...
...
Next Story

మార్కాపురం బస్సు దుర్ఘటన.. పదేపదే బ్రేక్‌డౌన్‌లు.. డ్రైవర్, యజమాని అరెస్ట్!

ఇటీవల మార్కాపురం బస్సు ప్రమాదంలో 14 మంది సజీవదహనమయ్యారు. ఈ బస్సు కండీషన్ సరిగా లేదని గుర్తించారు. డ్రైవర్, యజమానిని అరెస్ చేశారు.

Published on: Apr 1, 2026, 20:40:22 IST
Advertisement

నిర్లక్ష్యం కారణంగా బస్సు ప్రమాదంలో ఇటీవల 14 మంది ప్రాణాలు కోల్పోగా 29 మంది గాయపడ్డారు. ఘోర ప్రమాదానికి సంబంధించి మార్కాపురం జిల్లా పోలీసులు ఆ ప్రైవేట్ ట్రావెల్ బస్సు డ్రైవర్, యజమానిని అరెస్టు చేశారు. ప్రయాణ సమయంలో బస్సు పలుమార్లు ఆగిపోయినప్పటికీ, ప్రయాణాన్ని కొనసాగించారు.

మార్కాపురం బస్సు ప్రమాదం
మార్కాపురం బస్సు ప్రమాదం

మార్చి 26వ తేదీన ఉదయం సుమారు 5.40 గంటలకు ఎన్‌హెచ్-565పై రాయవరం గ్రామం సమీపంలో ఘటన జరిగింది. హరి కృష్ణ ట్రావెల్స్ బస్సు తెలంగాణలోని జగిత్యాల నుంచి నెల్లూరు జిల్లా కలిగిరి వెళ్తున్న సమయంలో ప్రమాదం అయింది.

21 ఏళ్ల పాండెం యువరాజు అనే డ్రైవర్‌కు డ్రైవింగ్ లైసెన్స్ లేదని, అతను గతంలో క్లీనర్‌గా పనిచేసేవాడని పోలీసులు తెలిపారు. అధిక జీతాలు ఇవ్వడం ఎందుకనే ఉద్దేశంతో బస్సు యజమానికి హరికృష్ణ.. యువరాజను డ్రైవర్‌గా పెట్టుకున్నాడు.

ప్రయాణ సమయంలో సెన్సార్, ఇంజన్ సమస్యల కారణంగా బస్సు కనీసం మూడుసార్లు ఆగిపోయింది. ప్రతిసారీ, డ్రైవర్ యజమానికి తెలియజేయగా.. రాత్రిపూట మెకానిక్‌లు లేదా ప్రత్యామ్నాయ బస్సులు లేవని పేర్కొంటూ, తాత్కాలిక మరమ్మతులు చేసి ప్రయాణం కొనసాగించమని యజమాని యువరాజుకు సూచించాడు. యజమాని సలహా మేరకు యువరాజు బస్సు నడుపుతూ వచ్చాడు.

ఎర్రగొండపాలెం టోల్ ప్లాజా వద్ద బస్సు మరోసారి పాడైపోవడంతో దాన్ని తిరిగి మరమ్మత్తు చేశారు. ప్రయాణికులు డ్రైవర్‌ను ప్రశ్నించగా.. యజమాని వస్తున్నారని హామీ ఇచ్చాడు. అయినప్పటికీ ప్రయాణం కొనసాగించారు.

క్షణాల్లోనే బస్సు మంటల్లో చిక్కుకుంది. కొంతమంది ప్రయాణికులు కిటికీలు పగలగొట్టి బయటకు దూకి తప్పించుకోగా, 14 మంది బస్సులోనే సజీవ దహనం అయ్యారు. బస్సు పరిస్థితి అధ్వాన్నంగా ఉందని డ్రైవర్, యజమాని ఇద్దరికీ పూర్తిగా తెలుసని, అయినప్పటికీ ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెట్టారని విచారణలో తేలింది. రాయవరం రైల్వే వంతెన సమీపంలో పోలీసులు ఇద్దరు నిందితులను బీఎన్ఎస్ సెక్షన్ 105, 125(ఎ), 125(బి) కింద అరెస్టు చేశారు.

ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, హైవే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పలువురు ప్రయాణికులను రక్షించారు. సహాయక బృందాల వేగవంతమైన స్పందనను జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు ప్రశంసించారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe