ఏపీ ఏజెన్సీ ఎన్ కౌంటర్ : టెక్నికల్ ఆపరేషన్లలో దిట్ట.... టాప్ మావోయిస్ట్ లీడర్ టెక్ శంకర్ హతం..!
ఆంధ్రా - ఒడిశా ఏజెన్సీలో ఇవాళ(బుధవారం) మరోసారి ఎన్ కౌంటర్ జరిగింది. మొత్తం ఏడు మంది మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టు పార్టీ సాంకేతిక కార్యక్రమాల్లో కీలకంగా ఉన్న టెక్ శంకర్ (జోగారావు) ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది.
రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని జీఎం వలస అటవీ ప్రాంతంలో బుధవారం మరోసారి ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఉదయం 7 గంటలకు భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయని ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేశ్ చంద్ర లడ్డా తెలిపారు.

మంగళవారం ఎన్ కౌంటర్ జరగగా ఆరుగురు మృతి చెందగా వీరిలో టాప్ లీడర్ హిడ్మా కూడా ఉన్నాడు. అయితే ఇవాళ కూడా కూంబింగ్ కొనసాగుతుడంగా… ఉదయం కాల్పులు జరిగాయని ఏపీ పోలీసులు తెలిపారు. మొత్తం ఏడుగురు ప్రాణాలు కోల్పోగా… కీలక నేతగా పేరొందిన మేటూరి జోగారావు అలియాస్ టెక్ శంకర్ ఉన్నాడు. చనిపోయిన వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారు.
జోగారావు అలియాస్ టెక్ శంకర్…!
ఇవాళ జరిగిన ఎన్ కౌంటర్ మేటూరి జోగారావు అలియాస్ టెక్ శంకర్ ప్రాణాలు కోల్పోయాడు. మావోయిస్టు పార్టీలో కీలక నేతగా పేరొందాడు. శ్రీకాకుళానికి చెందిన శంకర్…. ఆంధ్రా - ఒడిశా బోర్డర్ (ఏఓబీ) సీసీఎం ఇంఛార్జిగా ఉన్నాడు. ఆయుధాల తయారీ, కమ్యూనికేషన్ వంటి సాంకేతిక కార్యకలాపాలలో అత్యంత నైపుణ్యం కలిగి ఉన్న వ్యక్తిగా పేరుంది.శంకర్ సుమారు 20 సంవత్సరాలుగా మావోయిస్టు ఉద్యమంలో ఉన్నారు. పోలీసుల రికార్డుల ప్రకారం… అతనికి శంకర్, బాబు, శివగా పేర్లున్నాయి.
శ్రీకాకుళానికి చెందిన శంకర్.. మావోయిస్టు ఉద్యమాన్ని పునరుద్ధరించడానికి బహుశా దక్షిణాది రాష్ట్రాలకు వచ్చి ఉంటాడని ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డా చెప్పారు. ఎన్‌కౌంటర్‌లో మరణించిన మిగిలిన సభ్యుల గుర్తింపులను ధృవీకరిస్తున్నామని చెప్పారు. చుట్టుపక్కల భూభాగంలో భద్రతా దళాలు కూంబింగ్ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి.
మంగళవారం జరిగిన ఎన్ కౌంటర్ లో అగ్రనేతగా పేరొందిన హిడ్మా మృతి చెందటంతో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగానే ఇవాళ కూడా మరో ఏడు మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీ వ్యాప్తంగా 50 మంది మావోయిస్టులను కూడా అరెస్ట్ చేశారు. ఇక మరో అగ్రనేత అయిన దేవ్ జీ కూడా పట్టుబడినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఏపీ పోలీసులు క్లారిటీ ఇవ్వలేదు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

