...
...
Next Story

నారావారిపల్లెలో లోకేశ్ ప్రజాదర్బార్.. తిరుమల అంగప్రదక్షణ టోకెన్స్‌పై రిక్వెస్ట్

సంక్రాంతి పండుగ సందర్భంగా నారావారిపల్లెలో ఉన్నారు మంత్రి లోకేశ్. అక్కడే ప్రజాదర్బార్ నిర్వహించి.. సమస్యలు తెలుసుకున్నారు.

Published on: Jan 14, 2026, 18:49:50 IST
Advertisement

నారావారిపల్లెలోని తన నివాసంలో 81వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు మంత్రి నారా లోకేశ్. వివిధ సమస్యలపై వినతులు స్వీకరించారు. వారసత్వంగా సంక్రమించిన 1.83 ఎకరాల భూమిని అన్యాక్రాంతం చేశారని, విచారించి న్యాయం చేయాలని అన్నమయ్య జిల్లా బసినికొండకు చెందిన పి.శివకుమార్ కోరారు.

ప్రజాదర్బార్‌లో లోకేశ్
ప్రజాదర్బార్‌లో లోకేశ్

తిరుమలలో అంగప్రదక్షణ భక్తులకు ఆఫ్‌లైన్ ద్వారా టోకెన్స్ జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని ‘తిరుమలలో అంగప్రదక్షణ భక్తబృందం’ ప్రతినిధులు మంత్రి లోకేశ్‌ను విజ్ఞప్తి చేశారు. చిత్తూరు జిల్లా కచ్చరావేడులో దళితులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని బి.శ్రీనివాసులు కోరారు. వారసత్వంగా సంక్రమించిన తమ రెండెకరాల భూమిని ఆన్‌లైన్‌లో నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నమయ్య జిల్లా బలిజపల్లికి చెందిన కె.పార్వతి విజ్ఞప్తి చేశారు. ఆయా వినతులను పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు.

సంక్రాంతి పండుగ సందర్భంగా సీఎం చంద్రబాబు కుటుంబం నారావారిపల్లెలో ఉన్నారు. భోగి పండగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హరిదాసుల సంకీర్తనలు, గంగిరెద్దుల ప్రదర్శనలను ముఖ్యమంత్రి కుటుంబం ఆసక్తిగా తిలకించింది. మంత్రి నారా లోకేశ్ కూడా ఇక్కడే ఉన్నారు. నాలుగు రోజులపాటు స్వగ్రామంలోనే ఉండి.. సంక్రాంతి సంబరాలు జరుపుకొంటారు.

మరోవైపు ముఖ్యమంత్రి, మంత్రి తమ గ్రామంలో ఉండటంతో గ్రామస్థుల నుంచి అనేక వినతులు వస్తున్నాయి. వాటిని చంద్రబాబు, లోకేశ్ స్వీకరించారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.

వేగమే అభివృద్ధికి కీలకం : లోకేశ్

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks