ఏపీ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా మీడియా సమావేశంలో మాట్లాడారు. పులివెందుల అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. పులివెందుల అంశం మీద ఎస్పీతో మాట్లాడినట్టుగా వెల్లడించారు. నివేదిక వస్తే చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. ఏవైనా సమస్యలు ఉంటే.. అధికారులు నివేదిక పంపుతారని చెప్పారు. కలెక్టర్, ఎస్పీ, ఎన్నికల పరిశీలకులు ఇచ్చిన నివేదికల ఆధారంగానే రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

'కొన్ని జిల్లాల్లో చిన్న చిన్న ఫిర్యాదులు వచ్చాయి. మరికొన్ని జిల్లాల నుంచి అసలు ఫిర్యాదులు రాలేదు. శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు ఏ జిల్లాలోనూ పోలింగ్ సమస్యలు లేవు. అనంతపురం, పల్నాడు జిల్లాల నుంచి కొన్ని ఫిర్యాదులు వచ్చాయి. ఆయా జిల్లాల నుంచి వచ్చిన ఆధారాలు చూసి నిర్ణయం తీసుకుంటాం.' అని ఎస్ఈసీ పునేఠా అన్నారు.
వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలించామన్నారు ఎస్ఈసీ. అన్ని జిల్లాల్లో పోలింగ్ తీరుపై సమీక్ష నిర్వహించామన్నారు. జిల్లాల పరిశీలకులతో ఎప్పటికప్పుడు మాట్లాడమన్నారు. శాంతిభద్రతల అంశం ప్రధానమని అధికారులకు చెప్పామన్నారు.
ఏపీలో 92 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ముగిసిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా ప్రకటించారు. 11 కార్పొరేషన్లు, 73 మున్సిపాలిటీలు, 6 నగర పంచాయతీల్లో పోలింగ్ ముగిసినట్లుగా తెలిపారు. నవంబర్ 3వ తేదీన ఫలితాలు ఉంటాయని పేర్కొన్నారు. సాయంత్రం 5 గంటలలోపు బూత్‌లో ఓటు వేయడానికి క్యూలో ఉన్నవారికే అవకాశం కల్పిస్తామన్నారు. అయితే విజయవాడ 55వ డివిజన్లో ఓటంగ్ సమయాన్ని పొడిగించినట్టుగా వెల్లడించారు. రాత్రి 7.30 దాకా పోలింగ్ అన్నారు.
'విజయవాడ 55వ డివిజన్లో బ్యాలెట్ పేపర్ మీద గుర్తులు తారుమారు కావడం కారణంగా ఓటింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. అందుకే అదనపు సమయాన్ని కేటాయించాం. మిగిలిన ప్రాంతాల్లో పోలింగ్ ముగిసినందున బ్యాలెట్ బాక్సుల తరలిస్తున్నాం. శాంతి భద్రతల అంశాన్ని ప్రధానంగా భావించి ఎన్నికలు నిర్వహించాం. వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలించాం. ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాలు నవంబర్ 3వ తేదీన వెలువడుతాయి.' అని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా పేర్కొన్నారు.
{{/usCountry}}'విజయవాడ 55వ డివిజన్లో బ్యాలెట్ పేపర్ మీద గుర్తులు తారుమారు కావడం కారణంగా ఓటింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. అందుకే అదనపు సమయాన్ని కేటాయించాం. మిగిలిన ప్రాంతాల్లో పోలింగ్ ముగిసినందున బ్యాలెట్ బాక్సుల తరలిస్తున్నాం. శాంతి భద్రతల అంశాన్ని ప్రధానంగా భావించి ఎన్నికలు నిర్వహించాం. వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలించాం. ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాలు నవంబర్ 3వ తేదీన వెలువడుతాయి.' అని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా పేర్కొన్నారు.
{{/usCountry}}నవంబర్ 2 వరకు పోలింగ్ శాతంపై స్పష్టత వస్తుందని ఎస్ఈసీ చెప్పారు. 2021లో 63.6 పోలింగ్ శాతం నమోదైందన్నారు. ఫిర్యాదులు వచ్చిన జిల్లాల కలెక్టర్, ఎస్పీల నివేదికల ఆధారంగా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఆధారాలు లేకుండా ఎలాంటి చర్యలు తీసుకోలేమని స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారమే ఎన్నికల సంఘం పనిచేస్తుందని గుర్తుచేశారు. నవంబర్ 3వ తేదీన ఓట్ల లెక్కింపు కోసం పటిష్ట ఏర్పాట్లు చేస్తు్న్నామని వెల్లడించారు.