...
...
Next Story

అమరావతి, తిరుపతి ఎకనామిక్ రీజయన్స్‌కు మాస్టర్ ప్లాన్.. స్పోర్ట్స్ సిటీ

అమరావతి, తిరుపతి ఎకనామిక్ రీజయన్స్‌ కోసం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు అన్నారు. మరోవైపు వైజాగ్ బే సిటీ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు.

Published on: Jul 7, 2026, 09:23:42 IST
Advertisement

అమరావతి, తిరుపతి ఆర్థిక ప్రాంతాలకు (Economic Regions) ఆరు నెలల్లోగా మాస్టర్ ప్లాన్‌లను సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు అన్నారు. అంతేకాదు ఇప్పటికే మాస్టర్ ప్లాన్ ఆవిష్కరించిన విశాఖపట్నం ఆర్థిక ప్రాంతం (VER) పరిధిలోని 'వైజాగ్ బే సిటీ' అభివృద్ధికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అమరావతిలోని సచివాలయంలో జరిగిన సిటీ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధి సమీక్షా సమావేశంలో సీఎం మాట్లాడారు. ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి అభిప్రాయాలను సేకరించేందుకు ముసాయిదా ప్రణాళికలను వారికి అందుబాటులో ఉంచాలని సూచించారు.

అమరావతి
అమరావతి

ఆయా ప్రాంతాల అభివృద్ధి సామర్థ్యానికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించేలా కలెక్టర్లకు వీలుగా, రెండు నెలల్లోగా జిల్లా ఆర్థిక ప్రొఫైల్స్ పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించారు. తిరుపతి ఎకనామిక్ రీజియన్(TER) అభివృద్ధికి ఉద్యానవన రంగం కీలక చోదక శక్తిగా ఉంటుందన్నారు. ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటు రాయలసీమ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలను మారుస్తుందని పేర్కొన్నారు.

అమరావతి, తిరుపతి, విశాఖపట్నంలో అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాలను నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించాలని, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ మూడు ప్రాంతాల్లో స్పోర్ట్స్ సిటీలను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. అలాగే రాష్ట్రంలోని సుదీర్ఘ తీరప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఒక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని తెలిపారు.

ప్రతిపాదిత వైజాగ్ బే సిటీ అభివృద్ధి గురించి ప్రస్తావిస్తూ, 3,291 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందని పేర్కొన్న చంద్రబాబు, 51.88 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో చేపట్టే ఈ ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ సంస్థలను ఆహ్వానించాలని అధికారులకు సూచించారు.

విశాఖపట్నం ఆర్థిక ప్రాంతం పరిధిలోని 49 ప్రాజెక్టులలో 18 ఇప్పటికే ప్రారంభమయ్యాయని, 12 ప్రారంభ దశలో ఉన్నాయని, 19 ప్రణాళికా దశలో ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అమరావతి ఎకనామిక్ రీజియన్‌కు నైపుణ్యం కలిగిన మానవ వనరుల లభ్యత కీలక ప్రయోజనాలుగా ఉన్నాయని, ఆ సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకునేందుకు ఎటువంటి ప్రయత్నాన్నీ వదలకూడదని చంద్రబాబు అన్నారు. పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం అనే తొమ్మిది జిల్లాలతో ఏఈఆర్ కూడుకుని ఉందని పేర్కొన్నారు. ఆక్వాకల్చర్, కోకో, పామ్ సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe