నా బార్డ్‌లో 162 డెవలప్‌మెంట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్.. జాబ్ కొడితే లైఫ్ సెట్!

నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్(NABARD) డెవలప్‌మెంట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 3గా నిర్ణయించారు. ఏపీలోనూ ఖాళీలు ఉన్నాయి.

Published on: Jan 19, 2026, 15:38:56 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బ్యాంకింగ్ రంగంలో కెరీర్‌ను కొనసాగించడానికి ఆసక్తి ఉన్న యువతకు నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్(నాబార్డ్)లో ఉద్యోగ అవకాశం ఉంది. నాబార్డ్ డెవలప్‌మెంట్ అసిస్టెంట్, రియు డెవలప్‌మెంట్ అసిస్టెంట్(హిందీ) పోస్టులకు నియామకాలను ప్రకటించింది. 162 ఖాళీల కోసం ఈ నియామకానికి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 3గా నిర్ణయించారు. నాబార్డ్ వెబ్‌సైట్ https://www.nabard.org/ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు.

నా బార్డ్‌లో ఉద్యోగాలు
నా బార్డ్‌లో ఉద్యోగాలు

నాబార్డ్‌లో 159 డెవలప్‌మెంట్ అసిస్టెంట్ల ఖాళీలు ఉన్నాయి. వీరిని దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతీయ కార్యాలయాల్లో నియమిస్తారు. డెవలప్‌మెంట్ అసిస్టెంట్ల (హిందీ) కోసం మూడు ఖాళీలు ఉన్నాయి. మెుత్తం 162 పోస్టులు. ఈ నియామకాలు స్పెషలైజేషన్ ఆధారంగా ఉంటాయి. ఈ నియామకం గ్రూప్ బీ స్థాయిలో ఉంటుంది. ఎంపికైన యువతకు గ్రామీణ భారతదేశ అభివృద్ధికి, బ్యాంకింగ్ కార్యకలాపాలకు సంబంధించిన పరిపాలనా పనులకు దోహదపడే అవకాశం వస్తుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు 8 పోస్టులు ఉన్నాయి.

అర్హతలు

ఈ నియామకానికి అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, PWD, మాజీ సైనికులకు, ఉత్తీర్ణత మాత్రమే చాలు. డెవలప్‌మెంట్ అసిస్టెంట్(హిందీ) పోస్టులకు అభ్యర్థులు హిందీ, ఇంగ్లీష్‌ను ప్రాథమిక సబ్జెక్టులుగా లేదా గ్రాడ్యుయేషన్‌లో బోధనా మాధ్యమంగా కలిగి ఉండాలి. ఇంగ్లీష్- హిందీ ట్రాన్సలేషన్ చేయగలగాలి. కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాలి.

వయోపరిమితి 21 నుండి 35 సంవత్సరాలుగా ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు

జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి రూ.550, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల, మాజీ సైనికులకు రూ.100గా అప్లికేషన్ ఫీజు నిర్ణయించారు.

జీతం, ఎంపిక విధానం

ఇక జీతం విషయానికొస్తే నెలకు రూ.46,500. ఎంపిక విధానం ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ పరీక్ష(ఆన్‌లైన్), లాంగ్వేజ్ ప్రొఫిషఇయన్సీ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఉంటాయి.

ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రారంభ తేదీ: 17.01.2026. దరఖాస్తు చివరి తేదీ: 03-02-2026గా నిర్ణయించారు. ప్రిలిమినరీ పరీక్ష 21.02.2026 ఉండగా.. మెయిన్‌ పరీక్ష: 12.04.2026న ఉండనుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More