ఏపీ ఏజెన్సీలో మరో ఎన్‌కౌంటర్‌ - ఏడుగురు మావోయిస్టులు మృతి..!

ఆంధ్రా - ఒడిశా అటవీ ప్రాంతంలో ఇవాళ మరో ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఘటనలో ఆరు నుంచి ఏడు మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఎన్‌కౌంటర్‌ను ఏపీ ఇంటిలిజెన్స్‌ చీఫ్‌ ధృవీకరించారు.

Published on: Nov 19, 2025, 09:37:51 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇవాళ మరోసారి ఆంధ్రా - ఒడిశా సరిహద్దుల్లోని రంపచోడవరం అటవీ ప్రాంతంలో కాల్పులు జరిగాయి. తెల్లవారుజామున భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. ఇదే విషయాన్ని ఏపీ ఇంటెలిజెన్స్‌ ఏడీజీ మహేశ్‌చంద్ర లడ్డా ధ్రువీకరించారు.

మరో ఎన్‌కౌంటర్‌ (ఫైల్ ఫొటో)
మరో ఎన్‌కౌంటర్‌ (ఫైల్ ఫొటో)

ఇవాళ విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇంటెలిజెన్స్‌ ఏడీజీ మహేశ్‌చంద్ర లడ్డా మాట్లాడారు. ఇవాళ జరిగిన ఎన్‌కౌంటర్‌లో అగ్రనేతలు మృతి చెందినట్లు సమాచారం ఉందని తెలిపారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.

50 మంది అరెస్ట్ - ఏపీ ఇంటెలిజెన్స్‌ చీఫ్

నవంబరు 17వ తేదీన ఒక ఆపరేషన్‌ లాంచ్‌ చేశామని… నవంబర్ 18వ తేదీన ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎదురుకాల్పులు జరిగాయని తెలిపారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి ఏపీలోకి రావటానికి మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.

మంగళవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జరిగిన మావోయిస్టుల అరెస్టులపై స్పందిస్తూ… మొత్తం 50 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు. వీరిలో ప్లాటూన్‌ మెంబర్లు,డివిజినల్‌ కమిటీ మెంబర్స్‌,ఏరియా కమిటీ మెంబర్స్‌ ఉన్నారని వివరించారు. వీరి నుంచి ఆయుధాలతో పాటు ఇతర పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

“ఏపీలో మావోయిస్టుల కదలికలపై రెండు నెలల నుంచి మానిటరింగ్‌ ఉంది. ఛత్తీస్‌ఘడ్‌, తెలంగాణ నుంచి ఏపీకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.. ఇంటెలిజెన్స్‌కి పూర్తి సమాచారం ఉండటంతో నిన్న ఆపరేషన్‌ చేశాం. నిన్న ఉదయం అల్లూరి జిల్లాలో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా ప్రాణాలు కోల్పోయారు.. మావోయిస్టు షెల్టర్‌ జోన్ల మీద కూడా దాడులు కొనసాగుతున్నాయి. 50 మంది మావోయిస్టులను రాష్ట్రవ్యాప్తంగా అరెస్ట్ చేశాం. కృష్ణా, ఏలూరు, కాకినాడ, కోనసీమ, ఎన్టీఆర్‌ జిల్లాల్లో మావోయిస్టులు పట్టుబడ్డారు” అని ఏపీ ఇంటెలిజన్స్‌ ఏడీజీ మహేష్‌ చంద్ర లడ్డా వివరించారు.

ఏపీలో రిక్రూట్ మెంట్ లేదు..

ఏపీ నుంచి ఎలాంటి మావోయిస్టు రిక్రూట్ మెంట్స్ లేవని ఇంటెలిజెన్స్‌ ఏడీజీ మహేశ్‌చంద్ర లడ్డా ప్రకటించారు. నిన్న జరిగిన ఎన్ కౌంటర్… మావోయిస్టులకు అతిపెద్ద ఎదురుదెబ్బ అని అభిప్రాయపడ్డారు. మిగతా మావోయిస్టులు కూడా లొంగిపోవాలని సూచించారు.

షెల్టర్ కోసమే మావోయిస్టులు ఏపీకి వచ్చినట్లు తెలుస్తోందని మహేశ్‌చంద్ర లడ్డా తెలిపారు. కొంత కోలుకున్న తర్వాత… తిరిగి పోరాటం చేయవచ్చని భావించి ఉండొచ్చని అన్నారు. నల్లమలలో మావోయిస్టులు లేరని తెలిపారు. కేవలం పోలీసుల సమక్షంలోనే కాకుండా… మావోయిస్టులు లొంగిపోవటానికి చాలా వేదికలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు.

"ఏపీలో అరెస్ట్ అయిన వారంతా ఛత్తీస్ ఘడ్ కు చెందినవారే. ఒకేసారి ఇంత మందిని అరెస్ట్ చేయటం ఇదే తొలిసారి. లొంగిపోవటం ఇష్టంలేనివాళ్లు యాక్టివిటిస్ కొనసాగించాలని చూస్తున్నారు. లొంగిపోయిన వారిలో మేం ఒక్కర్నీ కూడా ఎన్ కౌంటర్ చేయలేదు" లడ్డా స్పష్టం చేశారు.

ఇక ఇవాళ జరిగిన ఎన్ కౌంటర్ కు సంబంధించి వివరాలను ఏపీ పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది. అయితే ఇందులో ఆ పార్టీ అగ్రనేత దేవ్ జీ ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More