March Long Weekends : మార్చి నెలలో లాంగ్ వీకెండ్స్.. ఇలా ఏపీ, తెలంగాణలో ప్లాన్ చేసుకోండి

March Long Weekends : మార్చి నెలలో లాంగ్ వీకెండ్స్ చాలా కలిసి వస్తున్నాయి. ఈ నెలలో టూర్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే చాలా సెలవులు కలిసి వస్తాయి. ఎంచక్కా ఎంజాయ్ చేయవచ్చు.

Published on: Mar 4, 2026, 15:36:11 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మార్చి 2026 భారతదేశంలో అత్యంత సెలవులు ఎక్కువగా ఉండే నెలల్లో ఒకటిగా ఉంది. మతపరమైన, ప్రాంతీయ పండుగలతో పాఠశాలలు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలకు చాలా రోజులు సెలవులు వస్తు్న్నాయ్. ఒకటి, రెండు సెలవులు తీసుకుంటే.. లాంగ్ వీకెండ్ ప్లాన్ చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లోనే అనేక ప్రదేశాలు చుట్టిరావొచ్చు.

మార్చి లాంగ్ వీకెండ్స్ 2026
మార్చి లాంగ్ వీకెండ్స్ 2026
  • మార్చి 19 ఉగాది-గురువారం
  • మార్చి 20 రంజాన్-శుక్రవారం
  • మార్చి 21 శనివారం
  • మార్చి 22 ఆదివారం

మార్చి 19న ఉగాది సందర్భంగా మీరు అనేక ఆలయాలను దర్శించుకోవచ్చు. కొత్త సంవత్సరం వేడుకలను చాలా ఆలయాలు అంగరంగ వైభవంగా జరుపుతాయి. పండుగ మార్చి 19 గురువారం జరుపుకొంటారు. తర్వాత శుక్రవారం రంజాన్ వస్తుంది. సుదీర్ఘ వారాంతాన్ని ప్లాన్ చేసుకోవచ్చు.

ఉగాది నాడు తెలుగు నూతన సంవత్సర దినోత్సవం సందర్భంగా తిరుమల పుణ్యక్షేత్రంలో ఆలయ ఆస్థాన ఉత్సవం నిర్వహిస్తారు. శుభ సందర్భంగా భాగంగా, సుప్రభాత సేవ తర్వాత, ఆలయ శుద్ధి, తోమల సేవ (ఏకాంతంలో) నిర్వహిస్తారు. తరువాత ఊరేగింపు దేవతలకు విశేష సమర్పణను అందిస్తారు. దేవతలను ఆస్థానం నిర్వహించే బంగారు వాకిలిలోకి తీసుకువెళతారు. దీనికి ముందు వెంకటేశ్వర స్వామి, ఉత్సవ మూర్తులు, శ్రీ విశ్వక్సేన సైన్యాధిపతి కొత్త వస్త్రాలు ధరిస్తారు. ఉగాది సందర్భంగా ఆలయంలో విశేష పూజ, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవాలను టీటీడీ రద్దు చేస్తుంది. ఉగాదిని తిరుమలలో చాలా వైభవంగా నిర్వహిస్తారు.

మరో లాంగ్ వీకెండ్

  • మార్చి 26- రామనవమి-గురువారం
  • మార్చి 27-శుక్రవారం(సెలవు తీసుకోండి)
  • మార్చి 28-శనివారం
  • మార్చి 29-ఆదివారం
  • మార్చి 30-సోమవారం(లీవ్ తీసుకోండి)
  • మార్చి 31-మంగళవారం-మహావీర్ జయంతి

ఈ నెల చివరిలో రామ నవమి వస్తుంది. అంతేకాదు మీకు లాంగ్ వీకెండ్ కలిసి వస్తుంది. రెండు రోజులు సెలవు తీసుకోవడం ఆరు రోజులు ఎంజాయ్ చేసి రావొచ్చు. చాలా మంది భక్తులు అయోధ్య, వారణాసి లేదా స్థానిక పుణ్యక్షేత్రాలలోని దేవాలయాలను సందర్శిస్తారు. మరికొందరు విశ్రాంతి లేదా టూరిస్టు ప్రదేశాలకు వెళ్తారు.

అయితే శ్రీరామనవమి సందర్భంగా మీరు తెలంగాణలోని భద్రాచలం వెళ్తే మంచి పాజిటివ్ వైబ్ ఉంటుంది. భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయంలో శ్రీరామనవమి అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ వేడుకలో లక్షలాది భక్తుల సమక్షంలో సీతా రాముల వివాహం మధ్యాహ్నం కన్నుల విందుగా జరుగుతుంది. ఈ వేడుకలో తలంబ్రాల కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణ.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More