Lunar Eclipse Today : ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చంద్రగ్రహణం సమయాలు.. ఏ టైమ్‌కి చూడవచ్చు?
Lunar Eclipse Today : చంద్రగ్రహణం మార్చి 3. అయితే భారతదేశం అంతటా వేర్వేరు సమయాల్లో ఈ గ్రహణం చూడవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏ సమయంలో చూడవచ్చో తెలుసుకుందాం..
2026లో చంద్రగ్రహణం మార్చి 3న సంభవిస్తుంది. ఇది అద్భుతమైన ఖగోళ దృశ్యాన్ని అందిస్తుంది. మార్చి 3, 2026న చంద్రగ్రహణం మధ్యాహ్నం 3:20 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6:48 గంటలకు ముగుస్తుంది. అయితే భారతదేశంలో గ్రహణం చివరి దశ మాత్రమే కనిపిస్తుంది. చంద్రోదయం తర్వాత కొద్దిసేపటికే వీక్షకులు దాదాపు 15 నిమిషాలకుపైగా - సాయంత్రం 6:30 నుండి 6:48 వరకు దీనిని గమనించగలరు.

చంద్రగ్రహణం మార్చి హోలీతో సమానంగా వచ్చింది. చంద్రగ్రహణం అరుదైన ఖగోళ సంఘటన భారతదేశం అంతటా కనిపిస్తుంది. సాయంత్రం వేళల్లో చూడవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రజలు చంద్రగ్రహణం చూడవచ్చు. భారతదేశం అంతటా గ్రహణం మధ్యాహ్నం 3:20 గంటలకు ప్రారంభమైనప్పటికీ.. తెలుగు రాష్ట్రాల్లో దాని కనిపించే ప్రభావం సాయంత్రం చంద్రోదయం తర్వాత మాత్రమే కనిపిస్తుంది. అధికారుల ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు సాయంత్రం 6 గంటల తర్వాత గ్రహణం ముగింపు దశను గమనించగలరు.
- విజయవాడలో చంద్రుడు సాయంత్రం 6:14 గంటలకు ఉదయిస్తాడు. గ్రహణం సాయంత్రం 6:48 గంటలకు ముగుస్తుంది. ఇక్కడి ప్రజలు దాదాపు 34 నిమిషాల పాటు గ్రహణాన్ని వీక్షించవచ్చు.
- రాజమహేంద్రవరంలో చంద్రోదయం సాయంత్రం 6:07 గంటలకు ప్రారంభమై.. గ్రహణం సాయంత్రం 6:48 గంటలకు ముగుస్తుంది. వీక్షకులు దాదాపు 41 నిమిషాల పాటు ఈ విషయాన్ని గమనించవచ్చు.
- నెల్లూరులో చంద్రుడు సాయంత్రం 6:18 గంటలకు ఉదయిస్తాడు. గ్రహణం సాయంత్రం 6:48 గంటలకు ముగుస్తుంది. నెల్లూరు ప్రజలు దాదాపు 30 నిమిషాల పాటు గ్రహణాన్ని వీక్షించవచ్చు.
- ఇక రాష్ట్రమైన తెలంగాణలోని హైదరాబాద్‌లో సాయంత్రం 6:26 ప్రారంభమై.. 6:47 గంటలకు ముగుస్తుంది. ఢిల్లిలో సాయంత్రం 6:22 గంటలకు మెుదలై 6:47 గంటలకు ముగుస్తుంది. చెన్నైలో 6:18కి ప్రారంభమై 6:47 గ్రహణం ముగుస్తుంది.
భారతదేశంలో చంద్రగ్రహణం ప్రారంభం మధ్యాహ్నం 3.20 గంటలకు, సంపూర్ణ దశ ప్రారంభం సాయంత్రం 4 గంటల 34 నిముషాలకు ఉంటుంది. గ్రహణం సంపూర్ణ దశ ముగింపు సాయంత్రం 5 గంటల 33 నిమిషాలకు ఉంటుంది. గ్రహణం పూర్తి ముగింపు సాయంత్రం 6 గంటల 48 నిమిషాల వరకు ఉండనుంది.
- ఇక తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చంద్రుడు సాయంత్రం 6 గంటల తర్వాతే ఉదయిస్తాడు. అందుకే ఇక్కడ మనం గ్రహణం చివరి భాగం చూడవచ్చు. సాయంత్రం 6.20 నుంచి 6.48 వరకు ఈ అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలి.
చంద్రగ్రహణం సూతకాలం గ్రహణ సమయానికి 9 గంటల ముందు నుంచి మెుదలైంది. చంద్రగ్రహణం రోజు పట్టుస్నానం 3 గంటల 20 నిమిషాలకు చేయాలి. గ్రహణం విడుపు స్నానం సాయంత్రం 6 గంటల 48 నిమిషాల తర్వాత చేయాలి. ఇంటిని కూడా శుభ్రం చేసుకోవాలని శాస్త్రాలు చేయాలి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


