జంబలకిడిపంబ.. చీరకట్టులో మగ'మహారాణులు'.. ఇక్కడ హోలీ స్పేషల్ ఇదే
Holi : హోలీ అనగానే.. రంగులు చల్లుకోవడం కామన్. కానీ కర్నూలు జిల్లాలోని ఓ ఊర్లో మాత్రం ఆచారం వేరుగా ఉంటుంది. ఇక్కడ హోలీ రోజున మగాళ్లు చీరకట్టుకుంటారు.
ఎక్కడైనా హోలీ అంటే రంగులు చల్లుకుంటారు, మిఠాయిలు పంచుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో బావాబావమరుదులు పార్టీలు చేసుకుంటారు. ఇదంతా అందరికీ తెలిసిందే. కానీ కర్నూలు జిల్లాలోని ఓ గ్రామంలో మాత్రం సీన్ వేరేగా ఉంటుంది. పురుషులు చీర కట్టుకుని.. హోలీ చేసుకుంటారు. వాళ్లు రెడీ అయిన తీరు చూస్తే కచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. గడ్డం ఉన్న ముఖాలకు పౌడర్, లిప్‌స్టిక్ పెట్టుకుంటారు. ఆ ఊరే కర్నూరు జిల్లాలోని ఆదోని మండలంలో ఉన్న సంతేకూడ్లురు గ్రామం. ఆంధ్రా-కర్ణాటక సరిహద్దులో ఈ ఊరు ఉంటుంది.

అయితే హోలీ రోజున ఈ ఆచారం వెనక ఓ కథ కూడా ఉంది. దానిని ఇక్కడి ప్రజలు బలంగా నమ్ముతారు. అందుకే ప్రతీ ఏటా చీరకట్టులో పురుషులు సింగారించుకుంటారు. ఆ కథ ఏంటంటే.. ఒకప్పుడు కర్నూలులోని సంతేకూడ్లురు గ్రామం ప్రాంతంలో కరువు ఎక్కువైందట. గ్రామస్థులు అంతా కలిసి శ్రీకృష్ణుడిని వేడుకున్నారు. పురుషులు అందరు స్త్రీ వేషధారణలతో వచ్చి భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తే.. కరువు తీరిపోతుందని ఆకాశవాణి ద్వారా వినిపించిందని స్థానికులు చెబుతారు. అలా చేశాక గ్రామంలో వర్షం పడిందట. పంటలు బాగా పండాయని గ్రామస్థులు చెబుతున్నారు.
ఇక అప్పటి నుంచి ఈ ఆచారం కొనసాగుతుంది. ఏదైనా కోరిక నెరవేరేందుకు కూడా ఈ ఆచారం ఫాలో అవుతారు. పురుషులు.. సేమ్ టూ సేమ్ మహిళలగా ముస్తాబు అవుతారు. చీర కడతారు, కాటుక పెట్టుకుంటారు, చేతులకు గాజులు వేసుకుంటారు, కాళ్లకు పారాణి రాసుకుంటారు, తలలో పూలు పెట్టుకుంటారు. అయితే వారికి మేకప్ చేసేది ఎవరో కాదు.. ఇంట్లోని మహిళలే. చాలా కఠినమైన నియమాలతో పూజలు చేస్తారు. హోలీ రోజున గ్రామంలోని రతీమన్మథుల ఆలయానికి వెళ్తారు. మెుక్కులు చెల్లించుకుంటారు.
రతీమన్మథులను స్త్రీ రూపంలో వెళ్లి దర్శించుకుంటే.. ఎలాంటి కోరికలు అయినా తీరుతాయని ఇక్కడివారి నమ్మకం. పెళ్లైన వారికి సంతానం కోసం, పెళ్లికాని యువకులు మంచి సంబంధం కోసం పూజలు చేస్తారు. అంతేకాదు అనారోగ్య సమస్యల నుంచి బయటపడినవారు కూడా వచ్చే ఏడాది చీర కట్టుకుంటామని మెుక్కుకుంటారు.
వేరే ప్రాంతాల్లో ఉన్నా.. హోలీ రోజున ఈ గ్రామానికి చెందినవారు కచ్చితంగా వస్తారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా తరతరాలుగా తమ ఊర్లో వస్తున్న ఆచారాన్ని పాటిస్తారు. ఈ హోలీని చూసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలామంది వస్తుంటారు. ఈ ఏడాది ఏదైనా కోరిక కోరుకుని.. వచ్చే ఏడాది వరకు తీరితే.. కూడా చీర కట్టులో ముస్తాబు అవుతుటారు పురుషులు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


