దీనికోసం దరఖాస్తుదారులు ముందుగా ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. దరఖాస్తు సమర్పించి, నిర్ణీత రుసుము చెల్లించిన తర్వాత, సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శి మరియు తహసీల్దార్ ఆ దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. అనంతరం ఆమోదం చెబుతారు. ప్రజలు అస్సలు దళారులను ఆశ్రయించవద్దు.' అని సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ అన్నారు.
ఈ స్కీమ్ మెుదటగా కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసిన విషయం తెలిసిందే. ఈ జిల్లాల్లో ఫలితాల ఆధారంగా రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో దశలవారీగా అమలుచేస్తున్నారు. ఒకవేళ స్మార్ట్ఫోన్లేనివారు స్థానిక గ్రామ పంచాయతీ కార్యదర్శనిని సంప్రదించి.. కూడా ఇసుకను బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించారు.
{{/usCountry}}ఈ స్కీమ్ మెుదటగా కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసిన విషయం తెలిసిందే. ఈ జిల్లాల్లో ఫలితాల ఆధారంగా రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో దశలవారీగా అమలుచేస్తున్నారు. ఒకవేళ స్మార్ట్ఫోన్లేనివారు స్థానిక గ్రామ పంచాయతీ కార్యదర్శనిని సంప్రదించి.. కూడా ఇసుకను బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించారు.
{{/usCountry}}ప్రభుత్వ పోర్టల్ ద్వారా బుకింగ్ చేసుకుంటే.. మధ్యవర్తుల ప్రమేయం ఉండదు. దూరాన్ని బట్టి ధరలను నిర్ణయించడం కారణంగా వినియోగదారుల మీద అదనపు ఆర్థిక భారం పడదు. ఈ ప్రాజెక్ట్ విజయవంతం కావడానికి అధికారులు సమన్వయం చేసుకుంటున్నారు.