కూటమి ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను ప్రథమ ప్రాధాన్యతతో పరిష్కరిస్తుందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం డైరీ, క్యాలెండర్‌ను ఎమ్మెల్యే, పీయుసీ ఛైర్మన్ కూన రవికుమార్‌తో కలిపి మంత్రి గొట్టిపాటి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడారు.

'ప్రజల్లో సంతృప్త స్థాయిలు పెరిగేలా విద్యుత్ ఉద్యోగులు విధులు నిర్వహించాలి. అదే విధంగా విద్యుత్ ఉద్యోగులపై ఉన్న పని ఒత్తిడిని తగ్గించేందుకు సీఎం చంద్రబాబు అనుమతితో త్వరలోనే నూతన నియామకాలు చేపడుతున్నాం. మెడికల్ ఇన్సూరెన్స్ లిమిట్‌కు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కారం దిశగా చర్యలు చేపడతాం.'అని మంత్రి మంత్రి హామీ ఇచ్చారు.
విద్యుత్ ఉద్యోగులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన డిమాండ్లలో 90 శాతంపైగా పరిష్కరించామని గొట్టిపాటి రవికుమార్ గుర్తు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం ధ్వంసం చేసిన విద్యుత్ వ్యవస్థను గాడిలో పెడుతున్నామని పేర్కొన్నారు. ట్రూ అప్ ఛార్జీలను ట్రూ డౌన్ చేసిన రాష్ట్రం కూడా దేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక్కటే అన్నారు. ప్రైవేటు సంస్థల నుంచి అధిక ధరలకు విద్యుత్ కొనుగోళ్లను తగ్గించడమే కాకుండా రాష్ట్రంలో ఉన్న వనరులను వినియోగించుకుని రికార్డు స్థాయి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామన్నారు. ఏదేమైనా విద్యుత్ ఉద్యోగులకు అన్ని విషయాల్లోనూ సహాయ, సహకారాలు అందిస్తామని మంత్రి గొట్టిపాటి భరోసా ఇచ్చారు.
పీయూసీ ఛైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన విద్యుత్ సంస్కరణలను నేడు దేశంలో అనేక రాష్ట్రాలు అమలు చేస్తున్నాయన్నారు. టీడీపీ అంటేనే బీసీలు అని.., బీసీలు అంటేనే టీడీపీ అని వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు పోలాకీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అనేక సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. పీఆర్సీ, డీఏ, ఇంక్రిమెంట్లతో పాటు విద్యుత్ శాఖలో కారుణ్య నియామకాల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు కృతజ్ఞతలు తెలిపారు.
{{/usCountry}}ఆంధ్రప్రదేశ్ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు పోలాకీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అనేక సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. పీఆర్సీ, డీఏ, ఇంక్రిమెంట్లతో పాటు విద్యుత్ శాఖలో కారుణ్య నియామకాల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు కృతజ్ఞతలు తెలిపారు.
{{/usCountry}}అంతకుముందు మంత్రి గొట్టిపాటి రవికుమార్ డిస్కమ్‌ల సీఎండీలు ఎల్.శివశంకర్, ఐ.పృధ్వీ తేజ్, పి.పుల్లారెడ్డిలతో పాటు విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాబోయే మహా శివరాత్రి పండుగ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని దేవాలయాలు, పరిసర ప్రాంతాలకు విద్యుత్ సరఫరాలో ఏ విధమైన అంతరాయం లేకుండా నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పెద్ద సంఖ్యలో భక్తులు ప్రధాన శివాలయాలు, ఇతర దేవాలయాలకు వెళ్లే అవకాశం ఉందన్నారు మంత్రి గొట్టిపాటి. నిరంతర విద్యుత్ సరఫరా అత్యంత అవసరం అని మంత్రి పేర్కొన్నారు. భక్తుల సౌకర్యం కోసం, ధార్మిక కార్యక్రమాలు అంతరాయం లేకుండా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. పండుగ కాలంలో విద్యుత్ అంతరాయాలు లేకుండా ఉండేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. అవసరమైతే ప్రత్యామ్న్యాయ విద్యుత్ అందించేలా ఏర్పాట్లు చేయాలని, ఎలాంటి సమస్యలు తలెత్తిన వెంటనే పరిష్కరించేందుకు 24x7 మెయింటెనెన్స్ బృందాలు సిద్ధంగా ఉండాలని చెప్పారు.