ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతంలో రహదారి మౌలిక వసతులను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీసత్యసాయి జిల్లా పరిధిలోని ముదిగుబ్బ - కదిరి గ్రామాల మధ్య విస్తరించి ఉన్న ఎన్‌హెచ్-42 రహదారిని నాలుగు వరుసల మార్గంగా విస్తరించేందుకు రూ.679.71 కోట్ల నిధులను మంజూరు చేసినట్లు కేంద్ర రహదారి రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ప్రకటన విడుదల చేశారు.

ఈ విస్తరణ ప్రాజెక్టు ద్వారా కేవలం రహదారిని వెడల్పు చేయడమే కాకుండా, ప్రయాణికుల భద్రత, సులువుగా వాహనాలు వెళ్లేందుకు వీలుగా అత్యాధునిక నిర్మాణాలను చేపడుతున్నారు: అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించే 4 వరుసల రహదారిలో ప్రధాన కారేజ్‌వే, స్థానిక గ్రామాల ప్రజలకు, నెమ్మదిగా వెళ్లే వాహనాలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక సర్వీస్ రహదారులు వస్తాయి.
ట్రాఫిక్ నిర్వహణ కోసం ఒక నూతన ఫ్లైఓవర్, వాహనాల రాకపోకల కోసం ఒక వెహికిల్ అండర్‌పాస్ కం రోడ్డు ఓవర్ బ్రిడ్జి ఇందులో భాగంగా రానుంది. మార్గ మధ్యలో రవాణాకు అడ్డంకిగా ఉన్న నీటి ప్రవాహాల వద్ద ఒక ప్రధాన భారీ బ్రిడ్జి నిర్మాణం చేపడతారు.
ఈ రహదారి వల్ల అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల ప్రజలకు పొరుగు రాష్ట్రమైన కర్ణాటకతో నేరుగా వేగవంతమైన అనుసంధానం లభిస్తుంది. ప్రతిష్టాత్మక బెంగళూరు - విజయవాడ - కోల్‌కతా ఎక్స్‌ప్రెస్‌వేకు ఇది అనుసంధాన మార్గంగా మారి ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గిస్తుంది.
తిరుపతి పుణ్యక్షేత్రానికి, చెన్నై పారిశ్రామిక కారిడార్‌కు వెళ్లే ప్రయాణికులకు సురక్షితమైన, వేగవంతమైన రవాణా అందుబాటులోకి వస్తుంది.
ఈ ప్రాంతంలో విస్తారంగా పండే వేరుశనగ, టమోటా, ఇతర పండ్ల తోటల ఉత్పత్తులను సరిహద్దు రాష్ట్రాలకు, ప్రధాన నగరాల మార్కెట్లకు వేగంగా తరలించడానికి ఈ 4 వరుసల రహదారి ఎంతో కీలకమవుతుంది. సరకు రవాణా వ్యయం తగ్గి, స్థానిక వ్యాపార, పారిశ్రామిక రంగాలు ఊపందుకుంటాయని, తద్వారా ప్రాంతీయంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని భావిస్తున్నారు.
{{/usCountry}}ఈ ప్రాంతంలో విస్తారంగా పండే వేరుశనగ, టమోటా, ఇతర పండ్ల తోటల ఉత్పత్తులను సరిహద్దు రాష్ట్రాలకు, ప్రధాన నగరాల మార్కెట్లకు వేగంగా తరలించడానికి ఈ 4 వరుసల రహదారి ఎంతో కీలకమవుతుంది. సరకు రవాణా వ్యయం తగ్గి, స్థానిక వ్యాపార, పారిశ్రామిక రంగాలు ఊపందుకుంటాయని, తద్వారా ప్రాంతీయంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని భావిస్తున్నారు.
{{/usCountry}}