...
...
Next Story

ముద్రగడ ఇంటి వద్ద టెన్షన్.. తండ్రిని చివరిసారి చూసేందుకు వచ్చిన కుమార్తె.. క్రాంతి గోబ్యాక్ నినాదాలు!

ముద్రగడ పద్మనాభం ఇంటి వద్ద కాసేపు టెన్షన్ వాతావరణ నెలకొంది. తండ్రిని కడసారి చూసేందుకు ఆయన కుమార్తె క్రాంతి వచ్చారు. కానీ క్రాంతి గో బ్యాక్ అంటూ ముద్రగడ అనుచరులు నినాదాలు చేస్తూ చూడనివ్వలేదు.

Published on: Jul 15, 2026, 12:02:55 IST
Advertisement

కాపు సామాజికవర్గ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతి చెందడంతో ఆయన స్వగ్రామమైన కాకినాడ జిల్లా కిర్లంపూడిలో తీవ్ర విషాదం నెలకొంది. అయితే ఆయన పార్థివదేహాన్ని కడసారి చూసేందుకు వచ్చిన కుమార్తె క్రాంతిని కుటుంబ సభ్యులు, ముద్రగడ అనుచరులు అడ్డుకున్నారు. దీంతో కిర్లంపూడిలోని ముద్రగడ నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. గో బ్యాక్ క్రాంతి అంటూ ముద్రగడ అనుచరులు నివాసం వెలుపల పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అక్కడ గందరగోళం వాతావరణం ఏర్పడింది.

ముద్రగడ ఇంటి వద్ద టెన్షన్
ముద్రగడ ఇంటి వద్ద టెన్షన్

ముద్రగడ పద్మనాభంతో ఆయన కుమార్తె క్రాంతికి కొంతకాలంగా తీవ్రమైన కుటుంబ, రాజకీయ విభేదాలు ఉన్నాయి. ముఖ్యంగా 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఈ విభేదాలు బహిర్గతమయ్యాయి. ఆ ఎన్నికల్లో ముద్రగడ పద్మనాభం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరగా, ఆయన కుమార్తె క్రాంతి మాత్రం ఆయన ఇష్టానికి వ్యతిరేకంగా జనసేన పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు బహిరంగంగానే విమర్శలు చేసుకున్నారు.

తన తండ్రి, సోదరుడి నుంచి తనకు ప్రాణహాని ఉందని క్రాంతి గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు.. గతేడాది ముద్రగడ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సమయంలో ఆయనకు క్యాన్సర్ ఉందని, కుటుంబ సభ్యులు ఆ విషయాన్ని దాస్తున్నారని వ్యాఖ్యానించారు.

తనపై కుమార్తె చేసిన ఆరోపణల పట్ల తీవ్ర వేదనకు గురైన ముద్రగడ పద్మనాభం.. తన రాజకీయ ప్రత్యర్థుల చేతిలో కుమార్తె పావుగా మారిందని ఆవేదన చెందారు. ఈ మేరకు 'నేను చనిపోయాక నా కుమార్తె క్రాంతి నా ముఖం చూడటానికి వీల్లేదు, చివరి చూపునకు కూడా రావద్దు.' అని కామెంట్స్ చేశారు.

తండ్రి మరణవార్త విన్న క్రాంతి.. కడసారి చూపు కోసం పోలీసుల భద్రత నడుమ కిర్లంపూడిలోని ఇంటికి వచ్చారు. కానీ ఆమెను చూడగానే ముద్రగడ భార్య(క్రాంతి తల్లి), ఇతర కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెను లోపలికి రానిచ్చేది లేదని చెప్పారు. అక్కడి నుంచి పంపించేయాలని పోలీసులను కోరారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe