విద్యుత్ ఉద్యోగుల‌కు మంత్రి గొట్టిపాటి కీలక హామీ.. త్వర‌లోనే నూత‌న నియామ‌కాలు

విద్యుత్ ఉద్యోగుల ప‌ని ఒత్తిడి త‌గ్గించేందుకు నూత‌న నియామ‌కాలు చేపట్టనున్నట్టుగా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ చెప్పారు. గ‌త ప్రభుత్వం విధ్వంసం చేసిన వ్యవ‌స్థని గాడిలో పెడుతున్నామని పేర్కొన్నారు.

Published on: Feb 11, 2026, 21:03:42 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కూట‌మి ప్రభుత్వం ఉద్యోగుల స‌మ‌స్యల‌ను ప్రథ‌మ ప్రాధాన్యత‌తో ప‌రిష్కరిస్తుంద‌ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం డైరీ, క్యాలెండ‌ర్‌ను ఎమ్మెల్యే, పీయుసీ ఛైర్మన్ కూన ర‌వికుమార్‌తో క‌లిపి మంత్రి గొట్టిపాటి ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడారు.

విద్యుత్ శాఖ ఉద్యోగులతో మంత్రి గొట్టిపాటి
విద్యుత్ శాఖ ఉద్యోగులతో మంత్రి గొట్టిపాటి

'ప్రజ‌ల్లో సంతృప్త స్థాయిలు పెరిగేలా విద్యుత్ ఉద్యోగులు విధులు నిర్వహించాలి. అదే విధంగా విద్యుత్ ఉద్యోగుల‌పై ఉన్న ప‌ని ఒత్తిడిని త‌గ్గించేందుకు సీఎం చంద్రబాబు అనుమ‌తితో త్వర‌లోనే నూత‌న నియామ‌కాలు చేప‌డుతున్నాం. మెడిక‌ల్ ఇన్సూరెన్స్ లిమిట్‌కు సంబంధించి ఏవైనా స‌మ‌స్యలు ఉంటే ప‌రిష్కారం దిశ‌గా చ‌ర్యలు చేప‌డ‌తాం.'అని మంత్రి మంత్రి హామీ ఇచ్చారు.

విద్యుత్ ఉద్యోగులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన డిమాండ్లలో 90 శాతంపైగా ప‌రిష్కరించామని గొట్టిపాటి రవికుమార్ గుర్తు చేశారు. గ‌త వైసీపీ ప్రభుత్వం ధ్వంసం చేసిన విద్యుత్ వ్యవ‌స్థను గాడిలో పెడుతున్నామ‌ని పేర్కొన్నారు. ట్రూ అప్ ఛార్జీల‌ను ట్రూ డౌన్ చేసిన రాష్ట్రం కూడా దేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక్కటే అన్నారు. ప్రైవేటు సంస్థల నుంచి అధిక ధ‌ర‌లకు విద్యుత్ కొనుగోళ్లను త‌గ్గించ‌డ‌మే కాకుండా రాష్ట్రంలో ఉన్న వ‌న‌రుల‌ను వినియోగించుకుని రికార్డు స్థాయి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామ‌న్నారు. ఏదేమైనా విద్యుత్ ఉద్యోగుల‌కు అన్ని విష‌యాల్లోనూ స‌హాయ‌, స‌హ‌కారాలు అందిస్తామ‌ని మంత్రి గొట్టిపాటి భ‌రోసా ఇచ్చారు.

పీయూసీ ఛైర్మన్, ఎమ్మెల్యే కూన‌ ర‌వికుమార్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన విద్యుత్ సంస్కర‌ణ‌ల‌ను నేడు దేశంలో అనేక రాష్ట్రాలు అమ‌లు చేస్తున్నాయ‌న్నారు. టీడీపీ అంటేనే బీసీలు అని.., బీసీలు అంటేనే టీడీపీ అని వ్యాఖ్యానించారు.

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ‌ సంఘం అధ్యక్షులు పోలాకీ శ్రీనివాస‌రావు మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అనేక సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్రజ‌ల్లోకి తీసుకెళ్లడంలో ఉద్యోగులు కీల‌క పాత్ర పోషిస్తున్నార‌న్నారు. పీఆర్సీ, డీఏ, ఇంక్రిమెంట్లతో పాటు విద్యుత్ శాఖ‌లో కారుణ్య నియామ‌కాల విష‌యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల‌కు కృత‌జ్ఞత‌లు తెలిపారు.

అంతకుముందు మంత్రి గొట్టిపాటి రవికుమార్ డిస్కమ్‌ల సీఎండీలు ఎల్‌.శివశంకర్‌, ఐ.పృధ్వీ తేజ్‌, పి.పుల్లారెడ్డిలతో పాటు విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాబోయే మహా శివరాత్రి పండుగ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని దేవాలయాలు, పరిసర ప్రాంతాలకు విద్యుత్‌ సరఫరాలో ఏ విధమైన అంతరాయం లేకుండా నాణ్యమైన, నిరంతర విద్యుత్‌ సరఫరా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

పెద్ద సంఖ్యలో భక్తులు ప్రధాన శివాలయాలు, ఇతర దేవాలయాలకు వెళ్లే అవకాశం ఉందన్నారు మంత్రి గొట్టిపాటి. నిరంతర విద్యుత్‌ సరఫరా అత్యంత అవసరం అని మంత్రి పేర్కొన్నారు. భక్తుల సౌకర్యం కోసం, ధార్మిక కార్యక్రమాలు అంతరాయం లేకుండా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. పండుగ కాలంలో విద్యుత్‌ అంతరాయాలు లేకుండా ఉండేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. అవసరమైతే ప్రత్యామ్న్యాయ విద్యుత్‌ అందించేలా ఏర్పాట్లు చేయాలని, ఎలాంటి సమస్యలు తలెత్తిన వెంటనే పరిష్కరించేందుకు 24x7 మెయింటెనెన్స్‌ బృందాలు సిద్ధంగా ఉండాలని చెప్పారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More