...
...
Next Story

వారంలో 500 కుక్కలను చంపేశారు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ కోసమే!

తెలంగాణలో వందల సంఖ్యలో కుక్కలను చంపడంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. వారంలో రెండు జిల్లాల్లో 500 కుక్కలను చంపేశారు.

Updated on: Jan 14, 2026, 17:30:19 IST
Advertisement

తెలంగాణలోని హనుమకొండ, కామారెడ్డి జిల్లాల్లో వారం రోజుల్లో 500 కుక్కలను చంపేశారు. అయితే బయటకు రాని ఘటనలు ఇంకా ఉన్నాయనే అనుమానాలు కూడా ఉన్నాయి. గ్రామాల్లో వీధి కుక్కల బెడద లేకుండా చేస్తామని, ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థులు ఇచ్చిన హామీ ప్రకారమే.. ఈ ఘటనలు జరుగుతున్నాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

మరోవైపు వీధి కుక్కలను సామూహికంగా చంపడంపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. హన్మకొండ, కామారెడ్డి జిల్లాలలో ఏడుగురు సర్పంచ్‌లు సహా అనేక మందిపై చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. కొత్త సంవత్సరం మొదటి రెండు వారాల్లో కనీసం 500 కుక్కలను విషప్రయోగం చేసి చంపారనే నివేదికల తర్వాత జంతు హింసపై చర్చ నడుస్తోంది.

ఇటీవలి గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో అనేక మంది సర్పంచ్ అభ్యర్థులు జనాలకు కుక్కలు లేని గ్రామంగా చేస్తామని హామీ ఇచ్చారు. గెలిచిన తర్వాత కుక్కలను చంపడం మెుదలైంది. భవానీపేట, పాల్వంచ, ఫరీద్‌పేట గ్రామాలలో ఈ సంఘటనలు జరిగినట్లు పోలీసుల విచారణలో నిర్ధారణ అయింది. మంగళవారంభవానీపేట, పాల్వంచ గ్రామ శివార్లలో సుమారు 150 కుక్కల కళేబరాలు లభించాయని అధికారులు తెలిపారు. బుధవారం ఫరీద్‌పేటలో జరిపిన తనిఖీలలో అక్కడ మరో 50 కుక్కలు చంపబడినట్లు వెల్లడైంది.

పోస్ట్‌మార్టం పరీక్షల కోసం పశువైద్య బృందాలు కళేబరాలను వెలికితీశాయి. మరణానికి ఖచ్చితమైన కారణాన్ని నిర్ధారించడానికి, ఉపయోగించిన విషాన్ని గుర్తించడానికి అంతర్గత అవయవాల నమూనాలను ఫోరెన్సిక్ సైన్స్ ప్రయోగశాలకు పంపారు.

ఈ నెల ప్రారంభంలో హనుమకొండ జిల్లాలో శాయంపేట, ఆరేపల్లి గ్రామాలలో 300 వీధి కుక్కలను చంపిన కేసు బయటకొచ్చింది. ఆ కేసులో పోలీసులు జనవరి 9, 2026న ఇద్దరు మహిళా సర్పంచులు, వారి భర్తలు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఇతరులతో సహా తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో సుమారు 110 కుక్కల మరణాలు నిర్ధారించామని అధికారులు చెబుతున్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe