Wonderla : వండర్లా హైదరాబాద్​లో లాంగ్ వీకెండ్ ఆఫర్లు- టికెట్లపై భారీ తగ్గింపు..

భారత 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వండర్లా హైదరాబాద్ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. జనవరి 24 నుంచి 26 వరకు అందుబాటులో ఉండే ఈ లాంగ్ వీకెండ్ డీల్స్ ద్వారా టికెట్లు, బఫే కాంబోలపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు పొందవచ్చు. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jan 24, 2026 7:30 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జనవరి 24 నుంచి లాంగ్​ వీకెండ్​ ప్రారంభమైంది. శని, ఆదివారాలు సెలవులు ఉండగా, గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో జనవరి 26, సోమవారం కూడా హాలీడేనే. అంటే వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రజలు ట్రిప్స్​కి ప్లాన్​ చేస్తుంటారు. అయితే, స్నేహితులు, కుటుంబసభ్యులతో సరదాగా గడపాలనుకునే వారికి వండర్లా హైదరాబాద్ అద్భుతమైన ఆఫర్​ని అందిస్తోంది. భారత 77వ రిపబ్లిక్ డేను పురస్కరించుకుని ప్రత్యేక 'లాంగ్ వీకెండ్' ఆఫర్లను ప్రకటించింది. జనవరి 24 నుంచి 26 వరకు ఈ ఈ ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయి. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

వండర్లా టికెట్లపై ఆఫర్లు..
వండర్లా టికెట్లపై ఆఫర్లు..

వండర్లా రిపబ్లిక్​ డే లాంగ్​ వీకెండ్​ ఆఫర్​లో భాగంగా ఆన్‌లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునే వారికి ఎక్స్‌క్లూజివ్ డిస్కౌంట్లు లభిస్తాయి. ముఖ్యంగా 8 గంటలు లేదా 11 గంటల రిపబ్లిక్ డే పాస్‌లపై ఈ ఆఫర్లు వర్తిస్తాయి. కేవలం టికెట్లపైనే కాకుండా, అన్‌లిమిటెడ్ బఫే కాంబోలపై కూడా తగ్గింపు ఉండటం విశేషం.

వండర్లా హైదరాబాద్​- ఆఫర్ల విశేషాలు:

ఈ స్పెషల్ పాస్ తీసుకున్న వారికి ఉదయం 11 గంటల నుంచి అన్ని ల్యాండ్ రైడ్స్ అందుబాటులో ఉంటాయి. అలాగే సాయంత్రం 6 గంటల వరకు వాటర్ రైడ్స్‌లో ఎంజాయ్ చేయవచ్చు.

  • టికెట్ ధరలపై ఏకంగా 25 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది.
  • ఇక టికెట్ ప్లస్ బఫే కాంబోలపై 30 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు.

అంటే 11 గంటల రిపబ్లిక్​ డే పాస్​ రూ. 1733.33 కి బదులు ఇప్పుడు రూ. 1300కే లభిస్తోంది (25శాతం తగ్గింపు).

అదే సమయంలో 11 గంటల రిపబ్లిక్​ డే పాస్​+ బఫే రూ. 2495.25 కి బదులు ఇప్పుడు రూ. 1757.02 కే లభిస్తోంది (30శాతం తగ్గింపు).

ఇక 8 గంటల రిపబ్లిక్​ డే పాస్​ రూ. 1507.63 కి బదులు ఇప్పుడు రూ. 1130.72 కే లభిస్తోంది (25శాతం తగ్గింపు).

8 గంటల రిపబ్లిక్​ డే పాస్​+ బఫే రూ. 2269.25 కి బదులు ఇప్పుడు రూ. 1595.90 కే లభిస్తోంది (30శాతం తగ్గింపు).

కేవలం రైడ్స్ మాత్రమే కాకుండా, పార్క్ అంతటా దేశభక్తి ఉట్టిపడేలా రిపబ్లిక్ డే థీమ్ డెకరేషన్ ఉంటుంది. జెండా ఆవిష్కరణ, గ్రాండ్ పరేడ్, వేవ్ పూల్ దగ్గర సరదా ఆటలు, సందడి చేసేందుకు డీజే పార్టీని కూడా ఏర్పాటు చేశారు.

"రిపబ్లిక్ డే అంటేనే కుటుంబ సభ్యులంతా కలిసి జరుపుకునే వేడుక. అందుకే వండర్లాలో ఈ లాంగ్ వీకెండ్‌ను చిరస్మరణీయంగా మార్చేందుకు మేము ప్లాన్ చేశాము. మెరుగైన ఆఫర్లు, పండుగ వాతావరణం మధ్య అతిథులకు గొప్ప అనుభూతిని ఇస్తామని ఆశిస్తున్నాము," అని వండర్లా హాలిడేస్ లిమిటెడ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ధీరన్ చౌదరి తెలిపారు.

ఈ ఆఫర్లు కేవలం వండర్లా అధికారిక వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకుంటేనే లభిస్తాయి. హైదరాబాద్ పార్క్ టికెట్ల కోసం https://www.wonderla.com/offer/republic-day లింక్‌ను సందర్శించవచ్చు లేదా 084 146 76333, +91 91000 63636 నంబర్లను సంప్రదించవచ్చు.

చెన్నైలోని వండర్లాలో కూడా ఈ ఆఫర్లు ఉన్నట్టు తెలుస్తోంది.

వండర్లా గురించి..

భారతదేశంలోనే అతిపెద్ద అమ్యూజ్‌మెంట్ పార్క్ ఆపరేటర్ అయిన వండర్లాకు కొచ్చి, బెంగళూరు, హైదరాబాద్, భువనేశ్వర్, చెన్నైలో బ్రాంచ్‌లు ఉన్నాయి. 2000వ సంవత్సరంలో ప్రారంభమైన ఈ సంస్థ, ఇప్పటివరకు సుమారు 4.6 కోట్ల మంది పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచింది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన రైడ్స్ అందించింది.