రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులు ఆందోళన చెందాల్సిన పరిస్థితులు లేవని, పుకార్లను నమ్మి గ్యాస్ బుకింగ్ ల కోసం ఎజెన్సీల వద్ద క్యూలు కట్టవద్దని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. రోజు వారి సగటు కంటే ఎక్కువ గ్యాస్ సిలిండర్లను గృహ వినియోగదారులకు అందిస్తున్నామని తెలిపారు. క్షేత్ర స్థాయిలో వినియోగదారులకు గ్యాస్ డెలివరీ ఇబ్బందిలేకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. వాస్తవంగా ప్రజలు సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మి ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ల బుకింగ్‌కు ఆతృత పడటంతో సర్వర్లు సైతం మోరాయిస్తున్నాయని వివరించారు.

కేంద్రం నిబంధల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులు, పట్టణ ప్రాంతాల్లో 25 రోజుల తర్వాత మరో గ్యాస్ సిలిండర్ బుకింగ్‌కు అనుమతి ఉంటుందని ఈ విషయం ప్రతి ఒక్కరూ గమనించాలని మంత్రి మనోహర్ సూచించారు.
సాధారణ రోజుల్లో రోజుకు మన రాష్ట్రంలో 2.81 లక్షల గ్యాస్ సిలిండర్ల బుకింగ్ లు జరుగుతాయని, ఈ ఐదు రోజుల్లో గ్యాస్ కంపెనీలు యావరేజ్‌గా 2.92 లక్షల గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేస్తున్నామన్నారు మంత్రి నాదెండ్ల. ఒక్కో రోజు మూడు లక్షల సిలిండర్ల డెలివరీ కూడా చేశామని మంత్రి మనోహర్ వివరించారు.
గ్యాస్ దొరకదన్న పుకార్లను నమ్మి ఎక్కువ మంది గ్యాస్ ఎజెన్సీల వద్ద క్యూలు కడుతున్నారని దీంతో సమస్య తీవ్రంగా ఉందన్న అపోహ ప్రజల్లో పెరుగుతుందన్నారు మంత్రి నాదెండ్ల. వాస్తవంగా యాప్, ఫోన్ కాల్, వాట్సప్, మిస్డ్ కాల్ లతో పాటు ఫోన్ ఫే తదితర యాప్ ల ద్వారా కూడా గ్యాస్ బుకింగ్ చేసుకోవచ్చన్నారు. అందుకనే సమాచార లోపం లేకుండా టెంప్లెట్స్ ద్వారా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు. కేంద్రం నిబంధనల ప్రకారం గ్యాస్ బుకింగ్ చేయగానే ఓటీపీ వస్తుందని, నూటికి నూరు శాతం ఓటిపీ ఉంటేనే గ్యాస్ సిలిండర్ డెలివరీ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారన్నారు. దీంతో బ్లాక్ మార్కెట్ ను, అధిక ధరలు వసూళ్లు కు పాల్పడకుండ అరికట్టవచ్చన్నారు. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను కమర్షియల్‌గా ఉపయోగించకుండ సమర్థవంతంగా అడ్డుకోవచ్చన్నారు.
'రాష్ట్రంలో ఈ కేవైసీని వినియోగదారులు 95శాతం వరకు చేసుకున్నారు. కొంత మంది ఫోన్ నెంబర్లు మారిపోవడం తదితర కారణాలతో చేయలేకపోయారని దీంతో వారికి గ్యాస్ బుకింగ్‌లు అవ్వడం లేదు. యుద్ధం కారణంగా షిఫ్ మెంట్ లు ఆలస్యం అవుతున్న తరుణంలో కేంద్ర నిబంధనలు అందరూ అవగాహన చేసుకుని సంయమనం పాటించాలి. రాష్ట్రవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ల సరఫరాపై కమిషనర్, జేసీలతో టెలీకాన్ఫరెన్స్ ఏర్పాటు చేశాం. పాఠశాలలు, హస్పటల్స్, దేవాలయాలు, సంక్షేమ వసతి గృహాలకు ఎక్కడా కూడా గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి.' అని మంత్రి మనోహర్ అన్నారు.
{{/usCountry}}'రాష్ట్రంలో ఈ కేవైసీని వినియోగదారులు 95శాతం వరకు చేసుకున్నారు. కొంత మంది ఫోన్ నెంబర్లు మారిపోవడం తదితర కారణాలతో చేయలేకపోయారని దీంతో వారికి గ్యాస్ బుకింగ్‌లు అవ్వడం లేదు. యుద్ధం కారణంగా షిఫ్ మెంట్ లు ఆలస్యం అవుతున్న తరుణంలో కేంద్ర నిబంధనలు అందరూ అవగాహన చేసుకుని సంయమనం పాటించాలి. రాష్ట్రవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ల సరఫరాపై కమిషనర్, జేసీలతో టెలీకాన్ఫరెన్స్ ఏర్పాటు చేశాం. పాఠశాలలు, హస్పటల్స్, దేవాలయాలు, సంక్షేమ వసతి గృహాలకు ఎక్కడా కూడా గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి.' అని మంత్రి మనోహర్ అన్నారు.
{{/usCountry}}అలాగే బ్లాక్ మార్కెట్ పై ఉక్కుపాదం మోపాలని, గృహావసరాలకు వినియోగించాల్సిన సిలిండర్లను కమర్షియల్ అవసరాలకు ఉపయోగిస్తే వారిపై 6ఏ కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశామని నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఇప్పటి వరకు అనగా ఈ ఐదు రోజుల్లోనే 616 కేసులు నమోదు చేయడంతో పాటు 2500 గ్యాస్ సిలిండర్లు సీజ్ చేయడం జరిగిందన్నారు. క్షేత్రస్థాయిలో విజిలెన్స్, పౌరసరఫరాల శాఖ, రెవెన్యూ శాఖలను అప్రమత్తం చేసి జేసీల ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో కాల్ సెంటర్ ఏర్పాటు చేసి సమాచార లోపం లేకుండా చూస్తున్నామన్నారు.
'ఇక ఫెర్టిలైజర్స్, వ్యవసాయ సెక్టార్ విషయంలో 80 సబ్సిడీ సరఫరా లేకుండా చూస్తామని గ్యాస్ కంపెనీలు హామీ ఇచ్చాయి. గ్యాస్ కంపెనీల నుండి ప్రతి గంటకు ఒకసారి డెటా షేరింగ్ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈ డేటా ఆధారంగా ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటూ క్షేత్రస్థాయిలో సచివాలయ సిబ్బందిని అప్రమత్తం చేస్తూ సజావుగా పరిస్థితులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. కేంద్ర కార్యాలయంలోని 1967కు ఫిర్యాదులు గతంలో 300 కాల్స్ వచ్చేవి, కాని గత రెండు రోజుల నుండి వాటి సంఖ్య 180 దాకా తగ్గాయి. పరిస్థితి అదుపులో ఉంది.' అని నాదెండ్ల మనోహర్ అన్నారు.